Mahindra Scorpio N price hike : భారీగా పెరిగిన మహీంద్రా స్కార్పియో- ఎన్​ ధరలు-mahindra scorpio n price hiked by up to 1 lakh check latest price of variants and other details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mahindra Scorpio N Price Hike : భారీగా పెరిగిన మహీంద్రా స్కార్పియో- ఎన్​ ధరలు

Mahindra Scorpio N price hike : భారీగా పెరిగిన మహీంద్రా స్కార్పియో- ఎన్​ ధరలు

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 14, 2023 11:06 AM IST

Mahindra Scorpio N price hike : స్కార్పియో- ఎన్​ ధరలను భారీగా పెంచేసింది మహీంద్రా అండ్​ మహీంద్రా. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

భారీగా పెరిగిన మహీంద్రా స్కార్పియో- ఎన్​ ధరలు
భారీగా పెరిగిన మహీంద్రా స్కార్పియో- ఎన్​ ధరలు

Mahindra Scorpio N price hike : కస్టమర్లకు భారీ షాక్​ ఇచ్చింది దేశీయ దిగ్గజ ఆటో సంస్థ మహీంద్రా అండ్​ మహీంద్రా. ఫ్లాగ్​షిప్​ ఎస్​యూవీ, మార్కెట్​లో మంచి డిమాండ్​ ఉన్న స్కార్పియో- ఎన్​ ధరను ఒకేసారి భారీగా పెంచేసింది! వేరియంట్లపై రూ. 1లక్ష వరకు ప్రైజ్​ హైక్​ను తీసుకుంది ఈ ఆటో సంస్థ. లాంచ్​ అయిన ఆరు నెలల్లోనే.. స్కార్పియో- ఎన్​ ధరలను ఈ స్థాయిలో పెంచడం గమనార్హం.

పెరిగిన స్కార్పియో- ఎన్​ ధరలు..

దేశీయ ఆటో సంస్థలు.. నూతన ఏడాదిలో వాహనాల ధరలను పెంచే పనిలో పడ్డాయి! ప్రైజ్​ హైక్​ మీద అనేక సంస్థలు ఇప్పటికే ప్రకటనలు చేసేశాయి. ముడిసరకు ధరలు పెరగడం వంటి కారణాలు చెప్పి.. వాహనాల ధరలను భారీగా పెంచుతున్నాయి. తాజాగా.. ఈ జాబితాలోకి మహీంద్రా అండ్​ మహీంద్రా కూడా చేరింది. స్కార్పియో- ఎన్​తో ధరల పెంపును మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది.

Mahindra Scorpio N on road price in Hyderabad : గతేడాది జూన్​ 27న.. రూ. 11.99లక్షల ప్రారంభ (ఎక్స్​షోరూం) ధరతో మార్కెట్​లో లాంచ్​ అయ్యింది మహీంద్రా స్కార్పియో- ఎన్​. ఇక ఇప్పుడు.. దాదాపు అన్ని వేరియంట్లపై ధరలు పెరిగాయి. రూ. 15వేలు- రూ. 1లక్ష మధ్యలో ఈ ప్రైజ్​ హైక్ ​ఉంది. జెడ్​8 4డబ్ల్యూడీ మేన్యువల్​ వేరియంట్​పై అత్యధికంగా రూ. 1.01లక్షల ప్రైజ్​ హైక్​ తీసుకుంది మహీంద్రా అండ్​ మహీంద్రా. గతంలో రూ. 19.94లక్షల ఎక్స్​షోరూం ధరకు లభించిన ఈ ఎస్​యూవీ.. తాజా పెంపుతో రూ. 20.95లక్షల (ఎక్స్​షోరూం)కు చేరింది.

గ్లోబల్​ ఎన్​సీఏపీ క్రాష్​ టెస్ట్​లో మహీంద్రా స్కార్పియో- ఎన్​కు 5 స్టార్​ రేటింగ్​ దక్కింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

స్కార్పియో- ఎన్​ టాప్​ ఎండ్​ వేరియంట్​ జెడ్​8 ఎల్​ 4డబ్ల్యూడీ ఆటోమెటిక్​ ట్రాన్స్​మిషన్​పై అత్యల్పంగా ధర పెరిగింది. ఇప్పుడు ఈ వేరియంట్​.. రూ. 24.05లక్షల ఎక్స్​షోరూం ధరకు లభిస్తోంది.

Mahindra Scorpio N booking : ఇక పెట్రోల్​, డీజిల్​ ఇంజిన్​లలో లభిస్తున్న స్కార్పియో- ఎన్​ బేస్​ వేరియంట్లపై రూ. 65వేలు, రూ. 75వేల ప్రైజ్​ హైక్​ తీసుకుంది ఆటో సంస్థ.

స్కార్పియో- ఎన్​ వేరియంట్లు.. కొత్త ధరల వివరాలు..

వేరియంట్​పెట్రోల్​ ఎంటీపెట్రోల్​ ఏటీడీజిల్​ ఎంటీడీజిల్​ ఏటీ
జెడ్​2రూ. 12.24 లక్షలు-రూ. 13.24లక్షలు-
జెడ్​4రూ. 14.24లక్షలురూ. 16.20లక్షలురూ. 14.74లక్షలురూ. 16.70లక్షలు
జెడ్​6--రూ. 15.64లక్షలురూ.  17.60లక్షలు
జెడ్​8రూ. 17.64లక్షలురూ. 19.60లక్షలురూ. 18.14లక్షలురూ. 20.10లక్షలు
జెడ్​8ఎల్​రూ. 19.54లక్షలురూ. 21.10లక్షలురూ. 20.04లక్షలురూ. 21.60లక్షలు

వేరియంట్​పెట్రోల్​ ఏటీ (2డబ్ల్యూడీ)డీజిల్​ ఏటీ(2డబ్ల్యూడీ)డీజిల్​ ఏటీ(4డబ్ల్యూడీ)
జెడ్​4రూ. 16.20లక్షలురూ. 16.70లక్షలు-
జెడ్​6-రూ. 17.60లక్షలు-
జెడ్​8రూ. 19.60లక్షలురూ. 20.10లక్షలురూ. 22.55లక్షలు
జెడ్​8ఎల్​రూ. 21.10లక్షలురూ. 21.60లక్షలురూ. 24.05లక్షలు

Mahindra Scorpio N waiting period : మహీంద్రా స్కార్పియో క్లాసిక్​తో పోల్చుకుంటే.. కొత్త స్కార్పియో- ఎన్​ పొడవు 206ఎంఎం, వెడల్పు 97ఎంఎం, వీల్​బేస్​ 70ఎంఎం ఎక్కువగా ఉంది. డిజైన్​ దాదాపుగా మారిపోయింది. రిఫ్రెషింగ్​ లుక్​ వస్తోంది. అంతేకాకుండా.. డీప్​ ఫారెస్ట్​, డాజ్లింగ్​ సిల్వర్​, రాయల్​ గోల్డ్​, నెపోలీ బ్లాక్​, ఎవరెస్ట్​ వైట్​, రెడ్​ రేంజ్​, గ్రాండ్​ కన్యాన్​ వంటి 7 రంగుల్లో ఈ మహీంద్రా స్కార్పియో- ఎన్​ లభిస్తుండటం విశేషం.

Whats_app_banner

సంబంధిత కథనం