Budget 2023 : ఆటో పరిశ్రమలో.. నిర్మలమ్మ పద్దుపై 'ఈవీ' ఆశలు!
Auto sector expectation on Budget 2023 : ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. ఈ క్రమంలో ఆటో పరిశ్రమలో ఈ దఫా బడ్జెట్‌పై ఉన్న అంచనాలు, ఆశలు తెలుసుకుందాము.
Auto sector expectation on Budget 2023 : ఇప్పుడు దేశంలో 'బడ్జెట్ 2023' హాట్ టాపిక్! పార్లమెంట్లో ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. నిర్మలమ్మ పద్దుపై అటు సామాన్యులతో పాటు ఇటు వివిధ పరిశ్రమల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు.. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చివరి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే కావడంతో.. ఆశలు మరింత పెరిగాయి. ఇక ఆటో పరిశ్రమ విషయానికొస్తే.. జీఎస్టీ విషయంలో ఊరట, ఈవీ సెగ్మెంట్‌తో పాటు వివిధ అంశాల్లో ప్రోత్సాహకాల పెంపు ఉంటుందని అంచనాలు ఉన్నాయి.
ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్‌ను ప్రోత్సహించే విధంగా..!
దేశ జీడీపీ వృద్ధికి కృషి చేస్తున్న పరిశ్రమల్లో ఆటో ఇండస్ట్రీ ఒకటి. జీడీపీలో 6శాతం కన్నా ఎక్కువ వాటా ఈ పరిశ్రమకు ఉంది. ఉద్యోగాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీ ప్రభావం చూపించగలదు. ఈ దఫా బడ్జెట్లో ఆటో రంగానికి సంచలనకర ప్రకటనలు ఏమీ ఉండవని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే.. ఈవీ, జీఎస్టీ విషయంపై మాత్రం ఆశలు పెరుగుతున్నాయి.
Auto sector budget expectations : "ఈవీ మేన్యుఫ్యాక్చరింగ్కు సంబంధించి జీఎస్టీ విషయంలో ఊరట లభిస్తుందని ఆశిస్తున్నాము. ఈవీలపై ప్రస్తుతం 5శాతం జీఎస్ఈటీ ఉంది. కానీ ఈవీలు తయారు చేసేందుకు వినియోగించే విడి భాగాలపై 18-28శాతం వరకు జీఎస్టీ పడుతోంది. ఫలితంగా సంస్థల వర్కింగ్ క్యాపిటల్‌పై ప్రభావం పడుతోంది," అని వెంచర్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ వినీత్ బలింజ్కర్ తెలిపారు.
"ఎగుమతులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం ఏవైనా చర్యలు చేపడుతుందని మార్కెట్లో ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. అందుకే ఈ దఫా బడ్జెట్‌పై ఆశలు ఎక్కువగా ఉన్నాయి. ఈవీ మేన్యుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లో కేటాయింపులు కూడా కీలకంగా మారనున్నాయి. వీటికి అదనంగా.. పీఎల్ఐ స్కీమ్స్‌పై పరిశ్రమ చూపు ఉంటుంది. మౌలికవసతులు, సంక్షేమ పథకాలకు భారీగా కేటాయింపులు ఇస్తే.. రూరల్ కన్జ్యూమర్ ఇన్‌కమ్‌కు ఊరట లభిస్తుంది," అని రిలెగరే బ్రోకింగ్ సంస్థకు చెందిన ఫండమెంటల్ ఎనలిస్ట్ నిర్వి అషర్ అభిప్రాయపడ్డారు.
గ్రామీణ భారతం వృద్ధితో..
2023 Budget EV segment : "ఈవీ, ఈవీ మేన్యుఫ్యాక్చరింగ్పై మరిన్ని పోత్రాహకాలు లభిస్తాయని అంచనా వేస్తున్నాము. ఈవీ సెగ్మెంట్లో మేన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా ఇండియా ఎదగే విధంగా ప్రభుత్వం ప్రోత్సహించాలి. ఛార్జింగ్ విషయంలో మౌలికవసతులకు భారీగా ఇన్సెంటివ్స్ ఉండొచ్చు. గ్రీన్ టెక్నాలజీకి మద్దతుగా ఆర్ ఎండ్ డీని బలోపేతం చేయవచ్చు. జీఎస్టీని తగ్గించాలని ఆటో పరిశ్రమ కోరుకుంటోంది. కానీ ఈ దఫా బడ్జెట్లో అలా జరగకపోవచ్చు," అని సెబీ రిజిస్ట్రేషన్ పొందిన ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ సంస్థకు చెందిన రామ్ కల్యాణ్ మెడూరు పేర్కొన్నారు.
"ఈవీ సెగ్మెంట్‌ను ప్రోత్సహించే విధంగా ఈ బడ్జెట్ ఉండొచ్చు. ఎలక్ట్రిక్ ఛార్జింగ్ మౌలికవసతులను పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టొచ్చు. మౌలికవసతులు, నీటిపారుదల, గ్రామీణ భారత ఆర్థికంపై ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెడితే.. ఆటో పరిశ్రమ పరోక్షంగా లబ్ధిపొందుతుంది," అని యాక్సిస్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ ఎనలిస్ట్ ఆదిత్య వేలేకర్ తెలిపారు.
సంబంధిత కథనం