Hyundai Creta facelift : టెస్ట్ రన్ దశలో హ్యుందాయ్ క్రేటా ఫేస్‌లిఫ్ట్.. త్వరలోనే లాంచ్!
Hyundai Creta facelift : హ్యుందాయ్ క్రేటా ఫేస్‌లిఫ్ట్ వర్షెన్కు సంబంధించిన టెస్ట్ రన్ నడుస్తోంది. త్వరలోనే ఈ మోడల్ లాంచ్ అవుతుందని సమాచారం.
Hyundai Creta facelift : ఇండియాలో హ్యుందాయ్ సంస్థకు బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉంది క్రేటా ఎస్యూవీ. ఈ క్రేటాకు ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ రాబోతోందని గత కొంతకాలంగా ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఈ మోడల్‌కు సంబంధించి.. టెస్ట్ రన్‌ను అనేకమార్లు నిర్వహించింది హ్యుందాయ్. ఇక తాజాగా జరిగిన టెస్ట్ రన్లో కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాము..
హ్యుందాయ్ క్రేటా..
హ్యుందాయ్ క్రేటా ఫేస్‌లిఫ్ట్ వర్షెన్.. వచ్చే ఏడాది తొలినాళ్లల్లో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. సరికొత్త ఎక్స్టీరియర్, ఇంటీరియర్ డిజైన్ దీని సొంతమవుతుందని సమాచారం.
ఇక ఆన్లైన్లో లీకైన స్పై షార్ట్స్ ప్రకారం.. సరికొత్త క్రేటా ఎస్యూవీ ఇంటీరియర్‌లో ఆల్ బ్లాక్ థీమ్ వస్తోంది. డ్యూయెల్ టోన్ సీట్స్ ఇందులో ఉంటాయి. రేర్లోని 3 ప్యాసింజర్లకు కొత్తగా హెడ్రెస్ట్ వస్తోంది. డాష్‌బోర్డ్ ఎలా ఉంటుందనే విషయంపై ప్రస్తుతం క్లారిటీ లేదు. అయితే ఇందులో డ్యూయెల్ స్క్రీన్ సెటప్‌ను పెట్టాలని హ్యుందాయ్ సంస్థ ప్లాన్ చేస్తోంది. అంతేకాకుండా.. రేర్లోని ఏసీ వెంట్స్‌తో పాటు 2 యూఎస్బీ టైప్-సీ ఛార్జర్స్ కూడా ఈ కొత్త మోడల్లో చూడొచ్చు.
ఇదీ చూడండి:- Hyundai Exter : హ్యుందాయ్ ఎక్స్టర్ కొంటున్నారా? ఏడాది 'వెయిట్' చేయాల్సిందే!
Hyundai Creta facelift 2024 : హ్యుందాయ్ క్రేటా ఫేస్‌లిఫ్ట్‌ను అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికే లాంచ్ చేసింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ. అయితే.. ఇండియాలో లాంచ్ అయ్యే మోడల్‌కు, అంతర్జాతీయ మోడల్‌కు మధ్య డిజైన్ పరంగా అనేక మార్పులు ఉంటాయని తెలుస్తోంది. ఈ ఎస్యూవీ ఫ్రెంట్లో వర్టికల్ ఎల్ఈడీ లైట్స్, పారామెట్రిక్ గ్రిల్ వచ్చే అవకాశం ఉంది. రేర్‌లో ఎల్ఈడీ టెయిల్లైట్స్ను కొత్త డిజైన్‌తో అప్డేట్ చేయనుంది హ్యుందాయ్. ఎల్ఈడీ లైట్ బార్ రావొచ్చు. ఇక ఈ హ్యుందాయ్ క్రేటాలో 17 ఇంచ్ డైమెండ్ కట్ అలాయ్ వీల్స్ ఉంటాయని సమాచారం.
వెర్నా, వెన్యూ, టుక్సాన్లో ఉన్నట్టుగానే.. ఈ ఎస్‌యూవీలో కూడా ఏడీఏఎస్ టెక్నాలజీతో పాటు ఇతర ముఖ్యమైన ఫీచర్స్ ఉండనున్నాయి. 360 డిగ్రీ కెమెరా ఫీచర్ కూడా తొలిసారి ఈ మోడల్‌కు రావొచ్చు.
Hyundai Creta facelift launch date in India : ఇక ఈ హ్యుందాయ్ క్రేటా ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌లో 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉండొచ్చు.
ఈ మోడల్ లాంచ్, ధర వంటి వివరాలపై ప్రస్తుతం క్లారిటీ లేదు. వీటిపై సంస్థ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
సంబంధిత కథనం