2023 Tata Safari vs XUV700 : సఫారీ వర్సెస్ ఎక్స్‌యూవీ700.. ఈ ఎస్‌యూవీల్లో ఏది బెస్ట్?
16 October 2023, 12:04 IST
- 2023 Tata Safari vs XUV700 : టాటా సఫారీ ఫేస్‌లిఫ్ట్ వర్సెస్ మహీంద్రా ఎక్స్‌యూవీ 700! ఏది బెస్ట్? ఇక్కడ తెలుసుకోండి..
సఫారీ వర్సెస్ ఎక్స్‌యూవీ700..
2023 Tata Safari vs Mahindra XUV700 : టాటా మోటార్స్‌కు హారియర్, సఫారీ ఎస్‌యూవీలు బెస్ట్ సెల్లింగ్ మోడల్స్‌గా ఉన్నాయి. అక్టోబర్ 17న.. ఈ రెండింటి ఫేస్‌లిఫ్ట్ వర్షెన్లను సంస్థ లాంచ్ చేయనుంది. మరీ ముఖ్యంగా 2023 టాటా సఫారీపై కస్టమర్లలో ఆసక్తి నెలకొంది. ఇక ఈ మోడల్.. మహీంద్రా ఎక్స్‌యూవీ700కు గట్టిపోటీనిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి.. ఏది బెస్ట్? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
ఈ రెండు ఎస్‌యూవీల స్పెసిఫికేషన్స్ ఇవే..
మహీంద్రా ఎక్స్‌యూవీ700లో భారీ బానెట్, క్రోమ్ స్లేటెడ్ గ్రిల్, ట్విన్ పీక్ లోగో, రూఫ్ రెయిల్స్, అడాప్టివ్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, సీ షేప్ డీఆర్ఎల్స్, ఫ్లష్ ఫిట్టెడ్ డోర్ హ్యాండిల్స్, 18 ఇంచ్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్, వ్రాప్ అరౌండ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్స్ వస్తున్నాయి.
Tata Safari facelift 2023 : టాటా సఫారీ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌లో పారామెట్రిక్ డిజైన్‌తో కూడిన భారీ గ్రిల్, ప్రొడెక్టర్ బై-ఎల్ఈడీ హెడ్‌లైట్స్, ఫుల్-విడ్త్ డీఆర్ఎల్, సీక్వెన్షియల్ ఇండికేటర్స్, 19 ఇంచ్ డ్యూయెల్ టోన్ అలాయ్ వీల్స్, కనెక్టెడ్ టైప్ ఎల్ఈడీ టెయిల్‌లైట్స్ లభిస్తున్నాయి.
ఈ రెండు ఎస్‌యూవీల ఫీచర్స్..
మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీలో భారీ టచ్‌స్క్రీన్, పానారోమిక్ సన్‌రూఫ్, యాంబియెంట్ లైటింగ్, ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్, మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్, 12-స్పీకర్ సోనీ సౌండ్ సిస్టెమ్లు ఉంటాయి.
Mahindra XUV700 on road price Hyderabad : ఇక 2023 టాటా సఫారీ ఫేస్‌లిఫ్ట్ స్పేషియల్ 5/7 సీటర్ కేబిన్‌లో ప్రీమియం 2 టోన్ డ్యాష్‌బోర్డ్, మల్టీ కలర్ మూడ్ లైటింగ్, డ్యూయెల్ టోన్ 4 స్పోక్ స్టీరింగ్ వీల్, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, భారీ టచ్స్క్రీన్లు వస్తున్నాయి.
ఈ రెండు ఎస్‌యూవీల్లోనూ 7 ఎయిర్‌బ్యాగ్స్ మ్యాండేటరీగా ఉంటాయి.
ఈ రెండు ఎస్‌యూవీల ఇంజిన్ వివరాలు..
మహీంద్రా ఎక్స్‌యూవీ700లో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 197 హెచ్‌పీ పవర్‌ను, 380 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇక 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్.. 153 హెచ్‌పీ పవర్‌ను, 360 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ మేన్యువల్, 6 స్పీడ్ ఆటోమెటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ ఉన్నాయి.
2023 Tata Safari on road price Hyderabad : మరోవైపు 2023 టాటా సఫారీ ఎస్‌యూవీలో 2.0 లీటర్ క్రియోటెక్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 168 హెచ్‌పీ పవర్‌ను, 350 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ మేన్యువల్, 6 స్పీడ్ ఆటోమెటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ వస్తున్నాయి.
ఈ రెండు వాహనాల ధరలు ఇవే..
ఎక్స్‌యూవీ700 ఎక్స్‌షోరూం ధర రూ. 14.03లక్షలు- రూ. 26.57లక్షల మధ్యలో ఉంటుంది. టాటా సఫారీ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ ధరపై ప్రస్తుతం క్లారిటీ లేదు. కాగా.. ఈ మోడల్ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 16లక్షలకు అటు, ఇటుగా ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.