Renault Duster vs Hyundai Creta : ఈ రెండు ఎస్‌యూవీల్లో ఏది బెస్ట్?
30 November 2023, 14:40 IST
- Renault Duster vs Hyundai Creta : రెనాల్ట్ డస్టర్ వర్సెస్ హ్యుందాయ్ క్రేటా.. ఏది బెస్ట్? ఇక్కడ తెలుసుకుందాము..
ఈ రెండు ఎస్‌యూవీల్లో ఏది బెస్ట్?
Renault Duster vs Hyundai Creta : 2024 రెనాల్ట్ డస్టర్ ఎస్‌యూవీని తాజాగా రివీల్ చేసింది ఆటోమొబైల్ సంస్థ. ఇండియాలో కూడా ఈ మోడల్ లాంచ్ అవుతుంది. కాగా.. లాంచ్ తర్వాత ఈ ఎస్యూవీ.. కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రేటాలకు గట్టి పోటీనిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డస్టర్‌ని హ్యుందాయ్ క్రేటాతో పోల్చి, ఏది బెస్ట్‌గా ఉంది? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
రెనాల్ట్ డస్టర్ వర్సెస్ హ్యుందాయ్ క్రేటా- లుక్స్..
2024 రెనాల్ట్ డస్టర్‌లో మస్క్యులర్ బానెట్ ఉంటుంది. ఫుల్ విడ్త్ గ్రిల్, స్లీక్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ విత్ డీఆర్ఎల్స్, స్కిడ్ ప్లేట్స్, రూఫ్ రెయిల్స్, రగ్డ్ అలాయ్ వీల్స్, వై షేప్ ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్స్ వంటివి వస్తున్నాయి.
Renault Duster 2024 : ఇక హ్యుందాయ్ క్రేటాలో స్కల్ప్టెడ్ బానెట్, ట్రిపుల్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, స్ల్పిట్ టైప్ డీఆర్ఎల్స్, భారీ క్రోమ్ గ్రిల్, స్కిడ్ ప్లేట్స్, సిల్వర్డ్ రూఫ్ రెయిల్స్, షార్క్ ఫిన్ యాంటీనా, డమైండ్ కట్ వీల్స్, ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్స్ వంటివి లభిస్తున్నాయి.
రెనాల్ట్ డస్టర్ వర్సెస్ హ్యుందాయ్ క్రేటా- ఫీచర్స్..
డస్టర్ ఎస్యూవీ ఇంటీరియర్‌పై ఇంకా పూర్తి వివరాలు అందుబాటులో లేవు. కాకపోతే ఇందులో స్టైలిష్ డాష్‌బోర్డ్, ప్రీమియం ఫాబ్రిక్ అప్‌హోలిస్ట్రీ, ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంబియెంట్ లైటింగ్, వయర్లెస్ ఛార్జర్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట క్లస్టర్, వంటివి వస్తాయని టాక్ నడుస్తోంది.
Renault Duster 2024 price India : హ్యుందాయ్ క్రేటా కేబిన్‌లో బ్లాక్డ్ ఔట్ డాష్‌బోర్డ్, ఆటోమెటిక్ ఏసీ, లెథర్ అప్‌హోలిస్ట్రీ, వయర్లెస్ ఛార్జర్, సన్‌రూఫ్, 10.24 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్ వంటివి వస్తున్నాయి.
రెనాల్ట్ డస్టర్ వర్సెస్ హ్యుందాయ్ క్రేటా- ఇంజిన్..
డస్టర్‌లో 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.3 లీటర్ టర్పో పెట్రోల్, 1.2 లీటర్ పెట్రోల్- హైబ్రీడ్ ఇంజిన్ ఆప్షన్స్ వస్తున్నాయి. మేన్యువల్, సీవీటీ గేర్‌బాక్స్ ఆప్షన్స్ లభిస్తున్నాయి.
Renault Duster India : ఇక హ్యుందాయ్ క్రేటాలో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ వస్తున్నాయి. 6 స్పీడ్ మేన్యువల్, 6 స్పీడ్ ఆటోమెటిక్, ఐవీటీ గేర్‌బాక్స్‌లు ఉన్నాయి.
రెనాల్ట్ డస్టర్ వర్సెస్ హ్యుందాయ్ క్రేటా- ధర వివరాలు..
ఇండియాలో హ్యుందాయ్ క్రేటా ఎస్యూవీ ఎక్స్‌షోరూం ధర రూ. 10.87లక్షలు- రూ. 19.2లక్షల మధ్యలో ఉంది. రెనాల్ట్ డస్టర్ ధరకు సంబంధించిన వివరాలను సంస్థ ఇంకా వెల్లడించలేదు. కాకపోతే.. ఈ మోడల్ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 10లక్షలుగా ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. ఇదే నిజమైతే.. ఎస్యూవీ సెగ్మెంట్లో ఉన్న పోటీని మరింత పెచుతుంది రెనాల్ట్ డస్టర్.
Hyundai Creta on road price Hyderabad : 2025లో ఈ రెనాల్ట్ డస్టర్ ఎస్యూవీ.. ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.