RE Himalayan 450 vs Yezdi Adventure: యెజ్డీ అడ్వెంచర్ వర్సెస్ హిమాలయన్ 450.. ఏ బైక్ కొనడం బెటర్?
28 November 2023, 18:50 IST
RE Himalayan 450 vs Yezdi Adventure: యెజ్డీ అడ్వెంచర్ ధర కన్నా రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయన్ 450 ధర ఎక్కువ. అయితే హిమాలయన్ 450 లో మరింత పవర్, అధునాతన హార్డ్‌వేర్, మరిన్ని ఫీచర్స్ ఉన్నాయి.
ప్రతీకాత్మక చిత్రం
RE Himalayan 450 vs Yezdi Adventure: అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హిమాలయన్ 450ని భారత మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్ ఎట్టకేలకు విడుదల చేసింది. ఇప్పుడు, కొత్త-తరం హిమాలయన్ వచ్చింది కాబట్టి, హిమాలయన్ 411ని నిలిపివేసే అవకాశం ఉంది. హిమాలయన్ 450 యొక్క ప్రత్యర్థులలో యెజ్డీ అడ్వెంచర్ ఒకటి. ఈ రెండు బైక్స్ లో ఏది బెటరో ఇక్కడ చూద్దాం..
Looks: లుక్స్
లుక్స్ పరంగా, ఈ రెండు బైక్స్ ప్రత్యేకమైన డిజైన్ తో మార్కెట్లోకి వచ్చాయి. హిమాలయన్ 450 లో ఫ్యుయెల్ ట్యాంక్ సైజ్ పెద్దగా, ఆకర్షణీయంగా ఉంది. మరోవైపు, యెజ్డీ కూడా మరింత రగ్గ్డ్ , స్పోర్టీ లుక్ ను కలిగి ఉంది. రెండు బైక్స్ కూడా వృత్తాకార LED హెడ్‌ల్యాంప్, అప్-స్వెప్ట్ ఎగ్జాస్ట్, స్ప్లిట్ సీట్ సెటప్‌తో వస్తున్నాయి.
Engine: ఇంజన్
రెండు బైక్స్ లోనూ ఇంజన్‌లు ఇప్పుడు లిక్విడ్-కూల్డ్‌గా ఉన్నాయి. కానీ, హిమాలయన్ 450 దాదాపు 40 బిహెచ్‌పిని విడుదల చేస్తుండగా, యెజ్డీ మాత్రం 29 బిహెచ్‌పిని మాత్రమే ప్రొడ్యస్ చేస్తుంది. టార్క్ అవుట్‌పుట్‌లో కూడా భారీ వ్యత్యాసం ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ఇంజన్ 40 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. యెజ్డీ 29 ఎన్ఎమ్ ను విడుదల చేస్తుంది. రెండు మోటార్‌సైకిళ్లలోని గేర్‌బాక్స్ 6-స్పీడ్ యూనిట్. ఇవి స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్ తో వస్తాయి.
Features: ఫీచర్స్
హిమాలయన్ 450 లో LED లైటింగ్, వేర్వేరు రైడింగ్ మోడ్స్, స్విచ్ చేయగల ABS, బ్లూటూత్ కనెక్టివిటీ తదితర ఫీచర్స్ ఉన్నాయి. అలాగే, మ్యాప్ ఫెసిలిటీ ఉన్న కొత్త TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంది. మరోవైపు, యెజ్డీ అడ్వెంచర్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీతో టర్న్-బై-టర్న్ నావిగేషన్, LED లైటింగ్, స్విచ్ చేయగల ABS తదితర ఫీచర్స్ ఉన్నాయి.
Hardware: హార్డ్ వేర్
హిమాలయన్ 450 ముందు భాగంలో అప్-సైడ్ డౌన్ ఫోర్క్‌లను, వెనుకవైపు గ్యాస్-ఛార్జ్డ్ మోనోషాక్‌లను ఉపయోగిస్తుంది. మరోవైపు, యెజ్డీ అడ్వెంచర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్‌లను, వెనుకవైపు మోనోషాక్‌ను ఉపయోగిస్తుంది. రెండు మోటార్‌సైకిళ్లకు ముందు, వెనుక డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి.
Price: ధర
హిమాలయన్ 450 ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్) రూ. 2.69 లక్షలు కాగా, యెజ్డీ అడ్వెంచర్ (ఎక్స్-షోరూమ్) ధర రూ. 2.16 లక్షలతో ప్రారంభమవుతుంది.