Kia EV9 : 30 ఇంచ్​ టచ్​స్క్రీన్​, వెంటిలేటెడ్​ సీట్స్​- కియా ఈవీ9లో క్రేజీ ఫీచర్స్​!-kia ev9 to get 30 inch infotainment display ventilated seats as standard ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Kia Ev9 : 30 ఇంచ్​ టచ్​స్క్రీన్​, వెంటిలేటెడ్​ సీట్స్​- కియా ఈవీ9లో క్రేజీ ఫీచర్స్​!

Kia EV9 : 30 ఇంచ్​ టచ్​స్క్రీన్​, వెంటిలేటెడ్​ సీట్స్​- కియా ఈవీ9లో క్రేజీ ఫీచర్స్​!

Sharath Chitturi HT Telugu
Aug 27, 2023 05:30 PM IST

Kia EV9 : కియా ఈవీ9లో క్రేజీ ఫీచర్స్​ ఉంటాయని తెలుస్తోంది. 30 ఇంచ్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, వెంటిలేటెడ్​ సీట్స్​తో పాటు అనేక లేటెస్ట్​ ఫీచర్స్​ ఇందులో ఉంటాయని సమాచారం.

మచ్​ అవైటెడ్​ కియా ఈవీ9 ఫీచర్స్​ ఇవే..!
మచ్​ అవైటెడ్​ కియా ఈవీ9 ఫీచర్స్​ ఇవే..!

Kia EV9 features : 2023 మచ్​ అవైటెడ్​ ఎలక్ట్రిక్​ వెహికిల్స్​లో కియా ఈవీ9 ఒకటి. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఆటో ఎక్స్​పోలో ఈ మోడల్​ను కియా మోటర్స్​ ప్రదర్శించింది. అప్పటి నుంచి ఈ ఈవీపై దేశీయంగా, అంతర్జాతీయంగా ఆసక్తి పెరిగింది. ఇక ఇప్పుడు.. ఈ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీకి సంబంధించిన కొన్ని క్రేజీ ఫీచర్స్​ వివరాలు బయటకొచ్చాయి. అవేంటంటే..

కియా ఈవీ9లో క్రేజీ ఫీచర్స్​..!

సౌత్​ కొరియాకు చెందిన కియా మోటార్స్​.. ఈవీ9పై గట్టిగానే ఫోకస్​ చేసినట్టు కనిపిస్తోంది. ఈ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీలో ఏకంగా 30- ఇంచ్​ ఇన్ఫోటైన్​మెంట్​ డిస్​ప్లేని పెట్టినట్టు సమాచారం. దీనితో పాటు వెంటిలేటెడ్​ సీట్స్​ కూడా స్టాండర్డ్​ ఫీచర్స్​గా వస్తాయని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ ఈవీ.. 5 వేరియంట్స్​లో అందుబాటులోకి రానుంది. అవి.. లైట్​ ఆర్​డబ్ల్యూడీ, లైట్​ లాంగ్​ రేంజ్​ ఆర్​డబ్ల్యూడీ, విండ్​ ఏడబ్ల్యూడీ, ల్యాండ్​ ఏడబ్ల్యూడీ, జీటీ-లైన్​ ఏడబ్ల్యూడీ. ప్రతి వేరియంట్​లో 6 సీటర్​, 7 సీటర్​ ఆప్షన్స్​ ఉండనున్నాయి.

Kia EV9 price in India : ఈ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీకి ఎంట్రీ లెవల్​ వేరియంట్​గా లైట్​ ఆర్​డబ్ల్యూడీ ఉండనుంది. ఇందులో 76.1 కేబ్ల్యూహెచ్​ బ్యాటరీ ఉంటుందని, దీని రేంజ్​ 358 కి.మీలను సమాచారం. 8-వే అడ్జెస్టెబుల్​ హీటెడ్​/ వెంటిలేటెడ్​ ఫ్రెంట్ సీట్స్​ వస్తాయని తెలుస్తోంది. ఎల్​ఈడీ ప్రొజెక్షన్​ లైట్స్​, వయర్​లెస్​ ఫోన్​ ఛార్జింగ్​ వంటి ఫీచర్స్​ కూడా ఉంటాయి. ఇక లైట్​ లాంగ్​ రేంజ్​ ఆర్​డబ్ల్యూడీలో 99.8 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఉంటుందని తెలుస్తోంది. దీని రేజ్​ 482కి.మీలు. ఫ్రెంట్​ రోలో సన్​రూఫ్​, సెకెండ్​ రోలో కెప్టెన్​ సీట్స్​ వంటివి వస్తాయి.

ఇక కియా ఈవీ9 విండ్​ ఏడబ్ల్యూడీలో కూడా 99.8 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ఉంటుందని తెలుస్తోంది. ఎంట్రీ లెవల్​ వేరియంట్​లోని ఫీచర్స్​తో పాటు హీట్​ పంప్​, డ్యూయెల్​ సన్​రూఫ్​, హీటెడ్​ స్టీరింగ్​ వీల్​, స్పోర్టీ సిల్వర్​ రూఫ్​ రెయిల్స్​ వంటివి అదనంగా రానున్నాయి. డ్రైవర్​కు పవర్డ్​ లెగ్​-రెస్ట్​, మెరీడియన్​ సౌండ్​ సిస్టెమ్​, యాంబియెంట్​ లైటింగ్​ వంటివి కూడా ఇందులో ఉంటాయి.

Kia EV9 price : మరోవైపు కియా ఈవీ9 టాప్​ ఎండ్​ వేరియంట్​ జీటీ-లైన్​ ఏడబ్ల్యూడీ రేంజ్​ 402కి.మీలని తెలుస్తోంది. ఇందులో లోయర్​ ట్రిమ్స్​లోని ఫీచర్స్​తో పాటు 21 ఇంచ్​ వీల్స్​, యుటిలిటీ రూఫ్​ రాక్​, హెడ్స్​ అప్​ డిస్​ప్లే, కియా స్మార్ట్​ పార్కింగ్​ అసిస్ట్​ వంటివి ఉండొచ్చు.

అమెరికా మార్కెట్​లో ఈ కియా కొత్త ఈవీ.. ఈ ఏడాదిలో సేల్​కు వెళ్లనుంది. దీని ధరకు సంబంధించిన వివరాలు అందుబాటులో లేవు. క్రేజీ ఫీచర్స్​పై వస్తున్న వార్తలు నిజమే అయితే.. కచ్చితంగా ఇదొక ప్రీమియం సెగ్మెంట్​ ఎలక్ట్రిక్​ వెహికిల్​గా ఉంటుంది. ఇక ఇండియాలో ఈ మోడల్​ లాంచ్​తో పాటు ఇతర వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది.

కియా ఈవీ5ని చూశారా..?

మచ్​ అవైటెడ్​ కియా ఈవీ5 ఎలక్ట్రిక్​ కారును అఫీషియల్​గా ఆవిష్కరించింది సంస్థ. చైనాలో ఇటీవలే జరిగిన చెంగ్డూ మోటార్​ షోలో ఈ 5 సీటర్​ ఎస్​యూవీని ప్రదర్శించింది. ఈ ఈవీపై ఇప్పటి వరకు ఉన్న వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం