Renault Kwid EV : ఇండియాలో క్విడ్​ ఈవీ లాంచ్​కు రెనాల్ట్​ ప్లాన్స్​..!-renault plans to launch kwid ev in india check full details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Renault Plans To Launch Kwid Ev In India Check Full Details Here

Renault Kwid EV : ఇండియాలో క్విడ్​ ఈవీ లాంచ్​కు రెనాల్ట్​ ప్లాన్స్​..!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 07, 2023 11:53 AM IST

Renault Kwid EV launch in India : ఇండియాలో క్విడ్​ ఈవీని లాంచ్​ చేసేందుకు రెనాల్ట్​ ప్లాన్స్​ చేస్తున్నట్టు తెలుస్తోంది. 2024 చివర్లో ఇండియాలో క్విడ్​ ఈవీ లాంచ్​ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇండియాలో రెనాల్ట్​ క్విడ్​ ఈవీ లాంచ్​..!
ఇండియాలో రెనాల్ట్​ క్విడ్​ ఈవీ లాంచ్​..!

Renault Kwid EV launch in India : ఇండియా మార్కెట్​లో.. డిమాండ్​ అధికంగా ఉన్న ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​పై ఇప్పుడు దాదాపు అన్ని ఆటో సంస్థలు దృష్టిసారించాయి. కొత్త కొత్త లాంచ్​లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. తాజాగా.. ఈ జాబితాలోకి రెనాల్ట్​ కూడా చేరే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. క్విడ్​కు ఈవీ వర్షెన్​ను తీసుకొచ్చి.. ఇండియా మార్కెట్​లో వేగంగా వృద్ధి చెందాలని రెనాల్ట్​ సంస్థ భావిస్తున్నట్టు సమాచారం.

ట్రెండింగ్ వార్తలు

క్విడ్​ ఈవీ కోసం ప్లాన్స్​..!

క్విడ్​ హ్యాచ్​బ్యాక్​కు మేడ్​-ఇన్​- ఇండియా ఎలక్ట్రిక్​ వర్షెన్​ లాంచ్​ చేసే విషయంపై రెనాల్ట్​ కసరత్తులు చేస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే.. భాగస్వామి సంస్థ నిస్సాన్​ మోటార్​తో ఈ విషయంపై ఇంకా చర్చలు జరిపినట్టు కనిపించడం లేదు. కానీ ఈవీ సెగ్మెంట్​లో బిజినెస్​ను చూసి.. ఎలక్ట్రిక్​ వాహనాలను ఇండియాలోకి తీసుకొచ్చేందుకు రెనాల్ట్​ సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. 2022లో ఇండియా ఈవీ సెగ్మెంట్​ వేగంగా వృద్ధిచెందింది. కానీ మొత్తం వాహనాల సేల్స్​లో ఇది 1శాతం కన్నా తక్కువగానే ఉన్నప్పటికీ.. 2030 నాటికి 30శాతం టార్గెట్​ను ప్రభుత్వం పెట్టుకోవడంతో ఇక్కడ మంచి వ్యాపారం జరుగుతుందని రెనాల్ట్​ భావిస్తున్నట్టు సమాచారం.

Renault Kwid EV : ఈ విషయంపై త్వరలో సమీక్ష జరగనున్నట్టు.. అందులో డిమాండ్​, ధర, ఈవీని స్థానికంగా తయారు చేసే సామర్థ్యం వంటి అంశాలను రెనాల్ట్​ పరిశీలించనున్నట్టు తెలుస్తోంది. 2024 చివర్లో రెనాల్ట్​ నుంచి ఓ ఈవీ రావొచ్చని ఊహాగానాలు ఇప్పటికే జోరందుకున్నాయి.

ఇండియాలో రెనాల్ట్​ మంచి మార్కెటే ఉంది! 2022లో తక్కువ కార్లే అమ్మినా.. ఆ సంస్థ ఇంకా లాభాల్లోనే ఉంది.

Renault Kwid EV price : తాజా వార్తలపై రెనాల్ట్​ ఇండియా స్పందించలేదు. కానీ.. అంతర్జాతీయంగా ఈవీ మార్కెట్​పై దృష్టిసారించినట్టు వ్యాఖ్యానించింది. ఈ సెగ్మెంట్​లో ఇండియా అనేది కీలకమైన మార్కెట్​ అని పేర్కొంది.

ఇండియా ఆటో మార్కెట్​ జోరు..

ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటో మార్కెట్​గా ఇటీవలే అవతరించింది ఇండియా. జపాన్​ను వెనక్కి నెట్టి ఆ స్థానాన్ని దక్కించుకుంది. ప్యాసింజర్​ వాహనాల విక్రయాల్లో ఇండియా దూసుకెళుతోంది. ఇటు ఈవీ సేల్స్​ కూడా పెరుగుతున్నాయి. టాటా మోటార్స్​, హ్యుందాయ్​ వంటి సంస్థలు ఇప్పటికే ఈవీ సెగ్మెంట్​లో దుమ్మురేపుతున్నాయి. మరి ప్రస్తుతం ఇండియాలో ఉన్న పోటీని తట్టుకుని, రెనాల్ట్​ ఏ విధంగా ముందుకెళుతుందో చూడాలి.

WhatsApp channel

సంబంధిత కథనం