How to change car battery : కారు బ్యాటరీని సులభంగా మార్చుకోండి ఇలా..-tips on how to change car battery by yourself at home detailed explanation here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  How To Change Car Battery : కారు బ్యాటరీని సులభంగా మార్చుకోండి ఇలా..

How to change car battery : కారు బ్యాటరీని సులభంగా మార్చుకోండి ఇలా..

Sharath Chitturi HT Telugu
Apr 11, 2023 07:39 AM IST

How to change car battery : మీ కారులో బ్యాటరీ పనిచేయడం లేదా? మెకానిక్​ దగ్గరికి తీసుకెళ్లాలని చూస్తున్నారా? బ్యాటరీని మార్చడం రాకెట్​ సైన్స్​ కాదు! మీరు సొంతంగా ఆ పని చేయవచ్చు. డబ్బులు మిగుల్చుకోవచ్చు. మరి కారు బ్యాటరీని సొంతంగా ఎలా మార్చుకోవాలో ఇక్కడ తెలుసుకుందాము..

కారు బ్యాటరీని సొంతంగా మార్చుకోవడం ఎలా?
కారు బ్యాటరీని సొంతంగా మార్చుకోవడం ఎలా?

How to change car battery : కారులో బ్యాటరీ అన్నది చాలా ముఖ్యమైనది. లైటింగ్​, ఇగ్నీషన్​తో పాటు ఇతర ఎలక్ట్రికల్​ పనులన్నీ ఈ బ్యాటరీపైనే నడుస్తాయి. ఓ వాహనంలో అత్యవసరమైన భాగాల్లో ఈ బ్యాటరీ ఒకటి. వెహికిల్​ స్మూత్​గా, ఇబ్బందులు లేకుండా నడవాలంటే.. ఈ బ్యాటరీ కండీషన్​ కూడా బాగుండాలి. బ్యాటరీ హెల్త్​ సరిగ్గా లేకపోతే.. ఇక ఇబ్బందులు మొదలవుతాయి. విసిగించి వదిలేస్తాయి. అందుకే.. కారు బ్యాటరీని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. సమస్యను ముందుగానే గుర్తించే విధంగా చర్యలు తీసుకోవాలి. అవసరమైతే బ్యాటరీని మార్చుకోవాలి.

సాధారణంగా.. బ్యాటరీని మార్చుకోవాలంటే మనం మెకానిక్​ దగ్గరికి వెళతాం. అయితే.. బ్యాటరీని మార్చడం అన్నది రాకెట్​ సైన్సేమీ కాదు! కాస్త సమయం కేటాయిస్తే చాలు. మనంతట మనమే కారు బ్యాటరీని మార్చుకోవచ్చు. కాస్త డబ్బులు మిగుల్చుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. కారు బ్యాటరీని మార్చుకోవడం ఎలా? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..

ముందుగా.. కారు బ్యాటరీని గుర్తించండి..

How to change car battery in Telugu : ముందుగా కారు ఇంజిన్​ను ఆపేయండి. కీ స్లాట్​ నుంచి కీ తీసేయండి. బ్యాటరీ ఎక్కడ ఉందని గుర్తించే ముందు లేదా బ్యాటరీని ముట్టుకునే ముందు.. ఇంజిన్​ కూల్​ అయ్యిందో లేదే చూడండి. చాలా కార్లలో.. బానెట్​ కింద బ్యాటరీ ఉంటుంది. ప్లాస్టిక్​/ మెటల్​ ట్రేపై ఉంటుంది. అయితే.. కొన్ని కార్లకి మాత్రం వెనక ఉన్న ట్రంక్​లో బ్యాటరీ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి.

బ్యాటరీ టర్మినల్స్​ను డిస్కనెక్ట్​ చేయండి..

కేబుల్స్​ కనెక్ట్​ చేసేందుకు బ్యాటరీలకు రెండు టర్మినల్స్​ ఉంటాయి. అవి ప్లాస్టిక్​ కవర్స్​లో పెట్టి ఉండొచ్చు. వీటిల్లో ఒక బ్లాంక్​, ఒక నెగిటివ్​, ఒక రెడ్​, ఒక పాజిటివ్​ టర్మినల్స్​ ఉంటాయి. లేదా పాజిటివ్​, నెగిటివ్​ అన్న సింబల్స్​ ఉండొచ్చు. ముందుగా.. నెగిటివ్​ కేబుల్​ని డిస్కనెక్ట్​ చేయండి. ఐ ప్రొటెక్షన్​, చేతికి గ్లోవ్స్​ వేసుకోవాలని గుర్తుపెట్టుకోండి. బ్యాటరీ టర్మినల్​కు ఉన్న నెగిటివ్​ కనెక్టర్​ను టైట్​ చేసే బోల్ట్​ను లూజ్​ చేసేందుకు వ్రెంచ్​ని వాడండి. లూజ్​ అయిన తర్వాత కేబుల్​ కనెక్టర్​ను ట్విస్ట్​ చేస్తూ.. బ్యాటరీ టర్మినల్​ నుంచి తీసేయండి. ఇదే విధంగా పాజిటివ్​ కేబుల్​ను కూడా తొలగించండి.

పాత బ్యాటరీని తొలగించండి..

How to change car battery athome : కారు బ్యాటరీల సెక్యూరిటీ కోసం వాటి పైన మెటల్​ బార్స్​ ఉంటాయి. లేదా వాటి కింద క్లాంప్స్​ ఉంటాయి. వాటికి బోల్ట్స్​ ఉంటాయి. వాటిని లూజ్​ చేసి.. బ్యాటరీని పైకి తీయాల్సి ఉంటుంది. సాధారణంగా కారు బ్యాటరీల్లో కాస్టిక్​ లిక్విడ్​ ఉంటుంది. అందువల్ల.. బ్యాటరీని సరిగ్గా లిఫ్ట్​ చేయాలని గుర్తుపెట్టుకోండి.

బ్యాటరీ ట్రేని క్లీన్​ చేయండి..

బ్యాటరీ టర్మినల్​ కనెక్టర్స్​ తుప్పు పడుతుంటాయి. ఇది సాధారణమైన విషయమే. అందువల్ల బ్యాటరీని తొలగించిన తర్వాత.. వాటిని క్లీన్​ చేయాలి. బ్యాటరీ క్లీనర్​, వైర్​ బ్రష్​ను వినియోగించండి. బ్యాటరీ ట్రేని కూడా కడగండి. ఇందుకోసం బేకింగ్​ సోడో పేస్ట్​ను ఉపయోగించొచ్చు. అయితే.. క్లీనింగ్​ తర్వాత మొత్తం డ్రై అయిపోవాలని గుర్తుపెట్టుకోండి.

కొత్త బ్యాటరీని ఇన్​స్టాల్​ చేయండి..

Car battery change process : కొత్త బ్యాటరీని ఇన్​స్టాల్​ చేసే సమయం వచ్చింది. అయితే.. రెడ్​, బ్లాక్​ టర్మినల్స్​ సరిగ్గా ఉన్నాయా, లేవా చూసుకోవాలి. స్లాట్​లోకి బ్యాటరీ పెట్టండి. మెటల్​ బార్​ లేదా క్లాంప్​లో పెట్టి బోల్ట్​ను టైట్​ చయండి. అవసరమైతే రెండు టర్మినల్స్​పై యాంటి కొరోసివ్​ ప్రొటెక్షన్​ జెల్​ ఉపయోగించొచ్చు. ముందుగా.. పాజిటివ్​ కేబుల్​ను బ్యాటరీకి కనెక్ట్​ చేయాలి. టర్మినల్​ లోపలికి పుష్​ చేసి బోల్ట్​ టైట్​ చేయాలి. ఆ తర్వాత ఇదే విధంగా నెగిటివ్​ కేబుల్​ను కూడా పెట్టాలి. ఆ తర్వాత బ్యాటరీ సరిగ్గా పనిచేస్తోందా లేదా అని చెక్​ చేయండి. ఇందుకోసం వెహికిల్​ స్టార్ట్​ చేయాలి.

Whats_app_banner

సంబంధిత కథనం