Tata Nano | ఈ ‘నానో’ కారు విలువ రూ. 22కోట్లు..!-tata nano gold plus costs rs 22crores ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Tata Nano | ఈ ‘నానో’ కారు విలువ రూ. 22కోట్లు..!

Tata Nano | ఈ ‘నానో’ కారు విలువ రూ. 22కోట్లు..!

HT Telugu Desk HT Telugu
Mar 22, 2022 01:21 PM IST

నానో కారు విలువ రూ. 22కోట్లు ఏంటి అని అనుకుంటున్నారా? అయితే చదివేయండి మరి..

ఈ నానో కారు విలువ రూ. 22కోట్లు
ఈ నానో కారు విలువ రూ. 22కోట్లు

Tata Nano gold plus | 'టాటా నానో'.. దిగ్గజ వ్యాపారవేత్త రతన్​ టాటా డ్రీమ్​ ప్రాజెక్ట్​. నానో పేరు వింటే.. ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారు అన్న విషయం గుర్తొస్తుంది. ప్రతి సామాన్యుడి కల నెరవేర్చేందుకు టాటా మోటార్స్​.. నానోను తీసుకొచ్చింది. అయితే టాటా మోటార్స్​లో అత్యంత ఖరీదైన కారు కూడా నానోనే అని మీకు తెలుసా? అవును.. ఆ నానో కారు విలువ రూ. 22కోట్లు.

2011లో నానో కారును ప్రత్యేకంగా మేక్​ఓవర్​ చేశారు. 80కేజీల 22క్యారెట్​ గోల్డ్​, 15కేజీల వెండి, డైమండ్​, రూబీస్​, ఖరీదైన జెమ్​స్టోన్స్​తో నానో కారును రూపొందించారు. ఫలితంగా దాని విలువ రూ. 22కోట్లకు చేరింది.

టైటాన్​ ఇండస్ట్రీస్​లో భాగమైన గోల్డ్​ప్లస్​ జ్యువెలరీస్​.. ప్రమోషన్లలో భాగంగా ఈ కారును రూపొందించింది. దీనికి 'గోల్డ్​ప్లస్​ నానో' అని పేరు పెట్టింది. 

అయితే ఈ గోల్డ్​ప్లస్​ నానో కారు అమ్మకానికి లేదు. దేశంలో 5వేల ఏళ్ల ప్రస్తానానికి చిహ్నంగా రూ. 22కోట్లు విలువ చేసే కారును తీసుకొచ్చింది. ఇందుకోసం అనేకమంది నిపుణులు పనిచేశారు. ఫలితంగా ప్రపంచంలోనే తొలి గోల్డ్​ కారుగా గోల్డ్​ప్లస్​ నానో నిలిచింది!

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్