Exter vs Fronx : హ్యుందాయ్​ ఎక్స్​టర్​ వర్సెస్​ మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​.. ఏది బెస్ట్​?-hyundai exter vs maruti suzuki fronx which suv is best see details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Exter Vs Fronx : హ్యుందాయ్​ ఎక్స్​టర్​ వర్సెస్​ మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​.. ఏది బెస్ట్​?

Exter vs Fronx : హ్యుందాయ్​ ఎక్స్​టర్​ వర్సెస్​ మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​.. ఏది బెస్ట్​?

Sharath Chitturi HT Telugu
Jul 11, 2023 02:45 PM IST

Hyundai Exter vs Maruti Suzuki Fronx : హ్యుందాయ్​ ఎక్స్​టర్​ వర్సెస్​ మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​.. ఈ రెండింట్లో ఏ ఎస్​యూవీ బెస్ట్​? ఇక్కడ తెలుసుకుందాము..

హ్యుందాయ్​ ఎక్స్​టర్​ వర్సెస్​ మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​.. ఏది బెస్ట్​?
హ్యుందాయ్​ ఎక్స్​టర్​ వర్సెస్​ మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​.. ఏది బెస్ట్​?

Hyundai Exter vs Maruti Suzuki Fronx : దేశ ఆటోమొబైల్​ మార్కెట్​లో లేటెస్ట్​ ఎంట్రీ హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఇప్పుడు హాట్​ టాపిక్​గా మారింది. తక్కువ ధరకు అదిరిపోయే ఫీచర్స్​ ఇస్తున్న ఈ ఎస్​యూవీపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. మరోవైపు ఈ మోడల్​.. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​కు గట్టిపోటీనిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి.. ఏది బెస్ట్​? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..

ఈ రెండింటి స్పెసిఫికేషన్స్​ ఏంటి..?

ఎక్స్​టర్​ ఎస్​యూవీలో ప్రొజెక్టర్​ ఎల్​ఈడీ హెడ్​లైట్స్​, ఎల్​ఈడీ టెయిల్​ల్యాంప్స్​, బ్లాక్​ రేడియేటర్​ గ్రిల్​, సిల్వర్డ్​ స్కిడ్​ ప్లేట్స్​, రూఫ్​ రెయిల్స్​, ఇండికేటర్​ మౌంటెడ్​ ఓఆర్​వీఎంలు, క్లాడింగ్​, 15 ఇంచ్​ డైమెంట్​ కట్​ అలాయ్​ వీల్స్​ వస్తున్నాయి.

ఇక మారుతీ ఫ్రాంక్స్​ ఎస్​యూవీలో బ్లాక్​డ్​ ఔట్​ గ్రిల్​, పెద్ద హుడ్​, రూఫ్​ రెయిల్స్​, ఇండికేటర్​ మౌంటెడ్​ ఓఆర్​వీఎంలు, ఆల్​ ఎల్​ఈడీ లైటింగ్​, బ్లాక్​డ్​ ఔట్​ వీల్​ ఆర్చీస్​, 16 ఇంచ్​ అలా వీల్స్​ వస్తున్నాయి.

Hyundai Exter dimensions : డైమెన్షన్స్​ విషయానికొస్తే.. ఎక్స్​టర్​ పొడవు 3,815ఎంఎం. వెడల్పు 1,710ఎంఎం. వీల్​బేస్​ 2,450ఎంఎం. మరోవైపు ఫ్రాంక్స్​ పొడవు 3,999ఎంఎం. వెడల్పు 1,765ఎంఎం. వీల్​బేస్​ 2,520ఎంఎం.

ఇదీ చూడండి:- Maruti Suzuki Fronx vs Baleno : ఫ్రాంక్స్​ వర్సెస్​ బలెనో.. ఈ కార్లలో ఏది బెస్ట్​?

ఈ రెండింటి ఫీచర్స్​ ఎలా ఉన్నాయంటే..

హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఎస్​యూవీ 5 సీటర్​ కేబిన్​లో బ్లాక్​డ్​ ఔట్​ డాష్​బోర్డ్​, లెథర్​ వ్రాప్డ్​ స్టీరింగ్​ వీల్​, కూల్డ్​ గ్లోవ్​ బాక్స్​, మెటల్​ పెడల్స్​, రేర్​ ఏసీ వెంట్స్​, క్రోమ్​ ఫినిష్డ్​ గేర్​ నాబ్​లు వస్తున్నాయి. వయర్​లెస్​ స్మార్ట్​ఫోన్​ ఛార్జర్​, 2.32 ఇంచ్​ డిస్​పలే ట్విన్​ కెమెరాలతో కూడిన డాష్​బోర్డ్​. 8 ఇంచ్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​. డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, వాయిస్​ కమాండ్​తో కూడిన ఎలక్ట్రిక్​ సన్​రూఫ్​, 6 ఎయిర్​బ్యాగ్స్​, క్రూజ్​ కంట్రోల్​, ఏబీఎస్​, ఈఎస్​సీ వంటివి లభిస్తున్నాయి.

Maruti Suzuki Fronx price in Hyderabad : మరోవైపు మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​లో లెథరెట్​ అప్​హోలిస్ట్రీ, డ్యూయెల్​ టోన్​ డాష్​బోర్డ్​, రేర్​ ఏసీ వెంట్స్​, క్రోమ్​ ప్లేటెడ్​ డోర్​ హ్యాండిల్స్​, ఫ్లాట్​ బాటమ్​ మల్టీఫంక్షనల్​ స్టీరింగ్​ వీల్​, రేర్​ పార్సెల్​ ట్రే, హెడ్​ అప్​ డిస్​ప్లే, వయర్​లెస్​ ఛార్జర్​, 9 ఇంచ్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, యాంబియెంట్​ లైటింగ్​, 6 ఎయిర్​బ్యాగ్స్​, ఈఎస్​సీ, రేర్​ వ్యూ కెమెరాలు వస్తున్నాయి.

ఈ రెండు ఎస్​యూవీలోని ఇంజిన్​ ఆప్షన్స్​ ఇవే..

హ్యుందాయ్​ కొత్త వెహికిల్​లో 1.2 లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 82 హెచ్​పీ పవర్​ను, 113.8 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 5 స్పీడ్​ మేన్యువల్​/ ఏఎంటీ గేర్​బాక్స్​ ఆప్షన్​ ఉంది. సీఎన్​జీ వేరియంట్​ కూడా అందుబాటులో ఉండనుంది.

మారుతీ సుజుకీ వెహికల్​లో 1.2 లీటర్​ డ్యూయెల్​జెట్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 89హెచ్​పీ పవర్​ను, 113ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 1.0 లీటర్​ బూస్టర్​జెట్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​.. 99 హెచ్​పీ పవర్​ను, 147.6 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 5 స్పీడ్​ మేన్యువల్​, 6 స్పీడ్​ ఆటోమెటిక్​ గేర్​బాక్స్​ ఆప్షన్స్​ ఉన్నాయి.

వీటి ధరలు ఎంతంటే..

Hyundai Exter price : ఎక్స్​టర్​ ఎక్స్​షోరూం ధర రూ. 5.99లక్షలు- రూ. 9.5లక్షల వరకు ఉంటుంది. ఇక ఫ్రాంక్స్​ ఎక్స్​షోరూం ధర రూ. 7.49లక్షలు- రూ. 13.13లక్షల మధ్యలో ఉంటుంది.

WhatsApp channel

సంబంధిత కథనం