Kia Seltos facelift launch : కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్.. వచ్చేస్తోంది!
Kia Seltos facelift launch : కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ వచ్చేస్తోంది! 2023 మధ్యలో ఇది లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
Kia Seltos facelift launch in India : ఇండియా ఆటో మార్కెట్లో కియా మోటార్స్ దూసుకెళుతోంది. దేశంలో వేగంగా అమ్ముడుపోతున్న కార్లలో కియా మోడల్స్ ఎక్కువగా ఉంటున్నాయి. అందుకు తగ్గట్టుగానే, కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త మోడల్స్‌ను లాంచ్ చేస్తూనే ఉంది కియా మోటార్స్. ఇక కియాలో బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా గుర్తింపు తెచ్చుకున్న సెల్టోస్ ఎస్‌యూవీకి ఫేస్‌లిఫ్ట్ వర్షెన్.. ఇప్పటికే అనేకమార్లు వార్తల్లో నిలిచింది. ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుందని చాలా మంది ఎదురుచూస్తున్నారు. కాగా.. ఈ కియా సెల్టోస్ ఫెస్‌లిఫ్ట్ వర్షెన్.. ఇంకొన్ని నెలల్లో లాంచ్ అవుతుందని తెలుస్తోంది.
ఇంకొన్ని నెలల్లో లాంచ్..!
2022 జూన్‌లో అంతర్జాతీయంగా కియా సెల్టోస్ ఫెస్‌లిఫ్ట్ వర్షెన్‌ను ఆవిష్కరించింది ఈ సౌత్ కొరియా కంపెనీ. అప్పటి నుంచి.. ఈ వెహికిల్ ఇండియాలో ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందా? అన్న ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టుగానే టీజ్ చేస్తూ వచ్చింది కియా. అయితే.. 2023 మధ్యలో ఈ వెహికిల్ ఇండియాలో లాంచ్ అవుతుందని అంచనాలు ఉన్నాయి. సెల్టోస్ ఫేస్లిఫ్ వర్షెన్కు సంబంధించిన టెస్టింగ్.. హైదరాబాద్‌లో ఇప్పటికే ముగిసింది.
కియా సెల్టోస్ ఫెస్‌లిఫ్ట్ వర్షెన్- ఇంజిన్..
Kia Seltos facelift 2023 : కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్‌లో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 160హెచ్‌పీ పవర్‌ను, 253ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ని ఇది రిప్లేస్ చేస్తుంది. ప్రస్తుతం ఉన్న ఇంజిన్‌లో 7 స్పీడ్ డీసీటీ, 6 స్పీడ్ మేన్యువల్ గేర్‌బాక్స్‌లు ఉంటాయి. ఇక కొత్త వర్షెన్‌లో ఎలాంటి ట్రాన్స్మిషన్ ఉంటుందనేది చూడాలి.
ప్రస్తుతం ఉన్న కియా సెల్టోస్‌లో రెండు ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. మొదటిది 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్. ఇది 115హెచ్‌పీ పవర్‌ను, 144ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇక రెండోది 1.5లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్. ఇది 115హెచ్‌పీ పవర్‌ను, 250ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ రెండు ఇంజిన్లలోనూ 6 స్పీడ్ మేన్యువల్, 6 స్పీడ్ ఐఎంటీ గేర్‌బాక్స్ ఉన్నాయి. వీటిల్లో సీవీటీ గేర్‌బాక్స్, 6 స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి.
కియా సెల్టోస్ ఫెస్‌లిఫ్ట్ వర్షెన్- డిజైన్..
కియా సెల్టోస్ ఫెస్‌లిఫ్ట్ వర్షెన్‌లో గ్రిల్, ఫ్రెంట్ హెడ్‌ల్యాంప్స్‌ను రిడిజైన్ చేశారు. ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్ గ్రిల్స్‌కు ఎక్స్టెండ్ అయ్యాయి. అలాయ్ వీల్స్ డిజైన్ కూడా మారింది. వీటికి మంచి కొత్త సెల్టోస్‌లో పెద్దగా మార్పులు కనిపించలేదు.
Kia India car sales : దమ్మురేపిన కియా.. కార్ సేల్స్‌లో 48శాతం వృద్ధి! పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక కొత్త సెల్టోస్‌లో టెయిల్-ల్యాంప్స్ ఎల్ఈడీ లైట్ బార్‌కు కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఇందులోనే కియా బ్యాడ్జ్ కూడా వస్తోంది.
కియా సెల్టోస్ ఫెస్‌లిఫ్ట్ వర్షెన్- ఫీచర్స్..
Kia Seltos facelift launch date : కొత్త కియా సెల్టోస్‌లో నేవిగేషన్ ఆధారిత స్మార్ట్ క్రూజ్ కంట్రోల్, హైవే డ్రైవింగ్ అసిస్టెన్స్, సరౌండ్ వ్యూ మానిటర్, ఆటోమెటిక్ హై బీమ్స్, రిమోట్ స్మార్ట్ పార్కింగ్ అసిస్ట్ వంటి ఫీచర్స్ వస్తున్నట్టు తెలుస్తోంది. ఇక సేఫ్టీ ఫీచర్స్‌లో భాగంగా 6 ఎయిర్‌బ్యాగ్స్, హిల్ అసిస్ట్ కంట్రోల్, వెహికిల్ స్టెబులిటీ మేనేజ్మెంట్, పార్కింగ్ సెన్సార్స్, కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టెమ్ వంటివి వస్తున్నట్టు సమాచారం. వీటితో పాటు.. కియా సెల్టోస్ ఫెస్‌లిఫ్ట్ వర్షెన్‌లో పానారోమిక్ సన్‌రూఫ్ కూడా ఉండనుంది.
ఇక ఇంటీరియర్‌లో డాష్‌బోర్డ్‌కు స్వల్పంగా మార్పులు జరిగాయి. అయితే.. కొత్తగా 10.25 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చింది. 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్‌కు ఇది యటాచ్ చేసి ఉంటుంది.
Kia Seltos facelift launch date India : లాంచ్ అనంతరం ఈ కియా సెల్టోస్ ఫెస్‌లిఫ్ట్ వర్షెన్.. టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, హ్యుందాయ్ క్రేటా, స్కోడా కుషాక్, వోక్స్వ్యాగన్ టైగన్, ఎంజీ మోటార్‌కు గట్టిపోటీనిస్తుందని అంచనాలు ఉన్నాయి.
సంబంధిత కథనం