2023 Tata Nexon EV : టాటా నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌ను తాజాగా లాంచ్ చేసింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్. దీనిని నెక్సాన్.ఈవీ అని పిలుస్తోంది. ఈ 2023 వర్షెన్‌లో పెద్ద మార్పులే చేసింది సంస్థ. ఈ నేపథ్యంలో ఈ మోడల్ ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
2023 టాటా నెక్సాన్ ఈవీ డిజైన్ చాలా కొత్తగా, అట్రాక్టివ్‌గా ఉంది. టాటా కర్వ్ కాన్సెప్ట్ ఆధారంగా దీనిని రూపొందించారు. ఇందులో ఎయిర్ డ్యామ్, ఫుల్ విడ్త్ ఎల్ఈడీ లైట్ బార్ వంటివి వస్తున్నాయి. ఎంపవర్డ్ ఆక్సైడ్, ప్రిస్టీన్ వైట్, ఇంటెన్సీ టీల్, ఫ్లేమ్ రెడ్, డైటోనా గ్రే, ఫియర్లెస్ పర్పుల్, క్రియేటివ్ ఓషన్ వంటి రంగుల్లో ఈ మోడల్ అందుబాటులోకి వచ్చింది.
Tata Nexon EV facelift price : ఈ ఎలక్ట్రిక్ వెహికిల్‌లో స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్ ఉన్నాయి. బండి ఫ్రెంట్ డిజైన్‌ను పూర్తిగా మార్చేసింది టాటా మోటార్స్. ఇందులో 16 ఇంచ్ అలాయ్ వీల్స్ వస్తున్నాయి. రేర్‌లో ఎల్ఈడీ లైట్ బార్ వస్తోంది. డెల్టా షేప్ ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్స్ లభిస్తున్నాయి. రేంజ్ రోవర్ తరహా ఫీల్‌ని ఇచ్చే రూఫ్ స్పాయిలర్ కూడా వస్తోంది.
ఇక కేబిన్‌లో 12.3 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, 10.25 ఇంచ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటర్, వయర్లెస్ స్మార్ట్‌వాచ్ ఛార్జర్, వాయిస్ కమాండ్ ఫంక్షన్, హైట్ అడ్జెస్టెబుల్- వెంటిలేటెడ్ ఫ్రెంట్ సీట్స్, ఎయిర్ ప్యూరిఫైయర్, జేబీఎల్ ఆడియో సిస్టెమ్, సబ్‌ఊఫర్, సన్‌రూఫ్ వంటివి లభిస్తున్నాయి.
Tata Nexon EV facelift price in Hyderabad : టాటా నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌లో రెండు బ్యాటరీ ఆప్షన్స్ లభిస్తున్నాయి. ఇక వేరియంట్లు.. మిడ్ రేంజ్, లాంగ్ రేంజ్ మోడల్స్ ఎక్స్‌షోరూం ధరల వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
సంబంధిత కథనం
టాపిక్