Renault Kardian : రెనాల్ట్​ నుంచి సరికొత్త ఎస్​యూవీ.. ‘కార్డియన్​’ వచ్చేస్తోంది!-renault kardian entry level suvs interior teased global debut on october 25 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Renault Kardian : రెనాల్ట్​ నుంచి సరికొత్త ఎస్​యూవీ.. ‘కార్డియన్​’ వచ్చేస్తోంది!

Renault Kardian : రెనాల్ట్​ నుంచి సరికొత్త ఎస్​యూవీ.. ‘కార్డియన్​’ వచ్చేస్తోంది!

Sharath Chitturi HT Telugu
Oct 16, 2023 05:30 PM IST

Renault Kardian : కార్డియన్​ ఎస్​యూవీని.. త్వరలోనే అంతర్జాతీయంగా ఆవిష్కరించనుంది రెనాల్ట్​ సంస్థ. ఈ ఎస్​యూవీ వివరాల్లోకి వెళితే..

రెనాల్ట్​ నుంచి సరికొత్త ఎస్​యూవీ..
రెనాల్ట్​ నుంచి సరికొత్త ఎస్​యూవీ..

Renault Kardian : ప్రముఖ ఆటోమొబైల్​ సంస్థ రెనాల్ట్​ నుంచి ఓ కొత్త ఎస్​యూవీ రాబోతోంది. దీని పేరు రెనాల్ట్​ కార్డియన్​. ఇదొక ఎంట్రీ లెవల్​ ఎస్​యూవీ. ఈ నెల 25న.. ఈ మోడల్​ని అంతర్జాతీయంగా ఆవిష్కరించనుంది రెనాల్ట్​ సంస్థ. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

రెనాల్ట్​ కొత్త ఎస్​యూవీ ఎలా ఉంటుంది..?

ఈ కార్డియన్​ ఎస్​యూవీకి సంబంధించి.. ఇప్పటికే కొన్ని టీజర్స్​ని విడుదల చేసింది రెనాల్ట్​. వీటి ద్వారా పలు కీలక ఫీచర్స్​ బయటపడ్డాయి. ఈ రెనాల్ట్​ కార్డియన్​ సైజు.. రెనాల్ట్​ ఖైగర్​ను పోలి ఉంది. అయితే.. సౌత్​ అమెరికా మార్కెట్​ను ఉద్దేశించి ఈ కొత్త మోడల్​ను సంస్థ రూపొందించిందట. అక్కడ మార్కెట్​ షేరును పెంచుకునేందుకు ఈ వాహనం ఉపయోగపడుతుందని భావిస్తోంది.

రెనాల్ట్​కు డాసియా అనే బ్రాండ్​ ఉంది. ఈ డాసియా నుంచి సాండెరో స్టెప్​వే అనే వెహికిల్​ ఉండేది. ఇక కొత్తగా తయారవుతున్న కార్డియన్​.. ఈ సాండెరో స్టెప్​వేతో పోలి ఉండొచ్చని తెలుస్తోంది. ఈ కొత్త ఎస్​యూవీలో స్ల్పిట్​ ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్స్​, డబుల్​ లేయర్డ్​ గ్రిల్​, రూఫ్​ రెయిల్స్​ వంటివి వస్తున్నాయి. ఎక్స్​టీరియర్​లో బ్లాక్​ క్లాండింగ్​ని చూడవచ్చు. వీల్​ ఆర్చీస్​, బంపర్స్​ చుట్టు ఇది ఉంటుంది.

Renault Kardian launch date : ఇక ఈ రెనాల్ట్​ కార్డియన్​ ఇంటీరియర్​ విషయానికొస్తే.. ఇందులో 8 ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, డ్రైవ్​ మోడ్​ సెలక్టర్​, 4 స్పోక్​ స్టీరింగ్​ వీల్​, యాంబియెంట్​ లైటింగ్​ వంటివి ఉంటాయని సంస్థ రిలీజ్​ చేసిన వీడియోల ద్వారా తెలుస్తోంది.

అయితే.. ఈ కారులో ఉపయోగించే ఇంజిన్​పై ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు. కాకపోతే.. ఇందులో 1.0 లీటర్​ టర్బోఛార్జ్​డ్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉండే అవకాశం ఉందని టాక్​ నడుస్తోంది. మరి ఇది రెనాల్ట్​ ఖైగర్​లో ఉన్న 1.0 లీటర్​ టర్పోఛార్జ్​డ్​ పెట్రోల్​ ఇంజిన్​యేనా? లేక కొత్తదా? అన్నది చూడాలి.

Renault Kardian features : ఈ కార్డియన్​ ఎస్​యూవీ ఇండియాలో అడుగుపెట్టడం దాదాపు అసాధ్యమే అని తెలుస్తోంది. ఎందుకంటే.. ఇండియా మార్కెట్​లో ఇప్పటికే ఖైగర్​ మోడల్​కు మంచి డిమాండ్​ ఉంది. పైగా ఈ కార్డియన్​ను సీఎంఎఫ్​-బీ ప్లాట్​ఫామ్​పై తయారు చేస్తోంది సంస్థ. ఇండియాలో ఉన్న ఖైగర్​, ట్రైబర్​, నిస్సాన్​ మాగ్నైట్​లను సీఎంఎఫ్​- ఏ+ ప్లాట్​ఫామ్​పై రూపొందిస్తోంది. సీఎంఎఫ్​-బీ అనేది కాస్త అధిక ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే దీనిని ఇండియాలోకి తీసుకురాకపోవచ్చు.

కార్డియన్​ను తీసుకురాకపోయినా.. ఇండియా కోసం పక్కా ప్లాన్​ను తయారు చేసుకుంది రెనాల్ట్​. సరికొత్త డస్టర్​ ఎస్​యూవీని సంస్థ సిద్ధం చేస్తోందట. రానున్న 2ఏళ్లల్లోపు ఇది మార్కెట్​లోకి అడుగుపెడుతుందని సమాచారం. ఈవీ పోర్ట్​ఫోలియోని కూడా ఇండియాలో దింపేందుకు సంస్థ ప్రణాళికలు రచిస్తోంది.

Whats_app_banner

సంబంధిత కథనం