2023 Tata Harrier vs MG Hector : ఈ రెండు ఎస్‌యూవీల కొత్త వర్షెన్స్లో ఏది బెస్ట్?
08 October 2023, 18:20 IST
- 2023 Tata Harrier vs MG Hector : 2023 టాటా హారియర్ వర్సెస్ ఎంజీ హెక్టార్.. ఈ రెండు ఎస్‌యూవీల్లో ఏది బెస్ట్? ఇక్కడ తెలుసుకుందాము..
ఈ రెండు ఎస్‌యూవీల కొత్త వర్షెన్స్లో ఏది బెస్ట్?
2023 Tata Harrier vs MG Hector : 2023 టాటా హారియర్ మోడల్‌ను ఇటీవలే ఆవిష్కరించింది టాటా మోటార్స్ సంస్థ. ఇది.. ఎంజీ హెక్టార్ అప్డేటెడ్ వర్షెన్కు గట్టిపోటీనిస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి, ఏది బెస్ట్? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
ఈ రెండు ఎస్‌యూవీల ఫీచర్స్ ఇవే..
2023 టాటా హారియర్‌లో క్లాంప్షెల్ హుడ్, ప్రాజెక్టర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, కనెక్టెడ్ టైప్ ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్స్, ఫుల్ విడ్త్ డీఆర్ఎల్స్, సీక్వెన్షియల్ ఇండికేటర్స్, బ్లాక్డ్-ఔట్ 18 ఇంచ్ వీల్స్ విత్ ఎయిరో ఇన్సర్ట్స్, రగ్డ్ లుకింగ్ బ్లాక్ కలర్డ్ క్లాడింగ్ వంటివి వస్తున్నాయి.
2023 ఎంజీ హెక్టార్లో భారీ క్రోమ్ స్టడెడ్ గ్రిల్ ఉంటుంది. బంపర్ మౌంటెడ్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, స్ప్లిట్ టైప్ డీఆర్ఎల్లు, కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్స్, రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్, 18 ఇంచ్ డ్యూయెల్ టోన్ అలాయ్ వీల్స్ వంటివి ఉన్నాయి.
2023 Tata Harrier price Hyderabad : టాటా హారియర్ అప్డేటెడ్ వర్షెన్‌లో వాయిస్ అసిస్టెడ్ పానారోమిక్ సన్‌రూఫ్, రూఫ్‌పై మూడ్ లైటింగ్ ఎలిమెంట్స్, డ్యూయెల్ టోన్ డాష్‌బోర్డ్, 2 స్పోక్ స్టీరింగ్ వీల్, ఇల్యుమినేటెడ్ లోగో, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటివి లభిస్తున్నాయి.
ఇక ఎంజీ హెక్టార్ అప్డేటెడ్ వర్షెన్‌లో ఆల్-బ్లాక్ డాష్‌బోర్డ్, వెంటిలేటెడ్ ఫ్రెంట్ సీట్స్, మల్టీ-కలర్ యాంబియెంట్ లైటింగ్, పానారోమిక్ సన్‌రూఫ్, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, వర్టికల్ 14.0 ఇంచ్ హెచ్డీ ఇన్ఫోటైన్మెంట్ ప్యానెల్ వంటివి ఉన్నాయి.
ఈ రెండు ఎస్‌యూవీల ధరల వివరాలు..
2023 Tata Harrier launch date : 2023 టాటా హారియర్‌లో 2.0 లీటర్, క్రియోటెక్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 168 హెచ్‌పీ పవర్, 350 ఎన్ఎం టార్క్ ఉంటుంది. 6 స్పీడ్ మేన్యువల్, 6 స్పీడ్ ఆటోమెటిక్ గేర్‌బాక్స్ దీని సొంతం.
ఇక కొత్త టాటా హారియర్ ఎస్‌యూవీలో 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది.ఇది 168 హెచ్‌పీ పవర్‌ను, 350 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ కూడా ఉంది. ఇది 141 హెచ్‌పీ పవర్‌ను, 250ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇక 1.5 లీటర్ పెట్రోల్- హైబ్రీడ్ ఇంజిన్.. 141 హెచ్‌పీ పవర్‌ను, 250 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
2023 MG Hector price : ఇక ఎంజీ హెక్టార్ ఎక్స్‌షోరూం ధర రూ. 14.73లక్షలు- రూ. 21.73లక్షలుగా ఉంది. టాటా హారియర్ ధర ఇంకా ప్రకటించలేదు. అది రూ. 15లక్షలుగా ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.