2024 Renault Duster : సూపర్​ లుక్స్​తో రెనాల్ట్​ డస్టర్​.. ఇండియాలో లాంచ్​ ఎప్పుడు?-2024 renault duster makes global debut see details inside ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  2024 Renault Duster : సూపర్​ లుక్స్​తో రెనాల్ట్​ డస్టర్​.. ఇండియాలో లాంచ్​ ఎప్పుడు?

2024 Renault Duster : సూపర్​ లుక్స్​తో రెనాల్ట్​ డస్టర్​.. ఇండియాలో లాంచ్​ ఎప్పుడు?

Sharath Chitturi HT Telugu
Nov 30, 2023 11:30 AM IST

2024 Renault Duster : 2024 రెనాల్ట్​ డస్టర్​ని అంతర్జాతీయంగా రివీల్​ చేసింది సంస్థ. ఆ వివరాలు..

సూపర్​ లుక్స్​తో రెనాల్ట్​ డస్టర్​ ఎస్​యూవీ..
సూపర్​ లుక్స్​తో రెనాల్ట్​ డస్టర్​ ఎస్​యూవీ..

Renault Duster 2024 : రెనాల్ట్​ డస్టర్​ని అధికారికంగా రివీల్​ చేసింది ఆటోమొబైల్​ సంస్థ. ఈ ఎస్​యూవీ లుక్స్​ చాలా స్టైలిష్​గా ఉన్నాయి. అదిరిపోయే ఫీచర్స్​ కూడా ఈ వెహికిల్​లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ ఎస్​యూవీ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

రెనాల్ట్​ డస్టర్​ ఎస్​యూవీ..

2024 రెనాల్ట్​ డస్టర్ ఎస్​యూవీ​ ఫ్రెంట్​, రేర్​లో వై-షేప్​ లైటింగ్​ ఎలిమెంట్స్​ వస్తున్నాయి. ఫ్రెంట్​లో స్కల్ప్​టెడ్​ బానెట్​ వస్తోంది. ఫుల్​ విడ్​ గ్రిల్​ విత్​ హెడ్​ల్యాంప్స్​, డీఆర్​ఎల్స్​, సూపర్​ డీజైన్​తో లోగో ఇందులో ఉన్నాయి. బంపర్​ మీద వర్టికల్​ ఎయిర్​ వెంట్స్​, సర్క్యులర్​ ఫాగ్​ లాంప్​ హౌజింగ్​, లోయర్​ గ్రిల్​ కోసం యునీక్​ బుల్​ బార్​ డిజైన్​ వంటివి ఫిక్స్​ చేసింది రెనాల్ట్​. స్క్వేర్డ్​ వీల్​ ఆర్చీస్​, బ్లాక్​డ్​ ఔట్​ అలాయ్​ వీల్స్​, రూఫ్​ రెయిల్స్​ వంటివి రేర్​లో వస్తున్నాయి.

Renault Duster 2024 India launch : ఇక ఈ 2024 రెనాల్ట్​ డస్టర్​ ఎస్​యూవీ 3 ఇంజిన్​ ఆప్షన్స్​ ఉంటాయి. అవి.. 1.0 లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​, 1.2 లీటర్​ పెట్రోల్​ హైబ్రీడ్​ ఇంజిన్​, 1.3 లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​. మొదటి ఇంజిన్​ 120 హెచ్​పీ పవర్​ని జనరేట్​ చేస్తుంది. రెండు, మూడు ఇంజిన్​లు.. 140 హెచ్​పీ, 170 హెచ్​పీ పవర్​ని జనరేట్​ చేస్తాయి. మూడో ఇంజిన్​ని ఇథనాల్​ మిక్స్​ ఫ్యూయెల్​తో కూడా వినియోగించుకోవచ్చని రెనాల్ట్​ చెబుతోంది.

ప్రస్తుతం ఉన్నది 5 సీటర్​ డస్టర్​. కాగా.. 7-సీటర్​ డస్టర్​ని కూడా తయారు చేసే ప్లాన్​లో ఉన్నట్టు రెనాల్ట్​ తెలిపింది.

ఇండియాలో లాంచ్​ ఎప్పుడు..?

భారతీయులకు రెనాల్ట్​ డస్టర్​ అంటే ఒక ఎమోషన్​! ఇండియాలో లాంచ్​ అయిన తొలి ఎస్​యూవీ ఇదే! అప్పట్లో ఈ మోడల్​కి మంచి డిమాండ్​ కనిపించింది. కానీ పోటీ తట్టుకోలేక, సేల్స్​ తగ్గిపోయాయి. చివరికి, ఈ ఎస్​యూవీని ఇండియా మార్కెట్​ నుంచి డిస్కంటిన్యూ చేసింది రెనాల్ట్​.

Renault Duster 2024 price : ఈ మోడల్​ని ఇండియాలో ఎప్పుడు లాంచ్​ చేస్తారు? అన్న విషయంపై రెనాల్ట్​ సంస్థ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా.. 2025 నాటికి ఈ ఎస్​యూవీ.. ఇండియా రోడ్లపై కనిపిస్తుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

మరోవైపు ఇండియా ఎస్​యూవీ సెగ్మెంట్​లో ఇప్పటికే బీభత్సమైన పోటీ ఉంది. ఇక ఇప్పుడు.. ఈ డస్టర్​ ఎస్​యూవీ.. హ్యుందాయ్​ క్రేటా, కియా సెల్టోస్​, వోక్స్​వ్యాగన్​ టైగన్​, స్కోడా కుషాక్​, మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా, టయోటా అర్బన్​ క్రూజర్​ హైరైడర్​ వంటి కొన్ని బెస్ట్​ సెల్లింగ్​ మోడల్స్​కి గట్టిపోటీనిచ్చేందుకు సిద్ధమవుతోంది. మరి ఈసారి.. పోటీని తట్టుకుని నిలబడుతుందో లేదో చూడాలి!

WhatsApp channel

సంబంధిత కథనం