New Hyundai Alcazar : కొత్త ఇంజిన్​ ఆప్షన్​తో హ్యుందాయ్​ అల్కజార్​​.. బుకింగ్స్​ షురూ!-new hyundai alcazar to launch with new turbo petrol engine bookings opened check details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  New Hyundai Alcazar : కొత్త ఇంజిన్​ ఆప్షన్​తో హ్యుందాయ్​ అల్కజార్​​.. బుకింగ్స్​ షురూ!

New Hyundai Alcazar : కొత్త ఇంజిన్​ ఆప్షన్​తో హ్యుందాయ్​ అల్కజార్​​.. బుకింగ్స్​ షురూ!

Sharath Chitturi HT Telugu
Feb 27, 2023 02:15 PM IST

New Hyundai Alcazar : హ్యుందాయ్​ అల్కజార్​లో కొత్త ఇంజిన్​ ఆప్షన్​ రానుంది. ఇందుకు సంబంధించిన బుకింగ్స్​ ప్రక్రియ సైతం ప్రారంభమైంది. పూర్తి వివరాలు..

కొత్త ఇంజిన్​తో హ్యుందాయ్​ అల్కజార్​ ఫేస్​లిఫ్ట్​.. బుకింగ్స్​ షురూ!
కొత్త ఇంజిన్​తో హ్యుందాయ్​ అల్కజార్​ ఫేస్​లిఫ్ట్​.. బుకింగ్స్​ షురూ! (HT AUTO)

New Hyundai Alcazar : త్రీ-రో ఎస్​యూవీ, మార్కెట్​లో మంచి డిమాండ్​ ఉన్న అల్కజార్​కు కొత్త ఇంజిన్​ ఆప్షన్​ను ప్రకటించింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ హ్యుందాయ్​ మోటార్స్​. ఇప్పటికే రెండు ఇంజిన్​ ఆప్షన్స్​తో అందుబాటులో ఉన్న ఈ హ్యుందాయ్​ అల్కజార్​కు ఇప్పుడు 1.5 లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​ను సైతం జతకానుంది. ఇందుకు సంబంధించిన బుకింగ్స్​ మొదలయ్యాయి. రూ. 25వేల టోకెన్​ అమౌంట్​తో కొత్త హ్యుందాయ్​ అల్కజార్​ను బుక్​ చేసుకోవచ్చు. ఈ కొత్త అల్కజార్​ ధరకు సంబంధించిన వివరాలను సంస్థ ఇంకా వెల్లడించలేదు. కాగా దీని ఎక్స్​షోరూం ధర రూ. 18లక్షలుగా ఉండొచ్చని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి. లాంచ్​ తర్వాత.. ఇప్పటికే మార్కెట్​లో ఉన్న 1.4 లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​తో కూడిన కియా కారెన్స్​కు ఈ హ్యుందాయ్​ అల్కజార్​ గట్టిపోటీనిస్తుంది.

సరికొత్తగా హ్యుందాయ్​ అల్కజార్​..!

త్వరలోనే అమల్లోకి రానున్న కాలుష్యపరమైన నిబంధనలకు తగ్గట్టుగానే ఈ కొత్త ఇంజిన్​ మోడల్​ను హ్యుందాయ్​ తీసుకురానుంది. కొత్త హ్యుందాయ్​ అల్కజార్​లో 7 స్పీడ్​ డీసీటీ, 6 స్పీడీ మేన్యువల్​ గేర్​బాక్స్​ ఆప్షన్స్​ ఉంటాయి. ఈ ఇంజిన్​.. 160 పీఎస్​ పవర్​ను, 253 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. డీసీటీ ట్రాన్స్​మిషన్​తో 18 కేఎంపీహెచ్​, మేన్యువల్​ వేరియంట్​తో 1.75 కేఎంపీహెచ్​ మైలేజ్​ను పొందవచ్చని హ్యుందాయ్​ చెబుతోంది.

Hyundai Alcazar on road price in Hyderabad : కాగా.. ఈ కొత్త అల్కజార్​లో కాస్త డిజైన్​ని కూడా మార్చినట్టు కనిపిస్తోంది. "కొత్త అల్కజార్​ డిజైన్​ని రిఫైన్డ్​ చేశాము. ఎక్స్​పీరియన్స్​ను మరింత పెంచేందుకు సరికొత్త టెక్నాలజీలను జోడించాము," అని హ్యుందాయ్​ మోటార్​ ఇండియా సీఓఓ తరుణ్​ గార్గ్​ తెలిపారు.

డిజైన్​ పరంగానూ మార్పులు..!

కొత్త అల్కజార్​లో ఫ్రెంట్​ గ్రిల్​ డిజైన్​ మారింది. అంతేకాకుండా.. అల్కజార్​ ఎంబ్లెమ్​తో కూడిన పడిల్​ ల్యాంప్​ లోగోలో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. ఇక ఫీచర్స్​ పరంగా.. కొత్త అల్కజార్​లో ఐడిల్​ స్టాప్​/ గో, సైడ్​ ఎయిర్​బ్యాగ్​, కర్టైన్​ ఎయిర్​బ్యాగ్​ వంటివి వస్తున్నాయి. మొత్తం మీద కొత్త హ్యుందాయ్​ అల్కజార్​లో 6 ఎయిర్​బ్యాగ్స్​ స్టాండర్డ్​గా ఉంటాయి.

New Hyundai Alcazar engine option : 2021లో తొలిసారిగా ఇండియా మార్కెట్​లోకి అడుగుపెట్టింది ఈ హ్యుందాయ్​ అల్కజార్​. కియా కారెన్స్​కు గట్టిపోటీనిస్తూ దూసుకెళుతోంది. దీని ఎక్స్​షోరూం ధరలు రూ. 16.10లక్షలు- రూ. 21.10లక్షల మధ్యలో ఉంది.

Whats_app_banner