Tata Safari vs Hyundai Alcazar : ఈ రెండు ఎస్‌యూవీల్లో ఏది కొంటే బెస్ట్?
Tata Safari vs Hyundai Alcazar : టాటా సఫారీ ఫేస్‌లిఫ్ట్ వర్సెస్ హ్యుందాయ్ అల్కజార్.. ఈ రెండు ఎస్‌యూవీల్లో ఏది కొనాలి? ఇక్కడ తెలుసుకుందాము..
Tata Safari vs Hyundai Alcazar : 2023 టాటా సఫారీ ఎస్‌యూవీని ఇటీవలే లాంచ్ చేసింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ. ఈ మోడల్.. మరింత అట్రాక్టివ్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఈ టాటా సఫారీ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్.. హ్యుందాయ్ అల్కజార్‌కు గట్టిపోటీనిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ రెండింటినీ పోల్చి.. ఏ ఎస్యూవీ బెస్ట్? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
టాటా సఫారీ వర్సెస్ హ్యుందాయ్ అల్కజార్- లుక్స్..
టాటా సఫారీ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌లో పారామెట్రిక్ డిజైన్‌తో కూడిన భారీ గ్రిల్, ప్రొడెక్టర్ బై-ఎల్ఈడీ హెడ్‌లైట్స్, ఫుల్-విడ్త్ డీఆర్ఎల్, సీక్వెన్షియల్ ఇండికేటర్స్, 19 ఇంచ్ డ్యూయెల్ టోన్ అలాయ్ వీల్స్, కనెక్టెడ్ టైప్ ఎల్ఈడీ టెయిల్‌లైట్స్ లభిస్తున్నాయి.
హ్యుందాయ్ అల్కజార్‌లో స్కల్ప్టెడ్ బానెట్, భారీ క్రోమ్ గ్రిల్, ట్రై బీమ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, స్ల్పిట్ టైప్ డీఆర్ఎల్స్, రూఫ్ రెయిల్స్, ఇండికేటర్ మౌంటెడ్ ఓఆర్వీఎంలు, స్కిడ్ ప్లేట్స్, ఫ్లేర్డ్ వీల్ ఆర్చీస్, వ్రాప్ అరౌండ్ ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్స్, 18 ఇంచ్ డ్యూయెల్ టోన్ వీల్స్ వస్తున్నాయి.
టాటా సఫారీ వర్సెస్ హ్యుందాయ్ అల్కజార్- ఫీచర్స్..
Tata Safari facelift price Hyderabad : 2023 టాటా సఫారీ స్పేషియల్ 5/7 సీటర్ కేబిన్‌లో ప్రీమియం 2 టోన్ డ్యాష్‌బోర్డ్, మల్టీ కలర్డ్ మూడ్ లైటింగ్, డ్యూయెల్ టోన్ 4 స్పోక్ స్టీరింగ్ వీల్, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 12.3 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ టచ్స్క్రీన్లు వస్తున్నాయి.
హ్యుందాయ్ అల్కజార్ 6/7 సీటర్ ఎస్యూవీ కేబిన్‌లో ప్రీమియం అప్‌హోలిస్ట్రీ, పానారోమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్స్, యాంబియెంట్ లైటింగ్, 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ వస్తున్నాయి.
టాటా సఫారీ వర్సెస్ హ్యుందాయ్ అల్కజార్- ఇంజిన్..
టాటా మోటార్స్ వెహికిల్‌లో 2.0 లీటర్ క్రియోటెక్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 168 హెచ్‌పీ పవర్‌ను, 350 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ మేన్యువల్, 6 స్పీడ్ ఆటోమెటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ వస్తున్నాయి.
2023 Tata Safari on road price Hyderabad : ఇక హ్యుందాయ్ వెహికిల్ఎస్యూవీలో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 157 హెచ్‌పీ పవర్‌ను, 253 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 1.5 లీటర్ డీజిల్ మోటార్.. 114 హెచ్‌పీ పవర్‌ను, 250 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ మేన్యువల్, 6 స్పీడ్ ఆటోమెటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ ఉన్నాయి.
ఈ రెండు ఎస్‌యూవీల ధరలు ఇవే..
ఇండియాలో టాటా సఫారీ ఎక్స్‌షోరూం ధర రూ. 16.19లక్షలు- రూ. 27.34లక్షల మధ్యలో ఉంటుంది. కాగా హ్యుందాయ్ అల్కజార్ ఎక్స్‌షోరూం ధర రూ. 16.77లక్షలు- రూ. 21.23లక్షల మధ్యలో ఉంటుంది.
హైదరాబాద్‌లో టాటా సఫారీ ఫేస్‌లిఫ్ట్ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం