Mahindra Thar viral video : టాటా నానోను ఢీకొట్టి.. బోల్తాపడిన మహీంద్రా 'థార్'! వీడియో వైరల్
Mahindra Thar viral video : "ఒక కారు మహీంద్రా థార్‌ను ఢీకొట్టినా.. మహీంద్రా థార్ వెళ్లి కారుకు డాష్ ఇచ్చినా కారుకే రిస్క్," అని అనుకుంటాము. థార్ వెయిట్ అలాంటిది మరి! మరి.. మహీంద్రా థార్ వెళ్లి టాటా నానోను ఢీకొడితే? నానో నుజ్జునుజ్జు అయ్యుంటుందని అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్టే. నానో దెబ్బకు థార్ బోల్తాపడింది!
Mahindra Thar viral video : బరువు, ఆకారం, ధర.. ఈ అన్నింటిలోనూ చాలా చిన్నది టాటా మోటార్స్‌కు చెందిన నానో కారు. ఇక సాలిడ్‌గా, చూస్తుంటేనే హెవీగా కనిపిస్తుంది మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన థార్. ఇక ఈ రెండు క్రాష్ అయితే! "మహీంద్రా థార్ ధాటికి నానో కారు నుజ్జునుజ్జు అయిపోతుంది," అని అందరు అనుకుంటారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. టాటా నానో పవర్‌కు ఏకంగా మహీంద్రా థార్ బోల్తాపడింది. అవును మీరు చదివింది నిజమే. అసలు కథ ఏంటంటే..
నానో దెబ్బకు థార్ బోల్తా..!
Mahindra Thar hits Tata Nano : ఛత్తీస్‌గఢ్ డ్రాగ్ జిల్లాలోని పద్మనాభపూర్‌లో మిని స్టేడియం వద్ద ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా నానో, మహీంద్రా థార్ ఢీకొట్టుకున్నాయి. నానో ముందు భాగం, థార్ పక్కన భాగాన్ని తాకింది. అంతే! దెబ్బకు థార్ బోల్తాకొట్టింది. నానో ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలవ్వలేదు.
కానీ మహీంద్రా థార్ వంటి హెవీ వెయిట్ వాహనాన్ని టాటా నానో బోల్తా కొట్టించడం ఇప్పుడు హాట్టాపిగ్గా మారింది. ఈ ఘటనకు సంబంధించిన దృశాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఇదెలా సాధ్యమైంది..!
Mahindra Thar Tata Nano viral video : "పద్మనాభపూర్ మినీ స్టేడియం సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటలకు టాటా నానో, మహీంద్రా థార్ యాక్సిడెంట్‌కు గురయ్యాయి. ఈ ఘటనలో మహీంద్రా థార్ బోల్తాపడింది. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. టాటా నానో ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది," అని ఆ ప్రాంతానికి చెందిన పోలీసులు చెప్పారు.
ఈ ఘటన జరిగిన వెంటనే.. స్థానికులు థార్, నానోల వద్ద గుమిగుడారు. బోల్తాపడిన థార్‌తో పాటు నానోను తమ కెమెరాల్లో బంధించారు. ఇదెలా సాధ్యమైందని అందరు ఆశ్చర్యపోతున్నారు.
సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఈ దృశ్యాలను చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి :
Tata Nano viral video : ఇండియా మార్కెట్లో మహీంద్రా థార్‌కు ప్రత్యేకంగా ఫ్యాన్‌బేస్ ఉంది. ఈ ఆఫ్-రోడ్ వెహికిల్‌పై చాలా మంది మనసు పారేసుకుంటారు. ఇక నానో విషయానికొస్తే.. దేశంలోనే అతి చౌకైన వాహనంగా దీనికి గుర్తింపు ఉంది.
హైదరాబాద్‌లో మహీంద్రా థార్ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 11.88లక్షలుగా ఉంది. టాటా నానో ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 2.48లక్షలుగా ఉంది. థార్‌కు ఉన్నంత డిమాండ్ నానోకు లేదు!