Tata Punch vs Nissan Magnite : ఆటోమెటిక్ కారు కొనాలా? ఈ ఎస్‌యూవీల్లో బెస్ట్ ఏదంటే..!
14 October 2023, 7:20 IST
- Tata Punch vs Nissan Magnite : టాటా పంచ్ వర్సెస్ నిస్సాన్ మాగ్నైట్.. ఈ రెండు ఎస్‌యూవీల్లోని ఏఎంటీ మోడల్స్‌లో ఏది బెస్ట్? ఇక్కడ తెలుసుకుందాము..
ఈ ఎస్‌యూవీల్లో బెస్ట్ ఏదంటే..!
Tata Punch vs Nissan Magnite : నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో.. వాహనదారులు మేన్యువల్ కార్లు కాకండా.. ఆటోమెటిక్ మోడల్స్‌పై ఫోకస్ పెంచుతున్నారు. వీరిలో మీరూ ఉన్నారా? టాటా పంచ్ ఏఎంటీ, నిస్సాన్ మాగ్నైట్ ఏఎంటీల్లో ఏది తీసుకోవాలో అర్థం కావడం లేదా? అయితే ఇది మీకోసమే. ఈ రెండు ఎస్‌యూవీల్లో ఏది బెస్ట్? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
టాటా పంచ్ ఏఎంటీ వర్సెస్ నిస్సాన్ మాగ్నైట్ ఏఎంటీ..
టాటా పంచ్‌లో స్పోర్టీ బంపర్ మౌంటెడ్ ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్, క్లామ్‌షెల్ బానెట్, స్లీక్ బ్లాక్డ్ ఔట్ గ్రిల్, రూఫ్ రెయిల్స్, వైడ్ ఎయిర్ డ్యామ్, వ్రాప్ అరౌండ్ టెయిల్‌లైట్స్, 15 ఇంచ్ డైమెండ్ కట్ అలాయ్ వీల్స్ లభిస్తున్నాయి.
Nissan Magnite on road price Hyderabad : నిస్సాన్ మాగ్నైట్‌లో క్రోమ్ సరౌండర్స్తో కూడిన హెక్సాగొనల్ గ్రిల్, సిల్వర్ స్కిడ్ ప్లేట్, స్వెప్ట్ బ్యాక్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, బంపర్ మౌంటెడ్ ఎల్ షేప్ డీఆర్ఎల్స్, బ్లాక్డ్ ఔట్ పిల్లర్స్, ఇండికేటర్ మౌంటెడ్ ఓఆర్వీఎంలు, 16 ఇంచ్ డిజైనర్ అలాయ్ వీల్స్ వస్తున్నాయి.
ఈ రెండు ఎస్‌యూవీల ఫీచర్స్ ఇవే..
టాటా పంచ్ ఎస్‌యూవీలోని 5 సీటర్ స్పేషియస్ కేబిన్ల ఇంజిన్ స్టార్ట్/ స్టాప్ బటన్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్, మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్, 7 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ ప్యానెల్, ఐఆర్ఏ కనెక్టెడ్ కార్ టెక్నాలజీలు లభిస్తున్నాయి.
మరోవైపు.. నిస్సాన్ మాగ్నైట్ స్పేషియల్ 5 సీటర్ కేబిన్‌లో కీలెస్ ఎంట్రీ, స్టార్ట్ ఫంక్షన్, ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్, ప్రీమియం అప్‌హోలిస్ట్రీ, 8.0 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, జీబేఎల్ ఆధారిత సౌండ్ సిస్టెమ్ వంటివి వస్తున్నాయి.
ఈ రెండు ఎస్‌యూవీల ఇంజిన్ వివరాలు..
Tata Punch on road price in Hyderabad : టాటా పంచ్‌లో 1.2 లీటర్ రివట్రాన్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 87 హెచ్‌పీ పవర్‌ను, 115 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 5 స్పీడ్ ఆటోమెటిక్ గేర్‌బాక్స్ దీని సొంతం.
ఇక నిస్సాన్ మాగ్నైట్‌లో 1.0 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది.. 71 హెచ్‌పీ పవర్‌ను, 96 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇందులోనూ 5 స్పీడ్ ఆటోమెటిక్ గేర్‌బాక్స్ ఉంటుంది.
ఈ రెండు వాహనాల ధరలు ఇవే..
Tata Punch price Hyderabad : నిస్సాన్ మాగ్నైట్ ఏఎంటీ ఎక్స్‌షోరూం ధర రూ. 6.5లక్షలు- రూ. 8.9లక్షల మధ్యలో ఉంటుంది. ఇక టటా పంచ్ ఏఎంటీ ఎక్స్‌షోరూం ధర రూ. 7.5లక్షలు- రూ. 10.09లక్షలుగా ఉంది.