Toyota Rumion variants : టయోటా రుమియన్​ వేరియంట్లు.. వాటి ఫీచర్స్​ ఇవే!-toyota rumion variants explained see full details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Toyota Rumion Variants : టయోటా రుమియన్​ వేరియంట్లు.. వాటి ఫీచర్స్​ ఇవే!

Toyota Rumion variants : టయోటా రుమియన్​ వేరియంట్లు.. వాటి ఫీచర్స్​ ఇవే!

Sharath Chitturi HT Telugu
Aug 12, 2023 06:47 AM IST

Toyota Rumion variants : టయోటా రుమియన్​ లాంచ్​కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​లోని వేరియంట్లు, వాటి ఫీచర్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము…

టయోటా రుమియన్​ వేరియంట్లు.. వాటి ఫీచర్స్​ ఇవే!
టయోటా రుమియన్​ వేరియంట్లు.. వాటి ఫీచర్స్​ ఇవే!

Toyota Rumion variants : మారుతీ సుజుకీ ఎర్టిగా ఆధారిత రుమియన్​ ఎంపీవీని ఇటీవలే ఇండియాలో రివీల్​​ చేసింది టయోటా మోటార్స్​. సంస్థ నుంచి వస్తున్న అతి చౌకైన ఎంపీవీగా ఇది గుర్తింపు తెచ్చుకుంటుందని టయోటా చెప్పింది. ఈ నేపథ్యంలో ఈ టయోటా రుమియన్​ వేరియంట్లు, వాటి ఫీచర్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ఎన్ని వేరియంట్లు ఉన్నాయి..?

టయోటా రుమియన్​లో మొత్తం మూడు వేరియంట్లు ఉన్నాయి. ఇవి ఐదు రంగుల్లో అందుబాటులో ఉండనున్నాయి. అవి కేఫ్​ వైట్​, స్పంకీ బ్లూ, ఐకానిక్​ గ్రే, రస్టిక్​ బ్రౌన్​, ఎంటైసింగ్​ సిల్వర్​.

ఎస్​ వేరియంట్​:- ఇందులో ప్రొజెక్టర్​ హెడ్​ల్యాంప్స్​, క్రోమ్​ సరౌండింగ్​ గ్రిల్​, ఎల్​ఈడీ టెయిల్​ల్యాంప్స్​, బాడీ కలర్డ్​ ఓఆర్​వీఎంలు, డిజైనర్​ కవర్స్​తో కూడిన స్టీల్​ వీల్స్​ వస్తున్నాయి.

Toyota Rumion on road price Hyderabad : ఇక 7 సీటర్​ కేబిన్​లో డ్యూయెల్​ టోన్​ డాష్​బోర్డ్​, మేన్యువల్​ ఏసీ విత్​ రూఫ్​ మౌంటెడ్​ ఎయిర్​ వెంట్స్​, ఎయిర్​ కూల్డ్​ ట్విన్​ కప్​ హోల్డర్స్​, రిమోట్​ కీ లెస్​ ఎంట్రీ, 4 స్పీకర్​ ఆడియో, డ్యూయెల్​ ఎయిర్​బ్యాగ్స్​ లభిస్తున్నాయి.

ఇందులో 1.5 లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 103 హెచ్​పీ పవర్​ను, 136.8 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఇదే ఇంజిన్​లో సీఎన్​జీ ఆప్షన్​ కూడా ఉంది. ఇది 87 హెచ్​పీ పవర్​ను, 121 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

ఇదీ చూడండి:- క్రేజీ అప్డేట్స్​తో 2024 టయోటా వెల్​ఫైర్​ ఎంపీవీ లాంచ్​..!

జీ వేరేయింట్​:- టయోటా రుమియన్​ జీ వేరియంట్​లో బేస్​ మోడల్​లోని ఫీచర్స్​తో పాటు బూట్​ లిడ్​- డోర్​ హాండిల్స్​కు క్రోమ్​ ఇన్​సర్ట్స్​, డ్యూయెల్​ టోన్​ వీల్స్​, ఫ్రెంట్​- రేర్​ మడ్​గార్డ్స్​ లభిస్తున్నాయి. హైట్​ అడ్జెస్టెబుల్​ సీట్​, డాష్​బోర్డ్​పై మెటాలిక్​ టీక్​ ఉడ్​, స్మార్ట్​ కీ, ఆర్కెమిస్​ సౌండ్​ సిస్టెమ్​ వంటివి వస్తున్నాయి.

ఇందులోనూ 1.5 లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. 5 స్పీడ్​ మేన్యువల్​ గేర్​బాక్స్​ దీని సొంతం.

Toyota Rumion MPV specifications : వీ వేరియంట్​:- ఈ రుమియన్​ ఎంపీవీ వీ వేరియంట్​.. ఒక టాప్​ ఎండ్​ మోడల్​. ఇందులో బేస్​ మోడల్​లోని ఫీచర్స్​తో పాటు అదనంగా అనేక ఫీచర్స్​ లభిస్తున్నాయి.

ఆటోమెటిక్​ హెడ్​ల్యాంప్స్​, కీ- ఆపరేటెడ్​ రిట్రాక్టెబుల్​ ఓఆర్​వీఎంలు, లెథర్​ వ్రాప్డ్​ స్టీరింగ్​ వీల్​, క్రూజ్​ కంట్రోల్​, 7.0 ఇంచ్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, టయోటా ఐ కనెక్ట్​ టెక్నాలజీ వంటివి వస్తున్నాయి.

ఇందులోనూ 1.5 లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. కాగా.. 5 స్పీడ్​ మేన్యువల్​, 6 స్పీడ్​ ఆటోమెటిక్​ ట్రాన్స్​మిషన్​ ఆప్షన్​ లభిస్తుంది.

వీటి ధరలెంత..?

Toyota Rumion price details : టయోటా రుమియన్​ ఎంపీవీ ధరలపై ఇంకా క్లారిటీ లేదు. సెప్టెంబర్​లో జరిగే లాంచ్​ ఈవెంట్​లో స్పష్టత వస్తుంది. కాగా.. ప్రస్తుతం మార్కెట్​లో మారుతీ సుజుకీ ఎర్టిగా ఎక్స్​షోరూం ధర (రూ. 8.64లక్షలు- రూ. 13.08లక్షలు) కన్నా ఇది కాస్త ఎక్కువగా ఉంటుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం