తెలుగు న్యూస్ / ఫోటో /
Budget 2023 : బడ్జెట్ 2023పై మీమ్స్.. మామూలుగా లేవుగా!
- Memes on Budget 2023 : కేంద్ర బడ్జెట్ 2023కి ఇంకొన్ని రోజుల సమయమే ఉంది. ఫిబ్రవరి 1న పార్లమెంట్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ఆమె ప్రసంగంపై దేశ ప్రజల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఫలితంగా బడ్జెట్2023 ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఈ విషయంపై మీమ్స్ కూడా పేలుతున్నాయి. వాటిల్లో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం..

(1 / 6)
ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ఈ దఫా బడ్జెట్‌పై ప్రజల్లో చాలా ఆశలు ఉన్నాయి. భారీగా పెరిగిపోతున్న ధరల నుంచి ఏదైనా ఉపశమనం లభించే విధంగా వార్త ఉంటుందా? అని మధ్యతరగతి ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో సామాజిక మాధ్యమాల్లో పలు మీమ్స్ వైరల్‌గా మారాయి.(MINT)
(2 / 6)
‘బడ్జెట్‌కి ముందు భారతీయుల గుండెలు గట్టిగా కొట్టుకుంటాయి,’ అన్న మీమ్ వైరల్‌గా మారింది. మధ్యతరగతి వారికి ఊరట లభిస్తుందా? లేదా? అన్న టెన్షన్ ఉంటుందని ఈ మీమ్ సూచిస్తోంది.(MINT)
(3 / 6)
బడ్జెట్లో ఉపయోగించే భాష సాధారణ ప్రజలకు సరిగ్గా అర్థమవ్వదు. ముఖ్యంగా ట్యాక్స్ టర్మినాలజీ చాలా కష్టంగా ఉంటుంది. సరిగ్గా వివరించండంటూ చెబుతున్న మీమ్ ఇది.(MINT)
(4 / 6)
‘నేను కూడా మధ్య తరగతికి చెందిన మనిషినే. ఆ నొప్పి నాకు కూడా తెలుసు.’ అంటూ ధరల భారంపై వ్యాఖ్యానించారు నిర్మలా సీతారామన్. ఈ క్రమంలో వచ్చిన మీమ్ ఇది.(TWITTER/satish acharya)
(5 / 6)
‘ఏ వస్తువు ఆర్డ్ చేసినా.. డెలివరీ ఇస్తాము,’ అని జొమాటో, బ్లింకిట్ చెబుతుంటే.. ‘ఏ వస్తువును కొనుగోలు చేసినా.. దానిపై జీఎస్టీ వేస్తాము,’ అని కేంద్ర మంత్రి చెబుతున్నట్టుగా రూపొందించిన మీమ్ ఇది. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
ఇతర గ్యాలరీలు