How to change engine coolant in car : ఇంజిన్‌లో కూలెంట్‌ను మార్చడం ఎలా?
How to change engine coolant in car : ఇంజిన్‌లో కూలెంట్ మార్చడం ఎలా? అసలు కూలెంట్ అంటే ఏంటి? ఎలా చెక్ చేయాలి?
How to change engine coolant in car : కూలెంట్ అనేది.. కారు ఇంజిన్ కూలింగ్ సిస్టెమ్కు ఉపయగపడే ఓ లిక్విడ్. యాంటీఫ్రీజ్ కెమికల్స్‌ను నీటితో కలిపితే ఈ లిక్విడ్ వస్తుంది. చలి కాలంలో.. కూలింగ్ సిస్టెమ్లోని నీరు గడ్డ కట్టకుండా ఉండేందుకు ఈ కూలెంట్ ఉపయోగపడుతుంది. బాయిలింగ్ పాయింట్‌ను కూడా పెంచుతుంది. ఇక వేసవి కాలంలో.. ఓవర్‌హీటింగ్ బారి నుంచి కూడా రక్షిస్తుంది ఈ కూలెంట్.
అంతేకాకుండా ఈ కూలెంట్.. ఇంజిన్ కూలింగ్ సిస్టెమ్ తుప్పు పట్టకుండా కూడా చూసుకుంటుంది. మార్కెట్లో ఎన్నో రకాల కూలెంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని యాంటీఫ్రీజ్ అని కూడా అంటారు. వాహనానికి మంచి కూలెంట్‌ను వినియోగించడం చాలా అవసరం.
సరైన ట్యాంక్‌లోనే కూలెంట్ పోయాలి..
How to check engine coolant in car : సరైన్ ట్యాంక్‌లోనే కూలెంట్‌ను పోస్తున్నామా, లేదా అన్నది చూడాలి. స్క్రీన్ వాష్, బ్రేక్ ఫ్లూయిడ్, పవర్ స్టీరింగ్ రిజర్వాయర్ల కోసం కూలెంట్‌ను వినియోగిస్తే.. కారు పాడైపోయే ప్రమాదం ఉంటుంది. వెహికిల్ కొన్నప్పుడు ఇచ్చిన ఓఈఎం హ్యాండ్‌బుక్‌ను పరిశీలిస్తే.. మరిన్ని వివరాలు తెలుస్తాయి.
ఇంజిన్ కూలెంట్ లేవల్..
ఎక్స్పాన్షన్ ట్యాంక్‌లో కూలెంట్ లెవల్‌ను చూడాలి. మినిమం- మ్యాగ్జిమం అనే రెండు మార్కులు కనిపిస్తాయి. వాటి మధ్యలో కూలెంట్ లెవల్ అనేది ఉండాలి. కూలెంట్ తక్కువగా ఉంటే కారు హీట్ ఎక్కిపోతుంది. డయల్‌ను మార్చినా.. డాష్‌బోర్డు వెంట్స్ నుంచి చల్లగాలి వస్తుంటే.. కూలెంట్ తగ్గినట్టు అర్థం చేసుకోవచ్చు.
Engine Cooling system in car : కూలెంట్ లెవల్ తక్కువగా కనిపిస్తే.. వెంటనే పోయాలి. ఆ సమయంలో ఇంజిన్ అనేది వేడిగా ఉండకూడదు. ఇగ్నీషన్ను ఆపేసి, పవర్ట్రైన్ సిస్టెమ్ చల్లబడేంత వరకు ఎదురుచూడాలి. ఇంజిన్ పూర్తిగా చల్లబడిన తర్వాతే ఫిల్లర్ క్యాప్‌ను తెరవాలి. లేకపోతే.. వేడి నీరు బయటకు చిమ్మే అవకాశం ఉంది. ఆ వేడి నీరు మీద పడితే చర్మం కాలిపోతుంది.
అయితే.. సరైన కూలెంట్‌ను వినియోగించడం చాలా ముఖ్యం. మేన్యుఫ్యాక్చరర్ ఏ కూలెంట్‌ను సజెస్ట్ చేస్తున్నారో తెలుసుకుని దానినే ఉపయోగించాలి. యూజర్ మేన్యువల్‌ను చూడాల్సి ఉంటుంది. మీ కారుకు ఏ కూలెంట్ సరిపోతుందో తెలుసుకోవాలి. కూలెంట్‌ను పోసే విధానాన్ని తొలుత మెకానిక్ నుంచి నేర్చుకుంటే ఇంకా మంచిది.
గొట్టాలను పరీక్షించాలి..
గొట్టాల్లో ఏదైనా సమస్య ఉందా అన్నది పరిశీలించారు. గొట్టాలు తడిగా లేదా తెల్లని మరకలోతో కనిపిస్తే.. ఏదో సమస్య ఉన్నట్టు.
ఇంజిన్ కూలెంట్‌ను మార్చడం ఎలా..
స్టెప్ 1:- సరైన ట్యాంక్‌లోనే కూలెంట్‌ను పోయాలి.
How to change coolant in Hyundai i10 : స్టెప్ 2:- ఇంజిన్ కూలెంట్ లెవల్స్‌ను పరిశీలించాలి.
స్టెప్ 3:- గొట్టాలను క్షుణ్నంగా పరిశీలించాలి.
స్టెప్ 4:- కూలెంట్ లెవల్స్ తగ్గినట్టు అనిపిస్తే.. యాడ్ చేయాలి.
స్టెప్ 5:- సరైన్ కూలెంట్‌ను మాత్రమే వినియోగించాలి.
సంబంధిత కథనం