How to minimize fuel bills : ఇంధన ఖర్చులు తగ్గించుకోవాలంటే.. ఇవి ట్రై చేయండి!
How to minimize fuel bills : నెలనెలా.. ఇంధన బిల్లులు చూసి భయపడిపోతున్నారా? వాహనాల మైలేజ్‌ను పెంచుకుని, ఫ్యూయెల్ బిల్లులను తగ్గించుకునే మార్గాలు ఉన్నాయి. అవేంటంటే..
How to improve car mileage : వాహనాలు కొనడం ఒక ఎత్తు అయితే.. వాటికి పెట్రోల్/ డీజిల్ కొట్టించేందుకు పెట్టే ఖర్చు ఇంకో ఎత్తు! ముఖ్యంగా దేశంలో ఇంధన ధరలు.. ఏడాదిన్నరలో ఏ రేంజ్లో పెరిగాయో అందరికి తెలిసిందే. మరి ఈ సమయంలో ఇంధన ఖర్చులు తగ్గించుకునే విధంగా కొన్ని మార్గాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే.. వాహనాల మైలేజ్ పెరగడంతో పాటు ఫ్యూయెల్ బిల్లులు కూడా తగ్గుతాయి. అవేంటంటే..
సిగ్నల్ పడితే..
నగరాల్లో జీవించే వారికి.. ట్రాఫిక్ కష్టాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ట్రాఫిక్ ఉన్నప్పుడు.. ఇంజిన్‌ను ఆఫ్ చేస్తే మంచిది! ఇంజిన్ రన్నింగ్‌లో ఉంటే ఇంధనం ఖర్చు అవుతుంది. బండి నడవకపోతుంటే.. ఇంజిన్‌ను ఆపడం ఉత్తమం. ట్రాఫిక్ సిగ్నల్ ఎంత సేపు ఉందనేది లెక్కేసుకుని మీరు మీ ఇంజిన్‌ను ఆపాల్సి ఉంటుంది. ఎక్కువసేపు పడుతుంటే ఆపేయాలి. 30సెకన్ల కన్నా తక్కువ వ్యవధి ఉంటే.. ఇంజిన్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు.
డ్రైవింగ్‌తోనే సాధ్యం..!
How to save car fuel : ఫ్యూయెల్ బిల్లులు తగ్గించుకోవడం అనేది మన డ్రైవింగ్‌పైనే ఆధారపడి ఉంటుంది. కారు, బైక్‌ను సరిగ్గా నడిపితేనే.. ఇంధనం తక్కువ ఖర్చు అవుతుంది. ప్రతిసారీ బ్రేక్‌లు సడెన్‌గా వేయడం, సడెన్‌గా వాహనాన్ని రైజ్ చేయడం వంటివి చేయడంతో ఇంజిన్ మీద ఎక్కువ ప్రెజర్ పడి.. ఎక్కువ ఇంధనం ఖర్చు అవుతుంది. అదే సమయంలో ఒకే స్పీడు, ఒకే ఆర్పీఎంను మెయింటైన్ చేస్తే.. మంచి ఫలితాలు కనిపిస్తాయి. దీర్ఘకాలంలో భారీగా డబ్బు ఆదా అయ్యే అవకాశం కూడా ఉంటుంది.
రూట్‌తో జాగ్రత్త..!
గమ్యస్థానానికి ఎంత తొందరగా చేరుకుంటే అంత మంచిది! అంటే.. లాంగ్ రూట్‌ను ఎంచుకోకుండా, షార్ట్ రూట్లో వెళ్లడం ఉత్తమం. లాంగ్ రూట్లో వెళ్లి ట్రాఫిక్‌లో ఇరుక్కుంటే.. మాటిమాటికీ బ్రేక్‌లు వేయాల్సి ఉంటుంది. యాక్సలరేషన్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే.. ఇంజిన్‌పై ప్రెజర్ పడుతుంది. ఇంధనం ఎక్కువ ఖర్చు కాకుండా ఉండాలంటే.. షార్ట్ రూట్స్ చూసుకోవాల్సిందే.
టైర్ ప్రెజర్..
Tips to improve car mileage : కారుకు మంచి మైలేజ్ లభించాలంటే.. టైర్ ప్రెజర్ కూడా కీలకమే. ఆప్టిమమ్ టైర్ ప్రెజర్ ఉండేడట్టు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. టైర్ ప్రెజర్ తగ్గితే.. రోడ్డుతో రాపిడి పెరగడం/తగ్గడం జరిగి.. కావాల్సిన దాని కన్నా ఎక్కువ ఇంధనం ఖర్చు అవుతుంది. అయితే.. టైర్ ప్రెజర్ అనేది ఒక్కో వాహనానికి ఒక్కో విధంగా ఉంటుంది. యూజర్ మేన్యువల్లో టైర్ ప్రెజర్ గురించి రాసి ఉంటుంది. దానిని ఫాలో అయ్యి.. ప్రతిసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మంచి మైలేజ్ సంపాదించుకోవచ్చు. ఇంధన బిల్లులను తగ్గించుకోవచ్చు.