Hyundai i20 facelift : ఇదిగో హ్యుందాయ్ ఐ20 ఫేస్‌లిఫ్ట్..
Hyundai i20 facelift : హ్యుందాయ్ ఐ20 ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ లాంచ్‌కు సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన టీజర్‌ను సంస్థ తాజాగా విడుదల చేసింది.
Hyundai i20 facelift : హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో హ్యుందాయ్ మోటార్స్‌కు బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉంది ఐ20. ఈ హ్యుందాయ్ ఐ20కి ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ రాబోతోందని గత కొన్ని నెలలుగా వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు.. ఈ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్కు సంబంధించిన టీజర్‌ను రివీల్ చేసింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ. ఈ 2023 హ్యుందాయ్ ఐ20 మోడల్.. ఈ ఏడాదిలోనే లాంచ్ అవుతుందని తెలుస్తోంది.
కొత్త వర్షెన్ ఎలా ఉండనుంది..?
2023 హ్యుందాయ్ ఐ20 డిజైన్‌లో అనేక మార్పులు కనిపించొచ్చని తెలుస్తోంది. టెస్టింగ్ దశలో ఉన్న మోడల్‌కు సంబంధించిన ఫొటోలు ఇప్పటికే ఆన్లైన్లో లీక్ అయ్యాయి. స్పై షాట్స్ ప్రకారం.. ఈ హ్యాచ్‌బ్యాక్ మోడల్ ఫ్రెంట్ ఫేస్‌లో గ్రిల్, ఎల్ఈడీ హెడ్‌లైట్ యూనిట్స్ కొత్తగా ఉండనున్నాయి. కాకపోతే.. ఈ కారు సైడ్, రేర్ ప్రొఫైల్‌లో పెద్దగా మార్పులు కనిపించడం లేదు. టైయిల్లైట్ డిజైన్ ఒక్కటే మారుతుందని తెలుస్తోంది. అలాయ్ వీల్స్ కూడా స్వల్పంగా మారొచ్చు.
2023 Hyundai i20 : ఇక హ్యుందాయ్ ఐ20 ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్‌లో అదనపు ఫీచర్స్ కనిపిస్తాయి. డ్యాష్‌కామ్ ఆప్షన్ అందుబాటులోకి రావొచ్చు. ఇదే నిజమైతే.. హ్యాచ్‌బ్యాక్ మోడల్లో డ్యాష్‌క్యామ్ ఆప్షన్ లభిస్తున్న తొలి కారుగా ఐ20 నిలుస్తుంది. హ్యుందాయ్ ఎక్స్టర్లో వాడిన డ్యాష్‌క్యామ్ ఇందులోనూ ఉంటుందని సమాచారం.
ఇదీ చూడండి:- Tata Nexon facelift : టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ వచ్చేస్తోంది.. లాంచ్ డేట్ ఫిక్స్
వీటితో పాటు 2023 హ్యుందాయ్ ఐ20లో ఎలక్ట్రికల్లీ అడ్జెస్టెబుల్ సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా, ఫ్రెంట్ పార్కింగ్ సెన్సార్, భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్లు వస్తాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న వర్షెన్‌లో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్, వయర్లెస్ ఛార్జర్, యాంబియెంట్ లైటింగ్ వంటివి ఉన్నాయి.
Hyundai i20 facelift launch : అయితే ఇంజిన్ పరంగా మార్పులు కనిపించవు! ఈ హ్యుందాయ్ ఐ20 ఫేస్‌లిఫ్ట్‌లో 1.2 లీటర్ పెట్రోల్/ 1.0 లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ యూనిట్లు ఉంటాయి. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్.. 82 బీహెచ్పీ పవర్‌ను, 114.7 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇక మరో ఇంజిన్.. 118 హెచ్‌పీ పవర్‌ను, 172 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
మార్కెట్లో ప్రస్తుతం హ్యుందాయ్ ఐ20 హ్యాచ్‌బ్యాక్ ఎక్స్‌షోరూం ధర రూ. 7.46లక్షలు- రూ. 11.88లక్షల మధ్యలో ఉంది. కొత్త వర్షెన్ ధర ఇంకాస్త ఎక్కువే ఉండొచ్చు అని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
అయితే.. ఈ మోడల్ లాంచ్ డేట్‌పై ఇంకా సంస్థ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
సంబంధిత కథనం