Hyundai Exter : హ్యుందాయ్​ ఎక్స్​టర్​ కొంటున్నారా? ఏడాది 'వెయిట్​' చేయాల్సిందే!-hyundai exter finds crazy demand waiting period reaches 1 year ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hyundai Exter : హ్యుందాయ్​ ఎక్స్​టర్​ కొంటున్నారా? ఏడాది 'వెయిట్​' చేయాల్సిందే!

Hyundai Exter : హ్యుందాయ్​ ఎక్స్​టర్​ కొంటున్నారా? ఏడాది 'వెయిట్​' చేయాల్సిందే!

Sharath Chitturi HT Telugu
Sep 16, 2023 01:25 PM IST

Hyundai Exter : హ్యుందాయ్​ ఎక్స్​టర్​కు మంచి డిమాండ్​ కనిపిస్తోంది. కొన్ని వేరియంట్లకు ఏడాది వెయిటింగ్​ పీరియడ్​ నడుస్తుండటం గమనార్హం.

హ్యుందాయ్​ ఎక్స్​టర్​ కొంటున్నారా? ఏడాది 'వెయిట్​' చేయాల్సిందే!
హ్యుందాయ్​ ఎక్స్​టర్​ కొంటున్నారా? ఏడాది 'వెయిట్​' చేయాల్సిందే!

Hyundai Exter waiting period : ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో ఎస్​యూవీ సెగ్మెంట్​కు మంచి డిమాండ్​ కనిపిస్తోంది. ఇక కొత్తగా లాంచ్​ అవుతున్న మోడల్స్​పై కస్టమర్లు అధికంగా ఫోకస్​ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఇటీవలే మార్కెట్​లో అడుగుపెట్టిన హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఎస్​యూవీకి బీభత్సమైన డిమాండ్​ లభిస్తోంది. ఈ మోడల్​లోని పలు వేరియంట్స్​కు ఇప్పటికే 1 ఏడాది వెయిటింగ్​ పీరియడ్​ నడుస్తుండటం విశేషం!

హ్యుందాయ్​ ఎక్స్​టర్​ వెయిటింగ్​ పీరియడ్​..

హ్యుందాయ్​ ఎక్స్​టర్​లో మొత్తం 7 వేరియంట్లు ఉన్నాయి. ఎస్​ వేరియంట్​తో పాటు ఎస్​ఎక్స్​ సీఎన్​జీ మోడల్​కు 5 నెలల వెయిటింగ్​ పీరియడ్​ ఉంది. ఇక ఎస్​, ఎస్​(ఓ), ఎస్​ఎక్స్​(ఓ) కనెక్ట్​, ఎస్​ఎక్స్​(ఓ) ఏఎంటీ, ఎస్​ఎక్స్​(ఓ) కనెక్ట్​ ఏంటీ వేరియంట్​ల డెలివరీలకు గరిష్ఠంగా 8 నెలల సమయం పడుతోంది. కొన్ని రాష్ట్రాల్లో ఇది 1 ఏడాదిగా కూడా ఉంది.

ఆసక్తి ఉన్న కస్టమర్లు.. తమ సమీపంలోని హ్యుందాయ్​ షోరూమ్​కు వెళ్లి, ఎక్స్​టర్​ ఎస్​యూవీ వెయిటింగ్​ పీరియడ్​ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి:- Exter vs Fronx : హ్యుందాయ్​ ఎక్స్​టర్​ వర్సెస్​ మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​.. ఏది బెస్ట్​?

కొత్త ఎస్​యూవీ ఫీచర్స్​ ఇవే..

Hyundai Exter on road price Hyderabad : ఈ 5 సీటర్​ మైక్రో ఎస్​యూవీ కేబిన్​లో సెమీ లెథరేట్​ అప్​హోలిస్ట్రీ, ఎక్స్​టర్​ లెటర్స్​ ఉండే హెడ్​రెస్ట్​లు, 3 స్పోక్​ మల్టీపంక్షనల్​ స్టీరింగ్​ వీల్​ వంటివి వస్తున్నాయి. డాష్​కామ్​, డిజిటల్​ డ్రైవర్​ డిస్​ప్లే, 8 ఇంచ్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​ వంటి ఫీచర్స్​ ఈ వెహికిల్​లో వస్తున్నాయి. స్మార్ట్​ ఎలక్ట్రిక్​ సన్​రూఫ్​ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వాయిస్​ అసిస్ట్​తో ఈ ఫీచర్​ పనిచేస్తుండటం హైలైట్​!

ఇక ఈ ఎస్​యూవీ ఎక్స్​షోరూం ధర రూ. 8లక్షల నుంచి రూ. 9.6లక్షల మధ్యలో ఉంటుంది.

హైదరాబాద్​లో హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఆన్​ రోడ్​ ప్రైజ్​ వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం