Diesel in Petrol Car: పెట్రోల్​ ఇంజిన్​ ఉన్న కారులో డీజిల్​ పోస్తే ఏమవుతుంది?-what happens if you put diesel in a petrol engine car see details inside ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  What Happens If You Put Diesel In A Petrol Engine Car See Details Inside

Diesel in Petrol Car: పెట్రోల్​ ఇంజిన్​ ఉన్న కారులో డీజిల్​ పోస్తే ఏమవుతుంది?

Sharath Chitturi HT Telugu
May 28, 2023 06:15 AM IST

Diesel in Petrol Car: పెట్రోల్​ కారులో డీజిల్​ పోస్తే ఏమవుతుంది? అని మీకు ఎప్పుడైనా సందేహం కలిగిందా? అయితే సమాధానం ఇదే..!

పెట్రోల్​ ఇంజిన్​ ఉన్న కారులో డీజిల్​ పోస్తే ఏమవుతుంది?
పెట్రోల్​ ఇంజిన్​ ఉన్న కారులో డీజిల్​ పోస్తే ఏమవుతుంది?

Diesel in Petrol Car: మీరు పెట్రోల్​ ఇంజిన్​ కారును వాడుతున్నారా? అందులో డీజిల్​ పోస్తే ఏమవుతుంది? అని ఎప్పుడైనా ఆలోచించారా? అయితే దానికి సమాధానం ఇక్కడ తెలుసుకోండి..

ఫ్యూయెల్​ కంబషన్​ ప్రక్రియ ఏంటి?

పెట్రోల్​ ఇంజిన్​ వాహనాల్లో డీజిల్​ పోస్తే ఏమవుతుంది? అని తెలుసుకునే ముందు.. అసలు వాటి పనితీరు గురించి తెలుసుకోవడం ముఖ్యం. సాధారణంగా ఐసీఈ (ఇంటర్నల్​ కంబషన్​ ఇంజిన్స్​)లో పెట్రోల్​ లేదా డీజిల్​ని వినియోగిస్తారు. వీటి ప్రభావం ఒకే విధంగా ఉన్నప్పటికీ, వీటి కంబషన్​ (కాలే ప్రక్రియ) ప్రక్రియలు మాత్రం చాలా భిన్నంగా ఉంటాయి. అందుకే ఇంధనం మారకూడదు.

పవర్​ను జనరేట్​ చేసేందుకు పెట్రోల్​ ఇంజిన్​ సిలిండర్స్​లో 4 స్ట్రోక్​ సైకిల్​ ప్రక్రియ జరుగుతుంది. ఇంజిన్​లోని ఇంటేక్​ మేనిఫోల్డ్​లో లేదా కంబషన్​ ఛాంబర్​లోకి ఫ్యూయెల్​ ఇంజెక్ట్​ చేస్తారు. అక్కడ అది గాలితో కలవడంతో కంబషన్​ ప్రక్రియ జరుగుతుంది. ఆ మిశ్రమం చివరికి స్పార్క్​ ప్లగ్​తో ఇగ్నైట్​ అవుతుంది. అలా జనరేట్​ అయిన పవర్​తో క్రాంక్​షాఫ్ట్​ తిరుగుతుంది.

పెట్రోల్​- డీజిల్​కు ఉన్న తేడా ఏంటి?

పెట్రోల్​, డీజిల్​లలో రసాయనాల కూర్పు, ఇగ్నీషన్​ ప్రక్రియ, కంబషన్​ లక్షణాలు, డెన్సిటీలు వేరువేరుగా ఉంటాయి. పెట్రోల్​లో పవర్​ను జనరేట్​ చేయడం కోసం స్పార్క్​ ప్లగ్​ను వాడతారు. డీజిల్​లో కంప్రెషన్​ ఇగ్నీషన్​ వాడతారు. దీని ఎనర్జీ ఔట్​పుట్​ ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా ఎనర్జీ డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది.

ఇదీ చూడండి:- How to minimize fuel bills : ఇంధన ఖర్చులు తగ్గించుకోవాలంటే.. ఇవి ట్రై చేయండి!

పెట్రోల్​ కారులో డీజిల్​ పోస్తే..

పెట్రోల్​ కారులో డీజిల్​ కలవడం సాధారణంగా జరగదు. కొన్నిసార్లు పొరపాటుగా అలా జరిగితే.. ఫ్యూయెల్​ ఫిల్టర్​ మూసుకుపోతుంది. డీజిల్​కు ఉన్న థిక్​నెస్​ (మందం), గ్రీజీ ప్రాపర్టీని తట్టుకునే సామర్థ్యం పెట్రోల్​ ఇంజిన్​లకు ఉండకపోవడం ఇందుకు కారణం. ఇగ్నీషన్​ పాయింట్​ చాలా రెట్లు అధికంగా ఉండటంతో ఫ్యూయెల్​కు కంబషన్​ ప్రక్రియ జరగదు. ఫలితంగా అది ఇంజిన్​ సిలిండర్​లోనే ఉండిపోతుంది.

పెట్రోల్​ కారులో డీజిల్​ కలిస్తే ఏం చేయాలి?

Petrol car diesel car difference: ఫ్యూయెల్​ ట్యాంక్​ కెపాసిటీలో 5శాతం వరకు డీజిల్​ కలిస్తే పర్లేదు! మిగిలిన ట్యాంక్​ను పెట్రోల్​తో నింపుకోవచ్చు. డీజిల్​ పెట్రోల్​లో కలిసిపోతుంది. కానీ మీరు వెంటనే సమీప సర్వీస్​ సెంటర్​కు వెళ్లాల్సి ఉంటుంది.

అయితే.. ఫ్యూయెల్​ ట్యాంక్​లో 5శాతం కన్నా ఎక్కువ డీజిల్​ కలిస్తే మాత్రం కారును ఆపేయాల్సి ఉంటుంది. కారును స్టార్ట్​ చేయకపోవడం ఉత్తమం. వెంటనే టోయింగ్​ సర్వీస్​ లేదా రోడ్​సైడ్​ అసిస్టెన్స్​ సర్వీస్​కు ఫోన్​ చేయాల్సి ఉంటుంది. వారు మీ కారును సర్వీస్​ సెంటర్​కు తీసుకెళతారు.

WhatsApp channel

సంబంధిత కథనం