Duster SUV car : ఇండియా మార్కెట్​లోకి ‘డస్టర్​’ ఎస్​యూవీ.. తిరిగొస్తోంది!-duster suv to return to india soon renault nissan s india plan hints so ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Duster Suv Car : ఇండియా మార్కెట్​లోకి ‘డస్టర్​’ ఎస్​యూవీ.. తిరిగొస్తోంది!

Duster SUV car : ఇండియా మార్కెట్​లోకి ‘డస్టర్​’ ఎస్​యూవీ.. తిరిగొస్తోంది!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Feb 03, 2023 07:00 AM IST

Duster SUV car : రెనాల్ట్​- నిస్సాన్​ భాగస్వామ్యం విషయంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. అనంతరం.. ఈ రెండు ఆటో సంస్థల ఫోకస్​ ఇండియాపై పడింది. ఈ నేపథ్యంలో.. డస్టర్​ ఎస్​యూవీ తిరిగి ఇండియా రోడ్లపై చక్కర్లు కొట్టే రోజులు రానున్నట్టు ఊహాగానాలు జోరందుకున్నాయి.

డస్టర్​ ఎస్​యూవీ.. తిరిగొస్తోంది!
డస్టర్​ ఎస్​యూవీ.. తిరిగొస్తోంది! (HT AUTO)

Duster SUV car : భారత దేశంలో లాంచ్​ అయిన తొలి ఎస్​యూవీ మోడల్స్​లో 'డస్టర్​' ఒకటి. ఈ ఎస్​యూవీకి భారీ డిమాండ్​ కూడా కనిపించింది. ఆకర్షణీయమైన ప్రైజ్​ పాయింట్​లో లభిస్తుండటంతో ఇండియన్​ కస్టమర్లు డస్టర్​ ఎస్​యూవీవైపు మొగ్గుచూపిన రోజులు కూడా ఉన్నాయి. పోటీని తట్టుకోలేకో.. లేక ఇతర కారణాల వల్లో ఈ ఎస్​యూవీ భారత రోడ్ల మీద కనుమరుగైపోయింది. అయితే.. ఈ ఎస్​యూవీని మళ్లీ తీసుకొచ్చేందుకు రెనాల్ట్​ ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

రెనాల్ట్​.. నిస్సాన్​ భాగస్వామ్యం..

దిగ్గజ ఆటోమొబైల్​ కంపెనీలు రెనాల్ట్​, నిస్సాన్​ల మధ్య దశాబ్దాలుగా భాగస్వామ్యం కొనసాగుతోంది. ఎన్నో ఆకర్షణీయమైన మోడల్స్​ కూడా బయటకొచ్చాయి. అయితే.. ఈ పార్ట్​నర్​షిప్​కు ఇటీవలే మెరుగులు దిద్దాయి ఈ కంపెనీలు. రెండింటికీ సమాన ప్రాధాన్యత లభించే విధంగా షేర్​హోల్డింగ్​ పాటర్న్​ను రూపొందించుకున్నాయి. ఫలితంగా... రెనాల్ట్​ కొత్త ఎలక్ట్రిక్​ వెహికిల్​ యూనిట్​లో నిస్సాన్​ పెట్టుబడులు పెట్టనుంది.

Renault Nissan India : ఈ ఫ్రెంచ్​, జపాన్​ ఆటోమొబైల్​ సంస్థల చూపు ఇప్పుడు ఇండియాపై పడింది! అత్యంత వేగంగా వృద్ధిచెందుతున్న ఆటో పరిశ్రమగా గుర్తింపు తెచ్చుకుంటున్న ఇండియాలో వ్యాపారాన్ని పెంచుకోవాలని ఈ రెండు చూస్తున్నాయి. ఇండియాతో పాటు లాటిన్​ అమెరికా, యూరోప్​లలోనూ వివిధ మోడల్స్​ను లాంచ్​ చేసి కస్టమర్లను ఆకర్షించాలని నిర్ణయించుకున్నాయి.

ఇండియాలో.. నిస్సాన్​ ఎక్కువగా పెట్టుబడులు పెట్టింది. 2025 నాటికి పలు మోడల్స్​ను లాంచ్​ చేయాలని రెండు సంస్థలు ఫిక్స్​ అయ్యాయి! రెనాల్ట్​ నుంచి అత్యంత ప్రాముఖ్యత సంపాదించుకున్న స్పోర్ట్స్​ యుటిలిటీ వెహికిల్​ 'డస్టర్​'.. వీటిల్లో ఒకటని తెలుస్తోంది.

క్రాస్​ బ్యాడ్జింగ్​తో..

Renault Duster car price in India : ప్లాంట్​ యుటిలిటీ రేట్​ను పెంచుకుని, ఖర్చులను తగ్గించుకోవడంపై ఈ ఆటోమొబైల్​ సంస్థలు దృష్టిపెట్టొచ్చు. ఇక్కడే 'క్రాస్​ బ్యాడ్జింగ్​' వెహికిల్స్​ బయటకు రావచ్చు. మరీ ముఖ్యంగా.. రెనాల్ట్​ డస్టర్​గా ఉన్న ఈ ఎస్​యూవీ.. ఇప్పుడు బయటకొస్తే.. నిస్సాన్​- రెనాల్ట్​ బ్రాండ్స్​ను కలిగి ఉండొచ్చు.

అయితే.. ఈ వార్తలకు సంబంధించి నిస్సాన్​ ఇంకా స్పందించలేదు. రెనాల్ట్​ సైతం.. కొత్త ప్రాజెక్టులపై స్పందించేందుకు నిరాకరించింది.

Renault Duster latest news : డస్టర్​ తరహాలోనే మరిన్ని మోడల్స్​ను ఇండియాలో తయారు చేసే విధంగా ఈ రెండు సంస్థలు కృషిచేసే అవకాశం ఉంది. 2022లో ఇండియా ఆటో మార్కెట్​లో రెనాల్ట్​- నిస్సాన్​లకు మొత్తం మీద 3శాతం వాటా ఉంది. ఇండియాలో తమ మార్కెట్​ వాటాను పెంచుకునేందుకు రెనాల్ట్​ ప్లాన్​ చేస్తున్నట్టు సమాచారం.

రెనాల్ట్​లో అత్యధికంగా అమ్ముడుపోతున్న చిన్న కార్ల సెగ్మెంట్​లోని 'క్విడ్​'కు ఎలక్ట్రిక్​ వర్షెన్​ వచ్చే అవకాశం ఉందని గత కొంతకాలంగా ఊహాగానాలు నెలకొన్నాయి. ఇక ఈ ప్రాజెక్టులోకి నిస్సాన్​ కూడా వచ్చిన చేరినట్టు ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి.

Whats_app_banner