World EV day 2023 : ఎలక్ట్రిక్​ వెహికిల్​ కొన్నారా? ఈ ‘ఛార్జింగ్​’ టిప్స్​ తెలుసుకోండి..-world ev day 2023 here are some tips on dos and donts of electric vehicle charging ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  World Ev Day 2023 : ఎలక్ట్రిక్​ వెహికిల్​ కొన్నారా? ఈ ‘ఛార్జింగ్​’ టిప్స్​ తెలుసుకోండి..

World EV day 2023 : ఎలక్ట్రిక్​ వెహికిల్​ కొన్నారా? ఈ ‘ఛార్జింగ్​’ టిప్స్​ తెలుసుకోండి..

Sharath Chitturi HT Telugu
Sep 09, 2023 12:34 PM IST

World EV day 2023 : మీ దగ్గర ఈవీ ఉందా? లేదా కొత్తగా ఎలక్ట్రిక్​ వెహికిల్​ని తీసుకోవాలని చూస్తున్నారా? అయితే.. ఇది మీకోసమే!

ఎలక్ట్రిక్​ వెహికిల్​ కొన్నారా? ఈ టీప్స్​ పాటిస్తే ఖర్చులు తగ్గుతాయి​!
ఎలక్ట్రిక్​ వెహికిల్​ కొన్నారా? ఈ టీప్స్​ పాటిస్తే ఖర్చులు తగ్గుతాయి​!

World EV day 2023 : ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా సెప్టెంబర్​ 9వ తేదీని 'వరల్డ్​ ఈవీ డే'గా పరిగణిస్తారు. పర్యావరణానికి మెలు చేసే పనులు చేయడంలో భాగంగా.. ఎలక్ట్రిక్​ వాహనాలను ప్రమోట్​ చేయడం కోసమే ఈ వరల్డ్​ ఈవీ డేని జరుపుకుంటారు. ఇక ఇండియాలో ఈవీ సెగ్మెంట్​ భారీగా వృద్ధి చెందుతోంది. చాలా మంది ఎలక్ట్రిక్​ వెహికిల్​ను కొనేందుకు మొగ్గుచూపుతున్నారు. వీరిలో మీరు కూడా ఉన్నారా? కొత్త ఈవీ కొనాలని చూస్తున్నారా? లేక ఇప్పటికే మీ వద్ద ఓ ఎలక్ట్రిక్​ కారు ఉందా? అయితే ఇది మీకోసమే.. ఎలక్ట్రిక్​ వెహికిల్స్​ని ఏ విధంగా ఛార్జ్​ చేయాలా? ఎలాంటి టిప్స్​ పాటించాలి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ఓవర్​ఛార్జింగ్​ చేయకూడదు.

How to improve EV battery life : ఓవర్​గా ఛార్జ్​ చేస్తే.. ఈవీ బ్యాటరీ లైఫ్​పై ప్రతికూల ప్రభావం పడుతుంది. కరెక్ట్​గా చెప్పాలంటే.. స్మార్ట్​ఫోన్స్​ బ్యాటరీలాగే ఇది కూడా ఉంటుంది. అందుకే.. 100శాతం ఛార్జ్​ చేయకండి. ఇంకా చెప్పాలంటే.. లిథియం- ఐయాన్​ బ్యాటరీలు 30-80శాతం రేంజ్​లో ఛార్జ్​ చేస్తే చాలు.. చాలా ఎఫెక్టివ్​గా పనిచేస్తాయి. పదేపదే 100శాతం ఛార్జ్​ చేస్తే.. బ్యాటరీపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే.. ఫుల్​ ఛార్జింగ్​ చేయకపోవడం బెటర్​. 80శాతం ఛార్జింగ్​ ఉండేట్టు చూసుకుంటే సరిపోతుంది.

0 వరకు వాడితే.. కష్టమే!

100శాతం ఛార్జింగ్​ చేయడం మంచిది కాదన్న విషయం తెలుసుకున్నాము. అయితే.. ఛార్జింగ్​ 0శాతం వచ్చేంత వరకు కూడా వాడటం శ్రేయస్కరం కాదు. 20శాతం చూపించినప్పుడే ఛార్జింగ్​ మొదలు పెట్టడం మంచిది. అక్కడి నుంచి 80శాతం వరకు ఛార్జింగ్​ చేసుకోవచ్చు. ఇలా చేస్తే.. రీజెనరేటివ్​ బ్రేకింగ్​తో వచ్చే ఎనర్జీ కూడా స్టోర్​ అవుతుంది. ఈవీ ఛార్జింగ్​ ఖర్చులు భారీగా తగ్గుతాయి.

ఇదీ చూడండి:- How to change engine coolant in car : ఇంజిన్​లో కూలెంట్​ను మార్చడం ఎలా?

సోలార్​ ఎనర్జీతో మరింత మేలు..!

దేశంలో సౌర విద్యుత్​కు ఇటీవలి కాలంలో డిమాండ్​ పెరుగుతోంది. మీ ఈవీకి కూడా ఈ టెక్నాలజీని ఇవ్వండి! ఇంట్లో చిన్నపాటి సోలార్​ ప్యానెల్​ పెట్టుకుంటే మంచిది. పైగా.. దీనికి అధికారుల నుంచి అనుమతులు కూడా అక్కర్లేదు. ఆ సోలార్​ ప్యానెల్​ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్​ను ఈవీ ఛార్జింగ్​ కోసం వాడుకుంటే.. బిల్లు చాలా తక్కువగా వస్తుంది.

రైడ్​ చేసిన వెంటనే ఛార్జ్​ చేస్తున్నారా?

Electric vehicle charging tips : మోటార్​కు ఎనర్జీ సప్లే చేస్తున్న క్రమంలో.. లిథియం- ఐయాన్​ బ్యాటరీ ఎక్కువ హీట్​ను ఉత్పత్తి చేస్తుందని మీకు తెలుసా? ఇలాంటి సందర్భాల్లో ఛార్జ్​ చేస్తే.. బ్యాటరీ లైఫ్​ దెబ్బతింటుంది. అందుకే.. రైడ్​ ముగిసిన కనీసం 30 నిమిషాలకు ఛార్జింగ్​ పెట్టకపోవడం బెటర్​.

Whats_app_banner

సంబంధిత కథనం