తెలుగు న్యూస్ / ఫోటో /
క్రేజీ అప్డేట్స్తో 2024 టయోటా వెల్ఫైర్ ఎంపీవీ లాంచ్..!
- 2024 టయోటా వెల్ఫైర్ ప్రీమియం ఎంపీవీని సంస్థ తాజాగా లాంచ్ చేసింది. ఈ ఫోర్త్ జనరేషన్ ఎంపీవీకి క్రేజీ అప్డేట్స్ లభించాయి. ఆ వివరాలు..
- 2024 టయోటా వెల్ఫైర్ ప్రీమియం ఎంపీవీని సంస్థ తాజాగా లాంచ్ చేసింది. ఈ ఫోర్త్ జనరేషన్ ఎంపీవీకి క్రేజీ అప్డేట్స్ లభించాయి. ఆ వివరాలు..
(1 / 8)
ఫోర్త్ జనరేషన్ వెల్ఫైర్ ప్రీమియం ఎంపీవీని లాంచ్ చేసింది టయోటా మోటార్స్. డిజైన్ పరంగా చాలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఫ్రెంట్ బంపర్ లుక్ చాలా అగ్రెసివ్‌గా ఉంది. గ్రిల్‌పై వర్టికల్ స్లేట్స్ వస్తున్నాయి.
(2 / 8)
సరికొత్త లెక్సస్ ఎల్ఎం ప్లాట్ఫార్మ్పై ఈ వెల్ఫైర్ అప్డెటెడ్ వర్షెన్‌ను రూపొందించారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించారు. లగ్జరీ ఫీల్‌ని ఇచ్చే విధంగా ఎంపీవీకి అప్డేట్స్ చేశారు.
(3 / 8)
2024 టయోటా వెల్‌ఫైర్‌లో రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. 260 హెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేసే 2.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఒకటి. 260 హెచ్‌ప పవర్‌ను జనరేట్ చేసే 2.5 లీటర్ పెట్రోల్ హైబ్రీడ్ ఇంజిన్ ఒకటి.
(4 / 8)
టయోటా వెల్‌ఫైర్‌లో ఏడీఏఎస్ టెక్నాలజీ వస్తోంది. ఇండియాలో లాంచ్ అనంతరం.. ఒక ఎంపీవీకి తొలిసారిగా ఏడీఏఎస్ ఫీచర్ వస్తున్నట్టు అవుతుంది. దీనితో పాటు సేఫ్టీ సెన్స్ టెక్నాలజీ, ప్రోయాక్టివ్ డ్రైవింగ్ అసిస్ట్, లేన్ ఛేంజ్ అసిస్ట్, రాడార్ క్రూజ్ కంట్రోల్, లేన్ ట్రాకింగ్ అసిస్ట్, రిమోట్ పార్కింగ్ వంటి సేఫ్టీ ఫీచర్స సైతం లభిస్తున్నాయి.
(5 / 8)
టయోటా వెల్ఫైర్ కొత్త వర్షెన్‌లో 8 స్పీడ్ ఆటోమెటిక్ గేర్‌బాక్స్ ఉండే అవకాశం ఉంది. 2 వీల్ డ్రైవ్, 4 వీల్ డ్రైవ్ సిస్టెమ్స్లో ఇది అందుబాటులోకి రానుంది.
(6 / 8)
ఈ ఎంపీవీలో ఒట్టామన్ సీట్స్ లభిస్తున్నాయి. అన్ని వేరియంట్లలో ఇది స్టాండర్డ్‌గా ఉంటుంది. లేటెస్ట్ టెక్నాలజీ కారణం 3 రో ల మధ్య స్పేస్ మరింత పెరిగింది.
(7 / 8)
టాప్ వేరియంట్లో పవర్ స్లైడింగ్ ఒట్టామన్ సీట్స్ వస్తున్నాయి. ఓ కారులో ఈ ఫీచర్ ఉండటం ప్రపంచంలో ఇదే తొలిసారి అని సంస్థ చెబుతోంది. మల్టీ ఫంక్షనల్ టచ్ ప్యానెల్, హీటెడ్ లెగ్- ఆర్మ్‌రెస్ట్, మాసాజర్స్ వంటి ఫీచర్స్ కూడా వస్తున్నాయి.
ఇతర గ్యాలరీలు