Diesel Four-wheelers: అప్పటికల్లా ప్రధాన నగరాల్లో డీజిల్ ఫోర్ వీలర్ వాహనాలను బ్యాన్ చేయాలి: ప్రభుత్వ కమిటీ ప్రతిపాదనలు
Diesel Four-wheelers: వాహన ఉద్గారాలను తగ్గించేందుకు 2027 కల్లా దేశంలోని ప్రధాన నగరాల్లో డీజిల్ ఫోర్ వీలర్లను బ్యాన్ చేయాలని ఓ ప్రభుత్వ ప్యానెల్ ప్రతిపాదనలు చేసింది. వివరాలు ఇవే.
Diesel Four-wheelers: వాహనాల నుంచి వచ్చే ఉద్గారాల(Vehicular Emissions)ను కట్టడి చేయాలని భారత ప్రభుతం చాలా కాలంగా అనేక చర్యలను చేపడుతూనే ఉంది. భవిష్యత్తులోనూ ఈ దిశగా మరికొన్ని ప్రణాళికలను అమలు చేయనుంది. ఈ క్రమంలో చమురు మంత్రిత్వ శాఖ (Oil Ministry) నియమించిన ఓ కమిటీ (Panel) కొన్ని కీలకమైన ప్రతిపాదనలను చేసింది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో 2027లోగా డీజిల్‍తో నడిచే కార్లతో పాటు ఫోర్ వీలర్ వాహనాలను బ్యాన్ చేయాలని ప్రతిపాదనలు చేసింది. క్లీనర్ మొబిలిటీ సొల్యూషన్స్‌ను అమలు చేసే దిశగా ఈ ప్రదిపాదనను చేసింది. పది లక్షల కంటే ఎక్కువ మంది జనాభా ఉండే నగరాలు ప్యూర్ ఎలక్ట్రిక్, గ్యాస్ ఫ్యుయల్డ్ వాహనాలకు మారాల్సిన అవసరం ఉందని ఆ ప్యానెల్ సూచనలు చేసిందని రాయిటర్స్ రిపోర్ట్ వెల్లడించింది. కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాల్లో వాహనాల ఉద్గారాలను తగ్గించేందుకు డీజిల్ ఫోర్ వీలర్ల బ్యాన్‍ను అమలు చేయాల్సిందేనని ఆ ప్యానెల్ సూచించిందని తెలుస్తోంది.
Diesel Four-wheelers: వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగేందుకు కారణమయ్యే గ్రీన్ హౌస్ గ్యాసెస్(Greenhouse Gases)ను నియంత్రించాలని భారత్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలు ఈ గ్రీన్ గౌస్ గ్యాసెస్‍లో ప్రధానమైనవిగా ఉన్నాయి. అందుకే ఉద్గారాలను అందుపులోకి తెచ్చేందుకు భారత ప్రభుత్వం అనేక చర్యలను చేపడుతోంది. గత కొన్నేళ్లు ఆటోమొబైల్ పరిశ్రమ కూడా ఈ విషయంలో మల్లగుల్లాలు పడుతోంది. ఉద్గారాలను తగ్గించాలన్న ప్రణాళికల్లో భాగంగానే ప్రధాన నగరాల్లో డీజిల్ ఫోర్ వీలర్లను బ్యాన్ చేయాలన్న ప్రతిపాదన వచ్చింది.
Diesel Four-wheelers: రవాణా రంగంలో ప్రస్తుతం 80 శాతం డీజిల్ వాహనాల వినియోగమే జరుగుతోంది. దేశంలో బస్సులు, లారీలు, ట్రక్కులు లాంటి ప్రధానమైన కమర్షియల్ వాహనాలు అధిక శాతం డీజిల్‍తోనే నడుస్తున్నాయి. చాలా ప్యాసింజర్ వాహనాలు కూడా డీజిల్‍తోనే రన్ అవుతున్నాయి. పెట్రోల్‍తో పోలిస్తే డీజిల్ వాహనాల నుంచి ఉద్గారాలు ఎక్కువగా వెలువడుతాయి.
Diesel Four-wheelers: ఈ దశాబ్దం ముగిసేలోగా ఫాజిల్ ఫ్యుయెల్‍తో నడిచే సిటీ బస్సులు ఉండకూడదని ఆ ప్యానెల్.. చమురు మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు ఇచ్చింది. సిటీ బస్సుల కోసం కేవలం ఎలక్ట్రిక్ బస్సులనే వినియోగించాలని సూచించింది. “2030 కల్లా ఎలక్ట్రిక్ కాని ఏ బస్సు కూడా సిటీ బస్సుగా ఉండకూడదు. రవాణా కోసం కొత్త డీజిల్ బస్సులను యాడ్ చేయడం 2024 నుంచే ఆపేయాలి” అని ప్యానెల్ సూచించినట్టు ఆ రిపోర్టు పేర్కొంది. అయితే, ఈ ప్రతిపాదనలను క్యాబినెట్ ముందుకు చమురు, గ్యాస్ మంత్రిత్వ శాఖ తీసుకెళుతుందా.. లేదా అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
Diesel Four-wheelers: ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సహకాలు అందించేందుకు అమలు చేస్తున్న ఫాస్టర్ ఆడాప్షన్, మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వెహికల్ స్కీమ్ (FAME)ను మరింత విస్తృతం చేయాలని ప్రభుత్వానికి ఆ కమిటీ సిఫారసు చేసినట్టు తెలుస్తోంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగేందుకు ఈ చర్య దోహదం చేస్తుందని ఆ ప్యానెల్ అభిప్రాయపడినట్టు సమాచారం.
టాపిక్