When to change car battery : మీ కారు బ్యాటరీని ఎప్పుడు మార్చాలి? సంకేతాలివే..-when to change car battery here are some tips an details you need to know ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  When To Change Car Battery : మీ కారు బ్యాటరీని ఎప్పుడు మార్చాలి? సంకేతాలివే..

When to change car battery : మీ కారు బ్యాటరీని ఎప్పుడు మార్చాలి? సంకేతాలివే..

Sharath Chitturi HT Telugu
Apr 10, 2023 07:24 AM IST

When to change car battery : మీ కారు బ్యాటరీ పనైపోయిందా? ఎలా తెలుసుకోవాలో మీకు అర్థం కావడం లేదా? మీ కారు బ్యాటరీని ఎప్పుడు మార్చాలి? అన్న విషయం తెలుసుకోవాలంటే.. ఈ సంకేతాలు మీకు తెలియాలి..

 మీ కారు బ్యాటరీని ఎప్పుడు మార్చాలి? సంకేతాలివే..
మీ కారు బ్యాటరీని ఎప్పుడు మార్చాలి? సంకేతాలివే.. (unsplash)

When to change car battery : కారుకు ఇంజిన్​ ఎంత ముఖ్యమో.. బ్యాటరీ కూడా అంతే కీలకం. ఇప్పుడు వస్తున్న కొత్త కార్లలో బ్యాటరీ ప్రాముఖ్యత మరింత పెరిగింది. అలాంటి బ్యాటరీ హెల్త్​ను ఎప్పటికప్పుడు చెక్​ చేస్తూ ఉండాలి. అందుకోసం కాస్త టైమ్​ కేటాయించాలి. సాధారణంగా.. కారు బ్యాటరీ 3-4ఏళ్ల వరకు పనిచేస్తుంది. అయితే.. వేడి, అతి వినియోగం వంటి కారణాలతో బ్యాటరీ లైఫ్​ తగ్గిపోయే ప్రమాదం ఉంది. వీటిని చెక్​ చేస్తూ ఉండాలి. లేకపోతే.. సరిగ్గా కావాల్సిన టైమ్​లో బండి హ్యాండ్​ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో.. అసలు కారు బ్యాటరీ ఎప్పుడు మార్చాలి? సంకేతాలేంటి? అన్నవి ఇక్కడ తెలుసుకుందాము..

కీ టర్న్​ చేసినా స్పందన లేకపోవడం..

How to change car battery in telugu : సాధారణంగా కీ ఆన్​ చేసినప్పుడు కారు ఇంజిన్​ స్టార్ట్​ అవుతుంది. అయితే.. కీ తిప్పినా, ఎలాంటి స్పందన లేకపోతే.. కారు బ్యాటరీ అయిపోయిందని భావించవచ్చు. అందుకు అదనంగా.. డాష్​బోర్డ్​లో ఎలాంటి వార్నింగ్​ సిగ్నల్స్​ కూడా రాకపోతే.. కారు బ్యాటరీ అయిపోయినట్టు, దానిని మార్చాల్సిన సమయం వచ్చినట్టు అర్థం చేసుకోవచ్చు.

మోటార్​పై ఫోకస్​ చేయండి..

కీ పెట్టి తిప్పినప్పుడు.. మోటార్​ ఎక్కువ సేపు స్టార్ట్​ అవ్వకపోతే కారు బ్యాటరీ పనైపోయినట్టు! వెంటనే దానిని మార్చాల్సి ఉంటుంది. ఈ సమస్య.. 2 వీలర్స్​లోనూ గమనించవచ్చు.

బ్యాటరీ/ ఛార్జింగ్​ సిస్టెమ్​ వార్నింగ్​ లైట్స్​..

ఇప్పుడు అనేక కార్లలో బ్యాటరీ, ఛార్జింగ్​ సిస్టెమ్​కు సంబంధించి సిగ్నల్స్​ వస్తున్నాయి. మీ కారులో కూడా ఆ సిగ్నల్స్​ ఉన్నాయో లేవో చెక్​ చేసుకోండి. అలాంటి సిగ్నల్స్​ బ్లింక్​ అవుతుంటే.. బ్యాటరీని మార్చాల్సిన సమయం వచ్చినట్టు ఫిక్స్​ అవ్వాల్సిందే.

హెట్​లైట్స్​ డిమ్​గా ఉండటం..

Car battery life check : కారు ఇంజిన్​ ఆగిపోయినప్పుడు.. హెడ్​లైట్స్​ డిమ్​గా ఉంటే.. బ్యాటరీ పనైపోయినట్టు. అదే.. కారు నడుపుతున్నప్పుడు హెట్​లైట్స్​ డిమ్​గా ఉంటే.. ఆల్టర్నేటర్​ పాడైపోయినట్టు. దానిని కూడా వెంటనే మార్చాలి.

బ్యాటరీలో లీక్స్​..

Car battery changing tips : మీ కారు బ్యాటరీకి క్రాక్స్​, లీక్స్​ వంటివి ఉన్నాయేమో చూసుకోవాలి. అలాంటివేవైనా కనిపిస్తే.. వెంటనే బ్యాటరీని రిప్లేస్​ చేయాలి. అప్పుడే కారు సురక్షితంగా ఉంటుంది.

ఈ విధంగా కారు బ్యాటరీని ఎప్పుడు మార్చాలన్న సంకేతాలను తెలుసుకుని.. అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలి.

WhatsApp channel

సంబంధిత కథనం