Tata Nexon EV facelift : సరికొత్తగా టాటా నెక్సాన్​ ఈవీ- ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​లో భారీ మార్పులు..-2023 tata nexon ev breaks cover gets all new design interior tech upgrades ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Nexon Ev Facelift : సరికొత్తగా టాటా నెక్సాన్​ ఈవీ- ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​లో భారీ మార్పులు..

Tata Nexon EV facelift : సరికొత్తగా టాటా నెక్సాన్​ ఈవీ- ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​లో భారీ మార్పులు..

Sharath Chitturi HT Telugu
Sep 08, 2023 06:14 AM IST

Tata Nexon EV facelift : టాటా నెక్సాన్​ ఈవీ ఫేస్​లిఫ్ట్​ను టాటా మోటార్స్​ ఆవిష్కరించింది. డిజైన్​తో పాటు ఈ మోడల్​లో భారీ మార్పులో జరిగాయి!

సరికొత్తగా టాటా నెక్సాన్​ ఈవీ.. ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​లో భారీ మార్పులు..
సరికొత్తగా టాటా నెక్సాన్​ ఈవీ.. ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​లో భారీ మార్పులు..

Tata Nexon EV facelift : ఇండియాలోనే ది బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా ఉన్న నెక్సాన్​ ఈవీకి ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ను తాజాగా ఆవిష్కరించింది టాటా మోటార్స్​. ఈ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​లో ఈ ఎలక్ట్రిక్​ వెహికిల్​ సరికొత్త డిజైన్​తో కనిపిస్తోంది. ఇంటీరియర్​లోనూ భారీ మార్పులే జరిగాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

సరికొత్తగా టాటా నెక్సాన్​ ఈవీ..

2023 టాటా నెక్సాన్​ ఈవీలో ఎక్స్​టీరియర్​ డిజైన్​ మరింత ఆకర్షణీయంగా మారింది. ఫ్రెంట్​లో స్ల్పిట్​ ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్స్​, ఇంటిగ్రేటెడ్​ డీఆర్​ఎల్స్​, సీక్వెన్షియల్​ టర్న్​ ఇండికేటర్స్​ వంటివి కొత్త డిజైన్​తో వస్తున్నాయి. బంపర్స్​కు ఇప్పుడు వర్టికల్​ స్ట్రౌట్స్​ వస్తున్నాయి. హెడ్​ల్యాంప్స్​ ఇప్పుడు ఇల్యుమినేటెడ్​ స్ట్రిప్​తో కనెక్ట్​ అయ్యి ఉన్నాయి. ఇక 16 ఇంచ్​ అలాయ్​ వీల్స్​కి కూడా కొత్త డిజైన్​ లభించింది. రేర్​లో మాత్రం పెద్దగా మార్పులు జరగలేదు. 'నెక్సాన్​.ఈవీ' బ్యాడ్జ్​ మాత్రమే డిఫరెంట్​గా ఉంది.

ఈ మోడల్​లో ఫీచర్స్​ ఇవే..

2023 Tata Nexon EV : టాటా నెక్సాన్​ ఈవీ ఫేస్​లిఫ్ట్​లో 12.3 ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, 10.25 ఇంచ్​ ఫుల్లీ డిజిటల్​ ఉన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, ఎలక్ట్రిక్​ సన్​రూఫ్​, టచ్​ ఆధారిత ఎయిర్​కాన్​ ప్యానెల్​ వంటివి వస్తున్నాయి. సెంటర్​ కన్సోల్​ని కూడా రీడిజైన్​ చేశారు. ఇందులో డ్రైవర్​ మోడ్​ సెలక్టర్​, వయర్​లెస్​ ఛార్జింగ్​ పాడ్​ వంటివి లభిస్తున్నాయి.

ఇక ఈ 5 సీటర్​ ఎస్​యూవీ కేబిన్​లో 6 ఎయిర్​బ్యాగ్స్​, హిల్​-డిసెంట్​ కంట్రోల్​, 360డిగ్రీ వ్యూ కెమెరా, ఈఎస్​పీ వంటివి స్టాండర్డ్​గా వస్తున్నాయి.

టాటా నెక్సాన్​ ఈవీ ఫేస్​లిఫ్ట్​లో పీఎంఎస్​ ఎలక్ట్రిక్​ మోటార్​ ఉంటుంది. 30కేడబ్ల్యూహెచ్​- 40.5కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ వంటి ఆప్షన్స్​ ఉన్నాయి. వీటి రేంజ్​ వరుసగా 325కి.మీ, 465కి.మీ అని సంస్థ చెబుతోంది.

బుకింగ్స్​ ఎప్పుడు?

Tata Nexon EV Facelift bookings : ఇండియాలో 2023 టాటా నెక్సాన్​ ఈవీకి సంబంధించిన బుకింగ్స్​ సెప్టెంబర్​ 9న ఓపెన్​ అవుతాయి. వరల్డ్​ ఈవీ డే సందర్భంగా 9వ తేదీ ఉదయం 8 గంటల నుంచి బుకింగ్స్​ ప్రారంభించనున్నట్టు సంస్థ వెల్లడించింది. రూ. 21వేల టోకెన్​ అమౌంట్​తో సంస్థకు చెందిన డీలర్​షిప్​ షోరూమ్స్​లో ఈ మోడల్​ను బుక్​ చేసుకోవచ్చు. దీని ధరకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. అయితే ప్రస్తుతం ఉన్న వర్షెన్​ కన్నా ధర కాస్త ఎక్కువే ఉండొచ్చని తెలుస్తోంది.

టాటా నెక్సాన్​ కూడా..

టాటా నెక్సాన్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ను అధికారికంగా ఆవిష్కరించింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ టాటా మోటార్స్​. సెప్టెంబర్​ 14న ఈ మోడల్​ లాంచ్​కానుంది. ఈ మోడల్​లో వస్తుకున్న 10 కొత్త ఫీచర్స్​కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

సంబంధిత కథనం