Best SUV's to buy under 15 Lakhs : రూ. 15లక్షల బడ్జెట్లో.. ది బెస్ట్ ఎస్‌యూవీలు ఇవే!
list of best SUV's to buy under 15 Lakhs : రూ. 15లక్షలలోపు బడ్జెట్లో మంచి ఎస్యూవీ కొనాలని చూస్తున్నారా? ది బెస్ట్ మోడల్స్ లిస్ట్‌ని మీకోసం మేము రూపొందించాము. మీరూ ఓ లుక్కేయండి..
list of best SUV's to buy under 15 Lakhs : దేశంలో గత రెండేళ్లుగా ప్యాసింజర్ వాహనాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఫలితంగా.. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా ఇండియా ఎదిగింది. మరీ ముఖ్యంగా.. ఎస్యూవీ సెగ్మెంట్‌కు విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. చిన్న కార్ల కన్నా.. ఎస్యూవీలవైపే ప్రజలు మొగ్గుచూపుతున్నట్టు డేటా చెబుతోంది. అందుకు తగ్గట్టుగానే.. ఆటో సంస్థలు సైతం ఎస్‌యూవీలపై ఫోకస్ పెట్టి, ఎప్పటికప్పుడు కొత్త కొత్త లాంచ్‌లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. మరి మీరు కూడా ఎస్యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్)ని కొనాలను చూస్తున్నారా? అయితే.. రూ. 15లక్షలలోపు మార్కెట్లో అందుబాటులో ఉన్న ది బెస్ట్ ఎస్‌యూవీల లిస్ట్‌ను ఇక్కడ చూసేయండి..
కియా సెల్టోస్..
Kia Seltos on road price in Hyderabad : కియా మోటార్స్ నుంచి బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉంది సెల్టోస్. మిడ్ సైజ్ ఎస్యూవీ.. హ్యుందాయ్ క్రేటాకు గట్టిపోటీనిస్తోంది. దాదాపు అన్ని కొత్త ఫీచర్స్ ఇందులో వస్తున్నాయి. ఇక కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ త్వరలోనే ఇండియాలోకి అడుగుపెట్టనుంది. సెల్టోస్ ప్రారంభ ఎక్స్‌యూవీ ధర రూ. 10.69లక్షలు.
స్కోడా కుషాక్..
Skoda Kushaq price : స్కోడా కుషాక్‌కు మంచి డిమాండ్ కనిపిస్తోంది. ఇందులో 1.0 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ వేరియంట్లు ఉన్నాయి. స్కోడా కుషాక్ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 11.59లక్షలు.
మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా..
Grand Vitara on road price : మారుతీ సుజుకీ నుంచి వచ్చిన తొలి మిడ్ సైజ్ ఎస్యూవీ మోడల్ ఈ గ్రాండ్ విటారా. టయోటాతో కలిసి దీనిని అభివృద్ధి చేసింది మారుతీ సుజుకీ. ఫలితంగా స్ట్రాంగ్ హైబ్రీడ్ మోడల్లోని ఇంజిన్.. టయోటాకు చెందినది. ఇక ఈ మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 10.45లక్షలుగా ఉంది. ఇక స్ట్రాంగ్ హైబ్రీడ్ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర రూ. 17.99లక్షలు.
మహీంద్రా స్కార్పియో క్లాసిక్..
Mahindra Scorpio classic price hike : పాత స్కార్పియోను స్కార్పియో క్లాసిక్‌గా లాంచ్ చేసింది మహీంద్రా అండ్ మహీంద్రా. మెకానికల్ పరంగా పలు మార్పులు చేసింది. ఈ మోడల్ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 12.64లక్షలు.
టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్..
Toyota Urban Cruiser Hyryder on road price Hyderabad : మారుతీ సుజుకీతో కలిసి ఈ అర్బన్ క్రూజర్ హైరైడర్‌ను డెవెలప్ చేసింది టయోటా. ఇందులో మిడ్- హైబ్రీడ్, స్ట్రాండ్ హైబ్రీడ్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. మిడ్ హైబ్రీడ్ వేరియంట్ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 10.48లక్షలు. స్ట్రాంగ్ హైబ్రీడ్ వేరియంట్ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 19.49లక్షలు.
వోక్స్వాగన్ టైగన్..
Volkswagen Taigun price Hyderabad : స్కోడాకు కుషాక్ ఉంటే.. వోక్స్‌వ్యాగన్‌కు టైగన్ ఉంది! వోక్స్‌వ్యాగన్‌కు బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఈ టైగన్ కొనసాగుతోంది. దీని ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 11.56లక్షలు. ఇందులో రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి.
మహీంద్రా థార్..
Mahindra Thar price Hyderabad : న్యూ- జెన్ మహీంద్రా థార్ 2020లో లాంచ్ అయ్యింది. ఇక మహీంద్రా థార్ ఆర్డబ్ల్యూడీ ఇటీవలే మార్కెట్లోకి అడుగుపెట్టింది. దీని ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 9.99లక్షలుగా ఉంది.
మహీంద్రా స్కార్పియో ఎన్..
Mahindra Scorpio N on road price in Hyderabad : మహీంద్రా స్కార్పియో ఎన్‌కు విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే వెయిటింగ్ పీరియడ్ ఎక్కువగా ఉంది. "బిగ్ డాడీ ఆఫ్ ఎస్యూవీస్" అని దీనికి మహీంద్రా అండ్ మహీంద్రా క్యాప్షన్ కూడా ఇచ్చింది. దీని ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 12.74లక్షలు.
హ్యుందాయ్ క్రేటా..
Hyundai Creta features : హ్యుందాయ్ క్రేటా ఎస్యూవీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మిడ్- సైజ్ ఎస్యూవీ సెగ్మెంట్లో ఈ మోడల్ దూసుకెళుతోంది. దీని ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 10.64లక్షలు.
మహీంద్రా ఎక్స్‌యూవీ 700..
Mahindra XUV700 waiting period : ఎక్స్‌యూవీ500ని ఎక్స్‌యూవీ700తో రిప్లేస్ చేసింది మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ. ధరను కూడా భారీగా పెంచింది. ఎక్స్‌యూవీ700 ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 13.45లక్షలుగా ఉంది.
ఎంజీ హెక్టార్..
MG Hector on road price in Hyderabad : ఇండియా మార్కెట్లో మారిసన్ గ్యారేజ్ (ఎంజీ)కు బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉంది ఈ హెక్టార్. దీని ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 14.73లక్షలు.