Renault new EV : 620కి.మీ రేంజ్​తో రెనాల్ట్​ సీనిక్​ ఈ-టెక్​ ఈవీ..-renault scenic e tech ev revealed see range and other features here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Renault New Ev : 620కి.మీ రేంజ్​తో రెనాల్ట్​ సీనిక్​ ఈ-టెక్​ ఈవీ..

Renault new EV : 620కి.మీ రేంజ్​తో రెనాల్ట్​ సీనిక్​ ఈ-టెక్​ ఈవీ..

Sharath Chitturi HT Telugu
Sep 05, 2023 08:05 AM IST

Renault new EV : రెనాల్ట్​ నుంచి సరికొత్త ఈవీ రాబోతోంది. అదే సీనిక్​ ఈ-టెక్​ ఈవీ. ఈ మోడల్​ను తాజాగా ఆవిష్కరించింది ఆటోమొబైల్​ సంస్థ.

620కి.మీ రేంజ్​తో రెనాల్ట్​ సీనిక్​ ఈ-టెక్​ ఈవీ..
620కి.మీ రేంజ్​తో రెనాల్ట్​ సీనిక్​ ఈ-టెక్​ ఈవీ.. (Renault)

Renault new EV : సీనిక్​ ఈ-టెక్​ ఈవీని తాజాగా ఆవిష్కరించింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ రెనాల్ట్​. దీనిని సీఎంఎఫ్​-ఈవీ ప్లాట్​ఫామ్​పై రూపొందించనుంది. మెగేన్​ ఈ-టెక్​, నిస్సాన్​ ఆరియా వంటి ప్రముఖ మోడల్స్​ని కూడా ఇదే ప్లాట్​ఫామ్​పై తయారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ఈవీ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

కొత్త ఈవీ ఎలా ఉందంటే..

రెనాల్ట్​ సీనిక్​ ఈ-టెక్​ ఎలక్ట్రిక్​ వెహికిల్​లో ఫ్లాట్​ ఫ్లోర్​, సోలార్​బే పానోరమిక్​ సన్​రూఫ్​, 545 లీటర్ల్​ బూట్​ స్పేస్​ వంటివి వస్తున్నాయి. ఇక కేబినెల్​లో 8.7 లీటర్ల స్టోరేజ్​ కెపాసిటీ వస్తోంది. వీటిల్లో ఆర్మ్​రెస్ట్​, ఫోల్డ్​-ఔట్​ స్టాండ్స్​, డ్రింక్​ హోల్డర్స్​, టైప్​-సీ ఔట్​లెట్స్​ ఉంటాయి.

ఇక ఈ కారులోని ఓపెన్​ఆర్​ లింక్​ డిజిటల్​ కాక్​పిట్​లో 12.3 ఇంచ్​ హారిజాంటల్​ టీఎఫ్​టీ స్క్రీన్​ ఉంటుంది. 12.0 ఇంచ్​ వర్టికల్​ టచ్​స్క్రీన్​ దీని సొంతం. మొత్తం మీద ఇందులో 50కిపైగా యాప్స్​ ఉంటాయని తెలుస్తోంది. యాపిల్​ కార్​ప్లే, ఆండ్రాయిడ్​ ఆటో వంటి కనెక్టివిటీ ఫీచర్స్​ కూడా లభిస్తున్నాయి.

Renault Scenic E-Tech EV : ఇక ఈ మోడల్​లో రెండు వేరియంట్లు ఉంటాయి. ఒకటి స్టాండర్డ్​, రెండోది హై. స్టాండర్డ్​ వేరియంట్​లో 60కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీతో కూడిన మోటార్​ ఉంటుంది. ఇది 170హెచ్​పీ పవర్​ను, 280 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. దీని రేంజ్ 418కి.మీలని సంస్థ చెబుతోంది.

ఇక రెండో వేరియంట్​ 'హై'లో 220 హెచ్​పీ పవర్​ను, 300 ఎన్​ఎంను జనరేట్​ చేసే మోటార్​ ఉంటుంది. దీనికి 87కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ లింక్​ చేసి ఉంటుంది. దీని రేంజ్​ 620కి.మీలని సంస్థ చెబుతోంది. అంతేకాకుండా.. ఈ రెండూ కూడా ఎన్​ఎంసీ (నికిల్​-మాంగనీస్​-కోబాల్ట్​) బ్యాటరీలను స్పష్టం చేస్తోంది.

Renault Scenic E-Tech price : ఈ ఎలక్ట్రిక్​ వెహికిల్​లో 30కిపైగా డ్రైవర్​ అసిస్టెన్స్​ సిస్టెమ్స్​తో పాటు దాదాపు అన్ని సేఫ్టీ ఫీచర్స్​ వస్తున్నాయి.

రెనాల్డ్​ సీనిక్​ ఈ-టెక్​ ఈవీలోని డ్యాష్​బోర్డ్​ను 80శాతం రీసైకిల్డ్​ మెటీరియల్​తో రూపొందించింది సంస్థ. కాక్​పిట్​లో 26శాతం రీసైకిల్డ్​ మెటీరియల్​ను వాడింది. కార్పెట్స్​ను 97శాతం రీసైకిడ్ల్​ ప్లాస్టిక్​ బాటిల్స్​తో తయారు చేసింది. గ్లాస్​ రూఫ్​ను 50శాతం వేస్ట్​ మెటీరియల్స్​తో, డోర్స్​-హుడ్​ను 40శాతం రీసైకిల్డ్​ అల్యుమీనియం కాంపొనెంట్స్​తో తయారు చేసింది.

Renault Scenic E-Tech electric : ఈ మోడల్​ వచ్చే ఏడాది తొలినాళ్లల్లో యూరోప్​ మార్కెట్​లో అందుబాటులోకి రానుంది. ఇండియాలో లాంచ్​పై క్లారిటీ లేదు. ఈ మోడల్​ ధర, ఇతర ఫీచర్స్​ వంటి వివరాలపై సంస్థ ప్రకటన చేయాల్సి ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం