Nissan Magnite Kuro : ఇదిగో నిస్సాన్​ మాగ్నైట్​ కురో.. ధర ఎంతంటే!-nissan magnite kuro edition goes official check details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Nissan Magnite Kuro : ఇదిగో నిస్సాన్​ మాగ్నైట్​ కురో.. ధర ఎంతంటే!

Nissan Magnite Kuro : ఇదిగో నిస్సాన్​ మాగ్నైట్​ కురో.. ధర ఎంతంటే!

Sharath Chitturi HT Telugu
Oct 08, 2023 12:40 PM IST

Nissan Magnite Kuro : నిస్సాన్​ మాగ్నైట్​ కురో ఎడిషన్​ అట్రాక్టివ్​గా ఉంది. ఈ ఎస్​యూవీ ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ చూద్దాము..

ఇదిగో నిస్సాన్​ మాగ్నైట్​ కురో.. ధర ఎంతంటే!
ఇదిగో నిస్సాన్​ మాగ్నైట్​ కురో.. ధర ఎంతంటే!

Nissan Magnite Kuro : ఇండియాలో నిస్సాన్​ సంస్థకు బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా ఉంది మాగ్నైట్​ ఎస్​యూవీ. ఇక మార్కెట్​లోకి మాగ్నైట్​ కొత్త ఎడిషన్​ను తీసుకొచ్చింది నిస్సాన్​ సంస్థ. ఈ మోడల్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

నిస్సాన్​ మాగ్నైట్​ కురో విశేషాలివే..

మాగ్నైట్​ కురో ఎడిషన్​లోని ఇంటీరియర్​, ఎక్స్​టీరియర్​లో ఆల్​-బ్లాక్​ డిజైన్​ ఉంటుంది. బ్లాక్​డ్​ ఔట్​ గ్రిల్​, ఫ్రెంట్​- రేర్​ బంపర్స్​, డోర్​ హ్యాండిల్స్​, రూఫ్​ రెయిల్స్​, స్కిడ్​ ప్లేట్స్​, హెడ్​లైట్​ యాక్సెంట్స్​ వంటివి ఎక్స్​టీరియర్​లో వస్తున్నాయి. గ్లాసీ బ్లాక్​ అలాయ్​ వీల్స్​, రెడ్​ బ్రేక్​ కాలిపర్స్​ సైతం లభిస్తున్నాయి.

Nissan Magnite Kuro edition price : ఇక ఇంటీరియర్​ విషయానికొస్తే.. ఈ నిస్సాన్​ వెహికిల్​లో ఆల్​- బ్లాక్​ థీమ్​ కేబిన్​, సన్​ విజర్స్​, ఫ్లోర్​ మ్యాట్స్​, స్టీరింగ్​ వీల్​ కవర్​, బ్లాక్​డ్​ ఔట్​ డోర్​ హ్యాండిల్స్​, బ్లాక్​ సరండర్స్​తో కూడిన ఏసీ వెంట్స్​ వస్తున్నాయి. 8.0 ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, ఆండ్రాయిడ్​ ఆటో- యాపిల్​ కార్​ప్లే కనెక్టివిటీ కూడా ఉన్నాయి. డ్రైవర్​ డిస్​ప్లే, 360 డిగ్రీ వ్యూ కెమెరా, వయర్​లెస్​ ఛార్జర్​, ఆటోమెటిక్​ క్లైమేట్​ కంట్రోల్​ వంటి ఫీచర్స్​ కూడా ఉన్నాయి.

ఈ నిస్సాన్​ మాగ్నైట్​ కురో ఎడిషన్​ ఎస్​యూవీలో 1.0 లీటర్​, నేచురల్లీ ఆస్పిరేటెడ్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది.. 71 హెచ్​పీ పవర్​ను, 96 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 1.0 లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​ సైతం ఉంటుంది. ఇది 99 హెచ్​పీ పవర్​ను, 152 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 5 స్పీడ్​ మేన్యువల్​, సీవీటీ గేర్​బాక్స్​ ఆప్షన్స్​ వస్తున్నాయి.

ఈ ఎస్​యూవీ ధర ఎంతంటే..

Nissan Magnite Kuro price Hyderabad : ఇండియాలో నిస్సాన్​ మాగ్నైట్​ కురో ఎడిషన్​ ఎక్స్​షోరూం ధర రూ. 8.27లక్షలు- రూ. 10.46లక్షల మధ్యలో ఉంటుంది. బుకింగ్స్​ మొదలయ్యాయి. సంస్థకు చెందిన డీలర్​షిప్​షోరూమ్స్​లో ఈ మోడల్​ను బుక్​ చేసుకోవచ్చు.

"స్టైల్​, వాల్యూ, సేఫ్టీ కలగలిపిన మోడల్​.. ఈ నిస్సాన్​ మాగ్నైట్​ కురో ఎడిషన్​. కస్టమర్ల అవసరాలకు తగ్గట్టు కార్లను డెలివరీ చేయాలన్న మా ఆలోచనకు నిదర్శనమే ఈ కొత్త ఎడిషన్​," అని నిస్సాన్​ మోటార్​ ఇండియా ఎండీ రాకేశ్​ శ్రీవాస్తవ తెలిపారు.

Nissan India : ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో ఎస్​యూవీ సెగ్మెంట్​కు పెరుగుతున్న డిమాండ్​ను క్యాష్​ చేసుకునేందుకు సంస్థలు పోటీపడుతున్నాయి. నిస్సాన్​ కూడా కొన్ని మోడల్స్​ను ఇండియాలోకి తీసుకొస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం