Hyundai Exter price hike : పెరిగిన హ్యుందాయ్ ఎక్స్టర్ ధర.. కస్టమర్లకు షాక్!
Hyundai Exter price hike : హ్యుందాయ్ ఎక్స్టర్ ఇంట్రొడక్టరీ ప్రైజ్ ముగిసింది! ఈ ఎస్యూవీ ధరను సంస్థ తొలిసారిగా పెంచింది. ఆ వివరాలు..
Hyundai Exter price hike : పండుగ సీజన్లో ఆఫర్స్, డిస్కౌంట్స్ కోసం ఎదురుచూస్తున్న కస్టమర్లకు దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ షాక్ ఇచ్చింది. ఇటీవలే లాంచ్ అయిన హ్యుందాయ్ ఎక్స్టర్ ఇంట్రొడక్టరీ ప్రైజ్ ముగిసినట్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ మైక్రో-ఎస్యూవీ ధరను తొలిసారి పెంచింది. ఆ వివరాల్లోకి వెళితే..
ఎక్స్టర్ ధర ఎంత పెరిగిందంటే..
హ్యుందాయ్ ఎక్స్టర్లో ఆరు వేరియంట్లు ఉన్నాయి. అవి.. ఈఎక్స్, ఈఎక్స్ (ఓ), ఎస్, ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ (ఓ), ఎస్ఎక్స్ (ఓ) కనెక్ట్. ఇక ఎస్ఎక్స్ (ఓ) ఎంటీ డ్యూయెల్-టోన్ వర్షెన్ ధర అత్యధికంగా రూ. 16వేలు పెరిగింది. టాప్ ఎండ్ మోడల్ ఎస్ఎక్స్ (ఓ) కనెక్ట్ ఏఎంటీ డ్యూయెల్ టోన్ వర్షెన్ ధర రూ. 5వేలు పెరిగింది.
Hyundai Exter price Hyderabad : ఈ హ్యుందాయ్ ఎక్సటర్లో అట్లాస్ వైట్, కాస్మిక్ బ్లూ, ఫెర్రీ రెడ్, రేంజర్ ఖాఖీ, స్టేరీ నైట్, టైటాన్ గ్రే, అట్లాస్ బ్లాక్ విత్ ఎబిస్ బ్లాక్, కాస్మిక్ బ్లూ విత్ ఎబిస్ బ్లాక్, రేంజర్ ఖాఖీ విత్ ఎబిస్ బ్లాక్ వంటి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. కస్టమర్లు తమ ఇంట్రెస్ట్‌కి తగ్గ కలర్‌ను ఎంచుకోవచ్చు.
ఈ హ్యుందాయ్ ఎక్స్టర్ ఎస్‌యూవీలో 1.2 లీటర్, 4 సిలిండర్, నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 82 హెచ్‌పీ పవర్‌ను, 114 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. సీఎన్జీ వేరియంట్ కూడా లభిస్తోంది.
ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో.. టాటా పంచ్, సిట్రోయెన్ సీ3కి ఈ హ్యుందాయ్ ఎక్స్టర్ గట్టిపోటీనిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
వెయిటింగ్ పీరియడ్ ఎక్కువే..!
Hyundai Exter waiting period : ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్యూవీ సెగ్మెంట్‌కు మంచి డిమాండ్ కనిపిస్తోంది. ఇక కొత్తగా లాంచ్ అవుతున్న మోడల్స్‌పై కస్టమర్లు అధికంగా ఫోకస్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. జులైలో మార్కెట్లో అడుగుపెట్టిన హ్యుందాయ్ ఎక్స్టర్ ఎస్‌యూవీకి బీభత్సమైన డిమాండ్ లభిస్తోంది. ఈ మోడల్లోని పలు వేరియంట్స్‌కు ఇప్పటికే 1 ఏడాది వెయిటింగ్ పీరియడ్ నడుస్తుండటం విశేషం! పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం