Electric car charging costs : మీ ఈవీ ఛార్జింగ్​ ఖర్చులను తగ్గించుకోండి ఇలా..-how to keep electric car charging costs down see all the useful tips here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Electric Car Charging Costs : మీ ఈవీ ఛార్జింగ్​ ఖర్చులను తగ్గించుకోండి ఇలా..

Electric car charging costs : మీ ఈవీ ఛార్జింగ్​ ఖర్చులను తగ్గించుకోండి ఇలా..

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 22, 2023 10:03 AM IST

How to reduce electric car charging costs : మీ వద్ద ఎలక్ట్రిక్​ కారు ఉందా? మీ ఈవీ ఛార్జింగ్​ ఖర్చులు పెరుగుతున్నాయా? అయితే.. ఈ టిప్స్​ పాటించి.. ఖర్చులు తగ్గించుకోండి..

మీ ఈవీ ఛార్జింగ్​ ఖర్చులను తగ్గించుకోండి ఇలా..
మీ ఈవీ ఛార్జింగ్​ ఖర్చులను తగ్గించుకోండి ఇలా.. (REUTERS)

How to reduce electric car charging costs : దేశంలో గత కొన్నేళ్లుగా.. ఎలక్ట్రిక్​ వాహనాలకు డిమాండ్​ పెరుగుతోంది. ఇంధన ఖర్చులు చూసి భయపడిపోతున్న ప్రజలు.. ఈవీలవైపు మొగ్గుచూపుతున్నారు. ధర కాస్త ఎక్కువ ఉన్నప్పటికీ.. దీర్ఘకాలిక ఆలోచనలతో ఎలక్ట్రిక్​ వాహనాలను కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మరి విద్యుత్​ ఛార్జీలు పెరిగితే పరిస్థితేంటి? అందుకే.. పెట్రోల్​ బండిని వాడినా, ఛార్జింగ్​ చేసే బండిని వాడినా.. ఏఫీషియెన్సీని పెంచుకునేందుకు కొన్ని టిప్స్​ ఉంటాయి. ఈ నేపథ్యంలో.. ఈవీల ఛార్జింగ్​ ఖర్చులను తగ్గించుకునేందుకు పాటించాల్సిన కొన్ని టిప్స్​ని ఇప్పుడు తెలుసుకుందాము.

బ్యాటరీని పూర్తిగా వాడకండి..

ఈవీ బ్యాటరీని పూర్తిగా వాడేయడం అంత మంచిది కాదు. 20శాతం- 80శాతం మధ్యలో బ్యాటరీ ఛార్జింగ్​ను ఉంచాలి. అత్యవసర పరిస్థితుల్లో తప్పితే.. కారు బ్యాటరీని పూర్తిగా వినియోగించుకోకూడదు. ఈ విధంగా.. ఈవీ బ్యాటరీ ఛార్జింగ్​ ఖర్చులను దీర్ఘకాలంలో భారీగా తగ్గించుకోవచ్చు. బ్యాటరీ లైఫ్​కి కూడా ఇది శ్రేయస్కరం. పూర్తిగా వాడేసినా, పూర్తిగా ఛార్జ్​ చేసినా.. బ్యాటరీపై ఎక్కువ ప్రెజర్​ పడుతుందని గుర్తుపెట్టుకోవాలి.

రికూపరేషన్​ మోడ్​తో ఈవీకి లాభం!

Tips to reduce reduce electric car charging costs : మీ ఈవీలో రికూపరేషన్​ మోడ్​ ఉంటే.. దానిని కచ్చితంగా వినియోగించుకోండి. రికూపరేషన్​ మోడ్​ అంటే.. బ్రేక్స్​ వేస్తున్న సమయంలో జెనరేట్​ అయ్యే ఎనర్జీని.. తిరిగి బ్యాటరీ ప్యాక్​కు పంపించడం! బ్రేక్​ వేసిన ప్రతిసారీ ఎంతో కొంత ఎనర్జీ జెనరేట్​ అవుతుంది. దానిని తిరిగి బ్యాటరీకి పంపిస్తే.. ఛార్జింగ్​ లెవల్​ కొంతైనా పెరుగుతుంది.

How to minimize fuel bills : ఇంధన ఖర్చులు తగ్గించుకోవాలంటే పాటించాల్సిన టిప్స్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

సోలార్​ ఎనర్జీ ట్రై చేయండి..!

దేశంలో సౌర విద్యుత్​కు ఇటీవలి కాలంలో డిమాండ్​ భారీగా పెరుగుతోంది. మీ ఈవీకి కూడా ఈ టెక్నాలజీని ఇవ్వొచ్చు కదా! ఇంట్లో చిన్నపాటి సోలార్​ ప్యానెల్​ పెట్టుకుంటే మంచిది. పైగా.. దీనికి అధికారుల నుంచి అనుమతులు కూడా అక్కర్లేదు. ఆ సోలార్​ ప్యానెల్​ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్​ను ఈవీ ఛార్జింగ్​ కోసం వాడుకుంటే.. బిల్లు చాలా తక్కువ అవుతుంది.

సన్​లైట్​లో ఛార్జ్​ చేయకండి..!

Best Electric cars in India : ఎలక్ట్రిక్​ వాహనాల్లో లిథియం- ఐయాన్​ బ్యాటరీ ఉంటుంది. ఉష్ణోగ్రతలు పెరిగితే.. ఈ తరహా బ్యాటరీపై ప్రెజర్​ పడుతుంది. ఓవర్​హీట్​ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే.. డైరక్టర్​ సన్​లైట్​లో మీ ఈవీని ఛార్జ్​ చేయకండి. నీడ ఉన్న ప్రాంతాన్ని చూసుకుని ఛార్జింగ్​ పెట్టడం శ్రేయస్కరం.

How to choose best electric car : ది బెస్ట్​ ఎలక్ట్రిక్​ కారును ఎలా ఎంచుకోవాలి అన్న విషయం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

డ్రైవింగ్​తోనే పొదుపు..!

ఎన్ని టిప్స్​ చెప్పినా.. చివరికి ఇంధన, విద్యుత్​ ఖర్చులు తగ్గించుకోవడం అనేది మన డ్రైవింగ్​ పైనే ఆధారపడి ఉంటుంది! స్మూత్​గా డ్రైవ్​ చేయాలి. పదేపదే యాక్సలేటర్​ ప్రెస్​ చేయండి, బ్రేక్​లు వేయడం చేస్తే ఎఫీషియెన్సీ దెబ్బతింటుంది. ముఖ్యంగా.. విద్యుత్​ వాహనాలను కాస్త తక్కువ స్పీడ్​లో డ్రైవ్​ చేస్తే.. రేంజ్​ కచ్చితంగా పెరుగుతుంది!

మీ ఈవీని జాగ్రత్తగా చూసుకోండి..!

Electric cars charging tips : కారు కొని, డ్రైవ్​ చేసి వదిలేస్తే సరిపోదు. దానిని మెయిన్​టైన్​ చేయాలి. మీరు ఎంత బాగా దానిని చూసుకుంటే.. అది అంత మంచి మైలేజ్​/ రేంజ్​ ఇస్తుంది. తరచూ సర్వీసింగ్​కు ఇస్తూ ఉండండి. ఆప్టిమం ఎయిరోడైనమిక్​ ఎఫీషియెన్సీ కోసం బండిని క్లీన్​గా ఉంచుకోండి. మీ ఈవీ టైర్​ ప్రెజర్​ ఎప్పటికప్పుడు చెక్​ చేసుకోండి.

Whats_app_banner

సంబంధిత కథనం