2024 Hyndai Kona Electric Car: సరికొత్త హ్యుండాయ్ కోనా ఎలక్ట్రిక్ కారు.. మరింత పెద్దగా.. చాలా అప్‍గ్రేడ్‍లతో..!-2024 hyndai kona electric car grows in size and space ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  2024 Hyndai Kona Electric Car: సరికొత్త హ్యుండాయ్ కోనా ఎలక్ట్రిక్ కారు.. మరింత పెద్దగా.. చాలా అప్‍గ్రేడ్‍లతో..!

2024 Hyndai Kona Electric Car: సరికొత్త హ్యుండాయ్ కోనా ఎలక్ట్రిక్ కారు.. మరింత పెద్దగా.. చాలా అప్‍గ్రేడ్‍లతో..!

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 10, 2023 11:15 PM IST

2024 Hyndai Kona Electric Car: హ్యుండాయ్ కోనా ఎలక్ట్రిక్ కారు తదుపరి జనరేషన్ మోడల్ మరింత ఎక్కువ సైజ్‍తో రానుంది. అప్‍గ్రేడ్‍లు ఉండనున్నాయి.

2024 Hyndai Kona Electric Car: సరికొత్త హ్యుండాయ్ కోనా ఎలక్ట్రిక్ కారు (Photo: HT Auto)
2024 Hyndai Kona Electric Car: సరికొత్త హ్యుండాయ్ కోనా ఎలక్ట్రిక్ కారు (Photo: HT Auto)

2024 Hyundai Kona Electric Car: తదుపరి జనరేషన్ కోనా ఎలక్ట్రిక్ కారును న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఆటో షో (New York International Auto Show)లో హ్యుండాయ్ (Hyundai) ఆవిష్కరించింది. హ్యుండాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‍యూవీకి ఇది రెండో జనరేషన్‍గా ఉంది. ఎలక్ట్రిఫైడ్ పవర్ ట్రైన్ ఫస్ట్‌తో ఈ 2024 కోనా ఎలక్ట్రిక్ కారు ప్లాట్‍ఫామ్‍ను డెవలప్ చేసింది హ్యుండాయ్. వివరాలివే..

బ్యాటరీ సహా మరిన్ని వివరాలు

2024 Hyundai Kona Electric Car: ప్రస్తుత కోనా ఈవీతో పోలిస్తే 2024 హ్యుండాయ్ కోనా మరింత పెద్ద సైజ్‍తో వచ్చింది. 2024 మోడల్ కారు వీల్ బేస్ 104.7 ఇంచులు, లెంగ్త్ 171.5 ఇంచులు, వెడల్పు 71.9 ఇంచులుగా ఉంది. మెరుగ్గా ఉండే ఎయిరో డైనమిక్ పర్ఫార్మెన్స్‌ను ఈ నయా కోనా ఎలక్ట్రిక్ కారు కలిగి ఉంటుంది. 64.8 kWh బ్యాటరీతో 2024 కోనా ఎలక్ట్రిక్ కారు వస్తోంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 418 కిలోమీటర్లు ప్రయాణించేలా రేంజ్ ఉంటుంది. ఈ కారు మోటార్ 201 hp మ్యాగ్జిమమ్ పవర్ ఔట్‍పుట్, 255 Nm పీక్ టార్క్యూను ప్రొడ్యూజ్ చేస్తుంది.

ఇంటీయర్ అప్‍గ్రేడ్లలతో..

2024 Hyundai Kona Electric Car: 2024 హ్యుండాయ్ కోనా ఎలక్ట్రిక్ కారు ఇంటీయర్‌లోనూ చాలా అప్‍గ్రేడ్లు ఉన్నాయి. ఫ్లోటింగ్ హారిజన్ సీ-ప్యాడ్‍తో కూడిన డ్యాష్ బోర్డును ఈ కారు కలిగి ఉంది. 12.3 ఇంచుల సైజ్ ఉండే రెండు పానరోమిక్ డిస్‍ప్లే స్క్రీన్‍లు ఉంటాయి. ఇప్పుడు గేర్ సెలెక్టర్.. స్టీరింగ్ వీల్ వెనుక ఉంది. దీంతో కన్సోల్ ఏరియాలో స్టోరేజ్ స్పేస్ మరింత ఎక్కువగా ఉంటుంది.

శీతల ఉష్ణోగ్రతల్లోనూ చార్జింగ్, పవర్ పర్ఫార్మెన్స్ సెక్యూర్‌గా ఉండేలా బ్యాటరీ ప్రీ కండీషనింగ్‍తో 2024 హ్యుండాయ్ కోనా ఎలక్ట్రిక్ వస్తోంది. సరికొత్త చార్జింగ్ పోర్ట్ డోర్ ల్యాంప్ ఉంటుంది. ఫార్వార్డ్ ఫ్రంక్ స్టోరేజ్, యాక్టివ్ గ్రిల్ షటర్స్, ఎక్స్‌టీరియర్ వెహికల్ టు లోడ్ సామర్థ్యం, ఐ-పెడల్ డ్రైవింగ్ మోడ్, స్మార్ట్ రిజెనెరేటివ్ సిస్టమ్‍ను ఈ నయా జనరేషన్ హ్యుండాయ్ కోనా కలిగి ఉంది.

ప్రస్తుతం, హ్యుండాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ ప్రారంభ ధర ఇండియాలో రూ.23.84 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. అయితే, ఈ నయా జనరేషన్ 2024 కోనా ఇండియాకు ఎప్పుడు వస్తుందో స్పష్టత లేదు.

WhatsApp channel