Cars launch in October : టాటా పంచ్​ ఈవీ లాంచ్​ డేట్​ ఫిక్స్​! అక్టోబర్​లో వచ్చేవి ఇవే!-tata punch ev to nissan magnite kuro cars expected to launch in october 2023 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Cars Launch In October : టాటా పంచ్​ ఈవీ లాంచ్​ డేట్​ ఫిక్స్​! అక్టోబర్​లో వచ్చేవి ఇవే!

Cars launch in October : టాటా పంచ్​ ఈవీ లాంచ్​ డేట్​ ఫిక్స్​! అక్టోబర్​లో వచ్చేవి ఇవే!

Sharath Chitturi HT Telugu
Sep 29, 2023 11:57 AM IST

Cars launch in October : టాటా పంచ్​ ఈవీతో పాటు మరికొన్ని వాహనాలు.. అక్టోబర్​లో లాంచ్​కు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాలు..

అక్టోబర్​లో ఈ మచ్​ అవైటెడ్​ వాహనాల లాంచ్​ ఫిక్స్​..!
అక్టోబర్​లో ఈ మచ్​ అవైటెడ్​ వాహనాల లాంచ్​ ఫిక్స్​..!

Cars launch in October 2023 : ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో మచ్​ అవైటెడ్​ మోడల్స్​లో ఒకటి టాటా పంచ్​ ఈవీ. ఈ మోడల్​.. వచ్చే నెలలో లాంచ్​ అయ్యే అవకాశం ఉంది. అంతే కాదు.. టాటా మోటార్స్​ నుంచి అక్టోబర్​లో 3 వాహనాలు లాంచ్​ అవుతాయని తెలుస్తోంది. నిస్సాన్​ సంస్థ కూడా ఓ స్పెషల్​ ఎడిషన్​ వెహికిల్​ను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో.. ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

నిస్సాన్​ మాగ్నైట్​ కురో..

ఇండియాలో నిస్సాన్​కు బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా ఉంది మాగ్నైట్​. ఇక ఇప్పుడు.. మాగ్నైట్​ స్పెషల్​ ఎడిషన్​ను లాంచ్​ చేస్తోంది నిస్సాన్​ సంస్థ. దీని పేరు నిస్సాన్​ మాగ్నైట్​ కురో ఎడిషన్​! ఈ మోడల్​ బుకింగ్స్​ ఇప్పటికే మొదలైపోయాయి. రూ. 11వేల టోకెన్​ అమౌంట్​తో.. సంస్థకు చెందిన అధికారిక వెబ్​సైట్​, డీలర్​షిప్​షోరూమ్స్​లో ఈ వెహికిల్​ను బుక్​ చేసుకోవచ్చు. ఇందులో ఎక్స్​వీ ఎంటీ, టర్బో ఎక్స్​వీ ఎంటీ, టర్బో ఎక్స్​వీ సీవీటీ మోడల్స్​ ఉండొచ్చు.

టాటా పంచ్​ ఈవీ..

Tata Punch EV launch date : టాటా పంచ్​ ఈవీ.. గత కొన్ని నెలలుగా వార్తల్లో నిలుస్తోంది. ఈ నెలలో లాంచ్​, వచ్చే నెలలో లాంచ్​ అంటూ కొన్ని నెలలుగా రూమర్స్​ వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు.. ఈ ఈవీని అక్టోబర్​లో లాంచ్​ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే.. ఈ టాటా పంచ్​ ఈవీ టెస్ట్​ రన్​ జరిగినట్టు సమాచారం.

టాటా పంచ్​ ఐసీఈ మోడల్​కు భారీ డిమాండ్​ కనిపించింది. ఇక ఈవీ వర్షెన్​కి కూడా ఆదరణ లభిస్తుందని టాటా మోటార్స్​ భావిస్తోంది. అయితే.. ఎలక్ట్రిక్​ వర్షెన్​కు పలు మార్పులు చేసినట్టు స్పై షాట్స్​ చూస్తే తెలుస్తోంది.

టాటా నెక్సాన్​ ఈవీ ఫేస్​లిఫ్ట్​ను గత నెలలోనే లాంచ్​ చేసింది టాటా మోటార్స్​. ఇక టాటా పంచ్​ ఈవీపైనా ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

టాటా హారియర్​- టాటా సఫారీ ఫేస్​లిఫ్ట్​..

2024 Tata Harrier launch date : టాటా హారియర్​, టాటా సఫారీ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​లను టాటా మోటార్స్​ సిద్ధం చేస్తోంది. ఈ రెండు ఎస్​యూవీలను ఇప్పటికే చాలాసార్లు టెస్ట్​ చేసింది సంస్థ. ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో అనధికారిక బుకింగ్స్​ కూడా ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఫలితంగా.. అక్టోబర్​లో ఈ ఎస్​యూవీల ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​లు లాంచ్​ అవుతాయని మార్కెట్​లో రూమర్స్​ మొదలయ్యాయి.

నిస్సాన్​ మాగ్నైట్​ మినహా.. మిగిలిన మోడల్స్​కు చెందిన లాంచ్​ డేట్​పై అధికారిక ప్రకటన లేదు. త్వరలోనే వీటిపై ఓ క్లారిటీ వస్తుందని తెలుస్తోంది.

Whats_app_banner

సంబంధిత కథనం