Mahindra electric vehicles : ఒకేసారి 3 ఈవీలను 'టెస్ట్​' చేసిన మహీంద్రా..!-mahindra track tests xuv e9 be 05 and xuv e8 electric suvs on world ev day ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mahindra Electric Vehicles : ఒకేసారి 3 ఈవీలను 'టెస్ట్​' చేసిన మహీంద్రా..!

Mahindra electric vehicles : ఒకేసారి 3 ఈవీలను 'టెస్ట్​' చేసిన మహీంద్రా..!

Sharath Chitturi HT Telugu
Sep 10, 2023 04:15 PM IST

Mahindra electric vehicles : మహీంద్రా నుంచి మూడు ఎలక్ట్రిక్​ వెహికిల్స్​ సిద్ధమవుతున్నాయి. తాజాగా.. వీటికి చెందిన ట్రాక్​ టెస్టింగ్​ జరిగింది. ఈ వీడియోను సంస్థ షేర్​ చేసింది.

ఒకేసారి 3 ఈవీలను 'టెస్ట్​' చేసిన మహీంద్రా..
ఒకేసారి 3 ఈవీలను 'టెస్ట్​' చేసిన మహీంద్రా..

Mahindra electric vehicles : వరల్డ్​ ఈవీ డే సందర్భంగా ఓ క్రేజీ అప్డేట్​ ఇచ్చింది దిగ్గజ్​ ఆటోమొబైల్​ సంస్థ మహీంద్రా అండ్​ మహీంద్రా. మూడు ఈవీలను టెస్ట్​ చేసినట్టు వెల్లడించింది. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్​ చేసింది.

ఎం అండ్​ ఎం విడుదల చేసిన వీడియోలో.. ఎక్స్​యూవీ.9, బీఈ.05, ఎక్స్​యూవీ.ఈ8 వంటి ఎలక్ట్రిక్​ వాహనాలు కనిపిస్తున్నాయి. వీటిని.. చెన్నైలో ట్రాక్​ టెస్టింగ్​ చేసింది సంస్థ. హై స్పీడ్​లో లీనియర్​, సర్క్యులర్​ రోడ్లపై ఈ ఈవీలు దీసుకెళ్లిన దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి.

ఎక్స్​యూవీ.ఈ9, బీఈ.05 ను తొలిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రదర్శించింది ఎం అండ్​ ఎం. వీటిని గతంలో యూకేలో రివీల్​ చేసింది. ఇండియాలోని ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​లో నెలకొన్న పోటీని ధీటుగా ఎదుర్కొనే విధంగా మహీంద్రా అండ్​ మహీంద్రా సంస్థ గట్టి ప్లాన్​ వేసినట్టు వీటి ద్వారా స్పష్టమవుతోంది. అంతేకాకుండా.. ఈవీ మార్కెట్​ను ఎస్​యూవీలతో డామినేట్​ చేయాలని కూడా సంస్థ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఎం అండ్​ ఎం నుంచి ఇప్పటికే.. ఎక్స్​యూవీ400 అనే పేరుతో ఒక ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ మార్కెట్​లో ఉంది. ఇక ప్రస్తుతం ట్రాక్​ టెస్ట్​ జరిగిన వాహనాలు కూడా ఎస్​యూవీలే! ఈ మూడు మోడల్స్​ కూడా.. 2025-2026 మధ్యలో లాంచ్​ అవుతాయని తెలుస్తోంది.

ఈ మూడు కొత్త ఎలక్ట్రిక్​ వాహనాలను ఐఎన్​జీఎల్​ఓ అనే కొత్త ప్లాట్​ఫామ్​పై రూపొందిస్తోంది మహీంద్రా అండ్​ మహీంద్రా. ఎక్స్​యూవ.ఈ రేంజ్​ మోడల్స్​ ప్రొడక్షన్​.. డిసెంబర్​ 2024లో ప్రారంభమవ్వొచ్చు. ఇక బీఈ రేంజ్​ మోడల్స్​.. 2025 అక్టోబర్​లో ప్రొడక్షన్​కు వెళ్లొచ్చు.

2027 నాటికి సంస్థ ప్రోర్ట్​ఫోలియోలో పావు వంతు మోడల్స్​ ఈవీలు ఉండేడట్టుగా ప్రణాళికలు వేసుకుంది ఎం అండ్​ ఎం. ఈ సంస్థ నుంచి వస్తున్న ఎస్​యూవీ మోడల్స్​కు ఇప్పటికే మార్కెట్​లో బీభత్సమైన డిమాండ్​ కనిపిస్తోంది. ఇక ఈ-ఎస్​యూవీలి కూడా క్లిక్​ అవుతాయని సంస్థ ఆశిస్తోంది. మహీంద్రా థార్​కు కూడా ఈవీ వర్షెన్​ వస్తోందని సమాచారం.

ఈ ఎస్​యూవీలపై భారీ డిస్కౌంట్లు..

Discounts on Mahindra and Mahindra cars : పండుగ సీజన్​ నేపథ్యంలో ఆటోమొబైల్​ సంస్థలు తమ వాహనాలపై డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. ఈ జాబితాలోకి మహీంద్రా అండ్​ మహీంద్రా కూడా చేరింది. పలు ఎస్​యూవీలపై ఈ నెలలో రూ. 1.25లక్షల వరకు డిస్కౌంట్లు ఇస్తోంది.

ఎక్స్​యూవీ400 ఈవీపై ఏకంగా రూ. 1.25లక్షల డిస్కౌంట్​ ఇస్తోంది మహీంద్రా అండ్​ మహీంద్రా. మరాజో ఎస్​యూవీపై రూ. 58వేల క్యాష్​ డిస్కౌంట్​, రూ. 15వేల వరకు ఫ్రీ యాక్ససరీస్​ వంటివి ఇస్తోంది. ఇక బొలేరో నియోపై రూ. 7వేల నుంచి రూ. 35వేల వరకు క్యాష్​ డిస్కౌంట్స్​, రూ. 15వేలు విలువ చేసే ఫ్రీ యాక్ససరీస్​ను ఇస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం