Tata Nexon EV vs Mahindra XUV400 : ఈ రెండు ఎలక్ట్రిక్​ వెహికిల్స్​లో ఏది బెస్ట్​?-2023 tata nexon ev vs mahindra xuv400 check detailed comparison of prices and features ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Nexon Ev Vs Mahindra Xuv400 : ఈ రెండు ఎలక్ట్రిక్​ వెహికిల్స్​లో ఏది బెస్ట్​?

Tata Nexon EV vs Mahindra XUV400 : ఈ రెండు ఎలక్ట్రిక్​ వెహికిల్స్​లో ఏది బెస్ట్​?

Sharath Chitturi HT Telugu
Sep 09, 2023 06:10 AM IST

Tata Nexon EV vs Mahindra XUV400 : 2023 టాటా నెక్సాన్​ ఈవీ వర్సెస్​ మహీంద్రా ఎక్స్​యూవీ400.. ఏది బెస్ట్​?

ఈ రెండు ఎలక్ట్రిక్​ వెహికిల్స్​లో ఏది బెస్ట్​?
ఈ రెండు ఎలక్ట్రిక్​ వెహికిల్స్​లో ఏది బెస్ట్​?

Tata Nexon EV vs Mahindra XUV400 : టాటా నెక్సాన్​ ఈవీకి ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ను తాజాగా ఆవిష్కరించింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ టాటా మోటార్స్​. ఈ 2023 టాటా నెక్సాన్​ ఈవీ.. మహీంద్రా ఎక్స్​యూవీ400తో ఇప్పటికే ఉన్న గట్టి పోటీని, మరింత రసవత్తరంగా మారుస్తుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి.. ఏది బెస్ట్​? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..

టాటా నెక్సాన్​ ఈవీ వర్సెస్​ మహీంద్రా ఎక్స్​యూవీ400- డిజైన్​..

టాటా నెక్సాన్​ ఈవీ ఫేస్​లిఫ్ట్​లో బంపర్​ మౌంటెడ్​- ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్స్​, సీక్వెన్షియల్​ లైటింగ్​తో కూడిన ఫుల్​-విడ్త్​ డీఆర్​ఎల్​, 16 ఇంచ్​ అలాయ్​ వీల్స్​, కనెక్టెడ్​ టైప్​ ఎల్​ఈడీ టెయిల్​ల్యాంప్స్​, వై షేప్​ వ్రాప్​ అరౌండ్​ మోటిఫ్స్​, స్లీక్​ రూఫ్​ రెయిల్స్​ వంటివి లభిస్తున్నాయి.

ఇక మహీంద్రా ఎక్స్​యూవీ400లో స్కల్ప్​టెడ్​ హుడ్​, క్లోజ్​డ్​ ఆఫ్​ గ్రిల్​, ట్వీన్​ పీక్స్​ లోగో, ఇంటిగ్రేటెడ్​ డిఆర్​ఎల్స్​తో కూడిన ఎల్​ఈడీ హెడ్​లైట్స్​, సిల్వర్డ్​ రూఫ్​ రెయిల్స్​, ఫ్లేర్డ్​ వీల్​ ఆర్చీస్​, వ్రాప్​ అరౌండ్​ ఎల్​ఈడీ టెయిల్​లైట్స్​ వస్తున్నాయి.

టాటా నెక్సాన్​ ఈవీ వర్సెస్​ మహీంద్రా ఎక్స్​యూవీ400- ఫీచర్స్​..

2023 Tata Nexon EV price : టాటా బెస్ట్​ సెల్లింగ్​ ఎలక్ట్రిక్​ వెహికిల్​ కేబిన్​లో మినిమలిస్ట్​ డ్యూయెల్​ టోన్​ డాష్​బోర్డ్​, టచ్​ ఆధారిత బాక్​లిట్​ స్విచ్​లు, వయర్​లెస్​ ఛార్జర్​, ఎలక్ట్రిక్​ సన్​రూఫ్​, 6 ఎయిర్​బ్యాగ్స్​, 10.25 ఇంచ్​ ఫుల్లీ డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, 12.3 ఇంచ్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​ వంటివి లభిస్తున్నాయి.

ఎక్స్​యూవీ400లో మినిమలిస్ట్​ డాష్​బోర్డ్​ డిజైన్​, ప్రీమియం అప్​హోలిస్ట్రీ, యాంబియెంట్​ లైటింగ్​, ఎలక్ట్రిక్​ సన్​రూఫ్​, ఆటోమెటిక్​ క్లైమేట్​ కంట్రోల్​, సెమీ-డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, 7.0 ఇంచ్​ ఇన్ఫోటైన్​మెంట్​ ప్యానెల్​, 6 ఎయిర్​బ్యాగ్స్​ వంటివి వస్తున్నాయి.

ఇదీ చూడండి:- Tata Nexon EV facelift : సరికొత్తగా టాటా నెక్సాన్​ ఈవీ- ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​లో భారీ మార్పులు..

Mahindra XUV400 on road price Hyderabad : ఇక టాటా నెక్సాన్​ ఈవీలో పీఎంఎస్​ ఎలక్ట్రిక్​ మోటార్​ ఉంటుంది. 30కేడబ్ల్యూహెచ్​, 40.5కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఆప్షన్స్​ వస్తున్నాయి. వీటి రేంజ్​ 325కి.మీ, 465కిమీలు.

మహీంద్రా ఎక్స్​యూవీ400లో ఉన్న ఎలక్ట్రిక్​ మోటార్​కు 39.4కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ కనెక్ట్​ అయ్యి ఉంటుంది. దీని రేంజ్​ 456కి.మీలు.

ఈ ఈవీల ధరలు ఇవే..

Tata Nexon EV facelift price : టాటా నెక్సాన్​ ఈవీ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ ధరకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. సెప్టెంబర్​ 14న లాంచ్​తో క్లారిటీ వస్తుంది. అయితే.. ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 15లక్షలుగా ఉండొచ్చని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

Mahindra XUV400 features : ఇండియాలో మహీంద్రా ఎక్స్​యూవీ400 ఎక్స్​షోరూం ధర రూ. 16లక్షలు- రూ. 19.2లక్షల మధ్యలో ఉంటుంది.

Whats_app_banner

సంబంధిత కథనం