Turbo engine car : టర్బో ఇంజిన్​ కారు తీసుకునే ముందు ఇవి తెలుసుకోండి..-planning to buy a car with turbo engine know pros and cons other detail here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Turbo Engine Car : టర్బో ఇంజిన్​ కారు తీసుకునే ముందు ఇవి తెలుసుకోండి..

Turbo engine car : టర్బో ఇంజిన్​ కారు తీసుకునే ముందు ఇవి తెలుసుకోండి..

Sharath Chitturi HT Telugu
Apr 11, 2023 01:21 PM IST

Turbo engine car : మీరు టర్బోఛార్జ్​డ్​ ఇంజిన్​ కారు తీసుకోవాలని చూస్తున్నారా? అసలు టర్బోఛార్జ్​డ్​ ఇంజిన్​ అంటే ఏంటి? లాభాలేంటి? వంటి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

టర్బో ఇంజిన్​ కారు తీసుకునే ముందు ఇవి తెలుసుకోండి..
టర్బో ఇంజిన్​ కారు తీసుకునే ముందు ఇవి తెలుసుకోండి.. (HT AUTO)

What is turbo engine car : ఒకప్పుడు కారు కొనాలంటే అది పెట్రోల్​ బండా? లేక డీజిల్​ బండా? అని మాత్రమే తెలుసుకోవాల్సి ఉండేది. ఇంజిన్​ ఆప్షన్లు కూడా తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు టెక్నాలజీతో పాటు ఆటోమొబైల్​ పరిశ్రమ కూడా అభివృద్ధి చెందుతూ వస్తోంది. ఈ క్రమంలోనే 'టార్బోఛార్జ్​డ్​ ఇంజిన్​' పేరు ఇటీవలి కాలంలో ఇండియాలో బాగా వినిపిస్తోంది. ఎఫీషియన్సీపై దృష్టిసారించే వారందరు ఈ టర్బో ఇంజిన్​లపై మనసు పారేసుకుంటున్నారు. లైట్​ వెయిట్​, పవర్​ ఎక్కువగా జనరేట్​ చేస్తుండటం వంటి ఫీచర్స్​ కూడా ఇందుకు కారణంగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. అసలు ఏంటి ఈ టర్బోఛార్జ్​డ్​ ఇంజిన్​? దీని ఉపయోగాలేంటి? నష్టాలున్నాయా? వంటివి ఇక్కడ తెలుసుకుందాము..

టర్బోఛార్జ్​డ్​ ఇంజిన్​ అంటే ఏంటి?

టర్బోఛార్జ్​డ్​ ఇంజిన్​లో.. ఎగ్సాస్ట్​ ఔట్​లెట్​ నుంచి గ్యాస్​లను తీసుకునేందుకు టర్బైన్స్​ ఉంటాయి. అలా వచ్చిన గ్యాసెస్​ను కంబషన్​ ఛాంబర్​లోకి పంపిస్తాయి ఈ టర్బైన్స్​. ఫలితంగా సిలిండర్స్​లో గాలి ఎక్కువ లభిస్తుంది. బర్నింగ్​ మరింత పవర్​ఫుల్​గా ఉంటుంది. అత్యధిక ఆర్​పీఎంలలో ఈ తరహా ఇంజిన్​ల పవర్​ ఔట్​పుట్​ అమాంతం పెరిగిపోతుంది. ఛాంబర్​లో ఉన్న ఎయిర్​ ప్రెజర్​.. సాధారణ అట్మోస్ఫియరిక్​ ప్రెజర్​ కన్నా ఎక్కువగా ఉంటుంది. తద్వారా అధిక పవర్​ జనరేట్​ అవుతుంది.

టర్బోఛార్జ్​డ్​ ఇంజిన్​తో లాభాలేంటి?

Turbo engine cars in India : చిన్న కెపాసిటీ ఇంజిన్​లకు టర్బోఛార్జ్​ జోడిస్తే.. అవి కూడా ఎక్కువ పవర్​ను జనరట్​ చేయగలుగుతాయి. వాటి ఫ్యూయెల్​ ఎకానమీ కూడా మెరుగుపడుతుంది. టర్బైన్స్​ నుంచి ఎక్స్​ట్రా గాలి లోపలికి వెళుతుండటం, తద్వారా ఎక్స్​ట్రా పవర్​ జనరేట్​ అవుతుందటం ఇందుకు కారణం.

చిన్న కెపాసిటీ ఇంజిన్​లకు టర్బోఛార్జ్​ ఆప్షన్​ ఇవ్వడంతో తక్కువ స్పేస్​లో ఎక్కువ పని జరుగుతున్నట్టు అవుతుంది. ఫలితంగా ఎకనామికల్​గానూ ప్రయోజనం చేకూరుతుంది. మెయిన్​టేనెన్స్​ కాస్ట్​ కూడా తగ్గుతుంది.

లీనియర్​ పవర్​ కర్వ్​ ఉండే నేచురల్లీ ఆస్పిరేటెడ్​ ఇండజిన్​లతో పోల్చుకుంటే.. టర్బోఛార్జ్​ ఇంజిన్​ల హార్స్​పవర్​ టాప్​ లెవల్​లో ఉంటుంది. ఫలితంగా పవర్​ ఇంకా పెరుగుతుంది. బండి దూసుకెళుతుంది.

టర్బోఛార్జ్​డ్​ ఇంజిన్​తో నష్టాలు ఉన్నాయా?

Turbocharged engine cars : నేచురల్లీ ఆస్పిరేటెడ్​ ఇంజిన్​ల కన్నా టర్బోఛార్జ్​ ఇంజిన్​ల ధర ఎక్కువగా ఉంటుంది. మోటార్​ను నిర్మించే ప్రక్రియ క్లిష్టంగా ఉండటం ఇందుకు కారణం. టర్బో ఇంజిన్​లలో 'ప్రీ- ఇగ్నీషన్​' సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. బండిని బలంగా యాక్సలరేట్​ చేస్తే, ఇంజిన్​పై ప్రెజర్​ ఎక్కువగా పడి, ముడి ఇంధనం కూడా ఇగ్నైట్​ అయిపోతూ ఉంటుంది. స్పార్క్​ ప్లగ్​ చేయడం కన్నా ముందే ఇగ్నైట్​ అవుతుంది.

'ప్రీ ఇగ్నీషన్​' సమస్యను తగ్గించేందుకు సాధారణ ఫ్యూయెల్​ను వాడకూడదని ఆటోమొబైల్​ సంస్థలు చెబుతుంటాయి. అంటే ధర ఎక్కువగా ఉండే ప్రీమియం ఫ్యూయెల్​ (హై ఆక్టోన్​ పెట్రోలియం)ను మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది.

Uses of turbocharged engine cars : ఇక పవర్​ ఔట్​పుట్​ను పెంచేందుకు.. కంప్రెసర్​ మినిమం స్పీడ్​కు పడిపోవాలి. ఇలా జరిగిన ప్రతిసారీ పవర్​ డెలివరీ ఆలస్యమవుతుంది. అందుకే.. చాలా టర్బోఛార్జ్​డ్​ ఇంజిన్​లు నడుపుతున్నప్పుడు డ్రైవర్లకు 'ల్యాగ్​' ఫీల్​ వస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం