Kia Sonet facelift vs Tata Nexon : ఈ రెండు ఫేస్‌లిఫ్ట్ వర్షెన్స్లో ఏది బెస్ట్?
15 December 2023, 13:20 IST
- Kia Sonet facelift vs Tata Nexon : కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ వర్సెస్ టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్.. ఈ రెండింట్లో ఏది బెస్ట్?
ఈ రెండు ఫేస్‌లిఫ్ట్ వర్షెన్స్లో ఏది బెస్ట్?
Kia Sonet facelift vs Tata Nexon facelift : కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌ని సంస్థ అధికారికంగా రివీల్ చేసింది. ఈ మోడల్.. ఇండియాలోనే బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీల్లో ఒకటైన టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌కి గట్టి పోటీనివ్వనుంది. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి, ఏది బెస్ట్? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ వర్సెస్ టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్- లుక్స్..
కియ సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌లో స్కల్ప్టెడ్ బానెడ్, ఎల్ఈడీ హెడ్‌లైట్స్ విత్ రీడిజైన్డ్ డీఆర్ఎల్స్, స్కిడ్ ప్లేట్‌తో కూడిన రిఫ్రెష్డ్ బంపర్స్, కెమెరాతో కూడిన ఓఆర్వీఎంలు, 16 ఇంచ్ డ్యూయెల్ టోన్ వీల్స్, కనెక్టెడ్ టైప్ ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్స్ వంటివి వస్తున్నాయి.
ఇక 2023 టాటా నెక్సాన్‌లో బ్లాక్డ్-ఔట్ గ్రిల్, బంపర్ మౌంటెడ్ ప్రొజెక్టర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, సీక్వెన్షియల్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఫ్లైర్డ్ వీల్ ఆర్చీస్, కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్స్, 16 ఇంచ్ డైమెండ్ కట్ వీల్స్ ఉంటాయి.
కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ వర్సెస్ టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్- ఫీచర్స్..
Kia Sonet facelift 2024 price : 2024 కియా సోనెట్ ఎస్యూవీ 5 సీటర్ కేబిన్‌లో పవర్డ్ డ్రైవింగ్ సీట్, ప్రీమియం లెథరెట్ అప్‌హోలిస్ట్రీ, ఎయిర్ ప్యూరిఫయర్, వెంటిలేటెడ్ సీట్స్, మూడ్ లైటింగ్, 6ఎయిర్‌బ్యాగ్స్, బోస్ సౌండ్ సిస్టెమ్, 360 డిగ్రీ వ్యూ కెమెరా, ఏడీఏఎస్ వంటివి ఉంటాయి.
మరోవైపు టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ కేబిన్‌లో లెథరెట్ అప్‌హోలిస్ట్రీ, వెంటిలేటెడ్ ఫ్రెంట్ సీట్స్, వాయిస్ అసిస్టెడ్ సన్‌రూఫ్, టచ్- సెన్సిటివ్ ఏసీ కంట్రోల్స్, 6 ఎయిర్‌బ్యాగ్స్ లభిస్తున్నాయి.
కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ వర్సెస్ టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్- ఇంజిన్..
కియా సోనెట్ కొత్త వర్షెన్‌లో 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. 5 స్పీడ్ మేన్యువల్, 6 స్పీడ్ మేన్యువల్, ఐఎంటీ, టార్క్- కన్వర్ట్ ఆటోమెటిక్, 7 స్పీడ్ జీఎస్జీ గేర్‌బాక్స్ ఆప్షన్స్ ఉన్నాయి.
Tata Nexon facelift price : 2023 టాటా నెక్సాన్‌లో 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్లు ఉన్నాయి. మేన్యువల్, ఏఎంటీ, డీసీఏ గేర్‌బాక్స్ ఆప్షన్స్ ఉంటాయి.
కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ వర్సెస్ టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్- ధరలు..
2024 కియా సోనెట్ ఎక్స్‌షోరూం ధర రూ. 8లక్షలు- రూ. 16లక్షల మధ్యలో ఉండొచ్చు. ఇక టాటా నెక్సాన్ కొత్త వర్షెన్ ఎక్స్‌షోరూం ధర రూ. 8.1లక్షలు- రూ. 15.5లక్షల మధ్యలో ఉంటుంది.