తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Kinetic Green Zulu Vs Ola S1x+ : ఈ రెండు ఎలక్ట్రిక్​ స్కూటర్స్​లో ఏది బెస్ట్​?

Kinetic Green Zulu vs Ola S1X+ : ఈ రెండు ఎలక్ట్రిక్​ స్కూటర్స్​లో ఏది బెస్ట్​?

Sharath Chitturi HT Telugu

12 December 2023, 13:17 IST

    • Kinetic Green Zulu vs Ola S1X+:  కైనెటిక్​ గ్రీన్​ జులు వర్సెస్​ ఓలా ఎస్​1ఎక్స్​+.. ఈ రెండు ఎలక్ట్రిక్​ స్కూటర్స్​లో ఏది బెస్ట్​? ఇక్కడ తెలుసుకుందాము..
ఈ రెండు ఎలక్ట్రిక్​ స్కూటర్స్​లో ఏది బెస్ట్​?
ఈ రెండు ఎలక్ట్రిక్​ స్కూటర్స్​లో ఏది బెస్ట్​?

ఈ రెండు ఎలక్ట్రిక్​ స్కూటర్స్​లో ఏది బెస్ట్​?

Kinetic Green Zulu vs Ola S1X+ : దేశ 2 వీలర్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ సెగ్మెంట్​లో పోటీ మరింత పెరిగింది! కైనెటిక్​ గ్రీన్​ జులు ఈ-స్కూటర్​ని సంస్థ తాజాగా లాంచ్​ చేయడం ఇందుకు కారణం. ఈ మోడల్​.. ఓలా ఎలక్ట్రిక్​కి చెందిన ఓలా ఎస్​1ఎక్స్​+ కి గట్టిపోటనిస్తుందని మార్కెట్​లో అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ రెండింటినీ పోల్చి, ఏది కొంటే బెటర్​? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..

కైనెటిక్​ గ్రీన్​ జులు వర్సెస్​ ఓలా ఎస్​1ఎక్స్​+ - స్పెసిఫికేషన్స్​..

కైనెటిక్​ గ్రీన్​ జులు ఎలక్ట్రిక్​ స్కూటర్​లో 2.27 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఉంటుంది. ఈ స్కూటర్​లోని ఎలక్ట్రిక్​ ప్రొపల్షన్​ సిస్టెమ్​.. 2.8 బీహెచ్​పీ పవర్​ని జనరేట్​ చేస్తుంది. ఈ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. 104 కి.మీల దూరం ప్రయాణిస్తుందని సంస్థ చెబుతోంది. 80శాతం ఛార్జింగ్​ని 30 నిమిషాల్లో పూర్తి చేయవచ్చట! ఈ స్కూటర్​ టాప్​ స్పీడ్​ 60 కేఎంపీహెచ్​.

Kinetic Green Zulu price : ఇక ఓలా ఎస్​1ఎక్స్​+ లో 3 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. 151 కి.మీల దూరం వరకు ప్రయాణించవచ్చు. ఈ-స్కూటర్​ టాప్​ స్పీడ్​ 90 కేఎంపీహెచ్​. 0-40 కేఎంపీహెచ్​ని కేవలం 3.3 సెకన్లలో అందుకుంటుంది.

కైనెటిక్​ గ్రీన్​ జులు వర్సెస్​ ఓలా ఎస్​1ఎక్స్​+ - ధరలు..

కైనెటిక్​ గ్రీన్​ జులు ఎక్స్​షోరూం ధర రూ. 94,990గా ఉంది. రూ. 69వేల వద్ద ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ సబ్​స్క్రిప్షన్​ మొదలవుతుంది. ఇక ఓలా ఎస్​1ఎక్స్​+ ఈ-స్కూటర్​ ఎక్స్​షోరూం ధర రూ. 89,999గా ఉంది. ఛార్జర్​తో పాటు కొంటే.. ధర రూ. 1,06,779 వరకు వెళుతుంది.

ఇండియాలో కైనెటిక్​ బ్రాండ్​ చాలా ఫేమస్​. హోండాతో కలిసి.. కైనెటిక్​ హోండ్​ స్కూటర్​ను లాంచ్​ చేసింది. అప్పట్లో ఈ మోడల్​కి మంచి క్రేజ్​ ఉండేది.

Ola S1X+ price in Hyderabad : ఇక ఇప్పుడు.. జులు పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ని భారతీయుల ముందుకు తీసుకొచ్చింది సంస్థ. అయితే.. ఇప్పటికే 2 వీలర్​ ఎలక్ట్రిక్​ సెగ్మెంట్​లో బీభత్సమైన పోటీ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్​ లాంటి దిగ్గజ సంస్థలతో పోటీ అంత ఈజీగా ఉండకపోవచ్చని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

తదుపరి వ్యాసం