M&M shares : మహీంద్రా అండ్ మహీంద్రా లాభాల పంట.. ఎందుకంటే..-mahindr and mahindra company share price climb over 5 percent hit 52 week high ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  M&m Shares : మహీంద్రా అండ్ మహీంద్రా లాభాల పంట.. ఎందుకంటే..

M&M shares : మహీంద్రా అండ్ మహీంద్రా లాభాల పంట.. ఎందుకంటే..

Praveen Kumar Lenkala HT Telugu
Jul 08, 2022 11:59 AM IST

M&M shares: మహీంద్రా అండ్ మహీంద్రా స్టాక్ శుక్రవారం 5 శాతం లాభపడింది.

<p>మహీంద్రా అండ్ మహీంద్రా లాభాల పంట..</p>
మహీంద్రా అండ్ మహీంద్రా లాభాల పంట.. (REUTERS)

న్యూఢిల్లీ, జూలై 8: మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు శుక్రవారం ఆరంభ ట్రేడింగ్‌లో 5 శాతం లాభపడ్డాయి. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ, బ్రిటీష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ (బీఐఐ) కంపెనీలు రెండూ రూ. 1,925 కోట్ల చొప్పున అనుబంధ సబ్సిడరీలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో మహీంద్రా అండ్ మహీంద్రా స్టాక్ భారీ లాభాల్లో ట్రేడవుతోంది.

శుక్రవారం ఈస్టాక్ 5.16 శాతం పెరిగి 52 వారాల గరిష్టానికి చేరుకుంది. ప్రస్తుతం బీఎస్ఈలో రూ. 1,191.90 వద్ద ట్రేడవుతోంది. అలాగే ఎన్‌ఎస్ఈలో 5.43 శాతం పెరిగి రూ. 1,194 వద్ద ట్రేడవుతోంది.

ముంబైకి చెందిన మహీంద్రా అండ్ మహీంద్రా, బీఐఐ కలిపి కొత్త అనుబంధ సంస్థ ‘ఈవీ కో’ స్థాపించనున్నట్టు ప్రకటించాయి.

ఈ ఒప్పందం ప్రకారం బీఐఐ రూ. 1,925 కోట్ల మేర కంపల్సరీ కన్వర్టిబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ విధానంలో పెట్టుబడులు పెడుతుంది. తద్వారా ఈవీ కో లో2.75 శాతం, ఎం అండ్ ఎంలో 4.76 శాతం వాటా కలిగి ఉంటుంది. సంబంధిత వివరాలను ఎంఅండ్ఎం సెబీకి గురువారం నివేదించింది. ఈవీ కో ఫోర్ వీలర్ పాసింజర్ ఎలక్ట్రికల్ వెహికిల్స్ తయారీపై దృష్టి పెడుతుంది.

‘బీఐఐ మాకు ఎస్‌యూవీ ఎలక్ట్రిక్ జర్నీలో భాగస్వామిగా ఉంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. క్లైమేట్ ఎమర్జన్సీని ఎదుర్కొనేందుకు అంకితభావం కలిగిన దీర్ఘకాలిక భాగస్వామి బీఐఐ రూపంలో లభించింది..’ అని మహీంద్రా అండ్ మహీంద్రా సీఈవో అనీశ్ షా అన్నారు.

2040 నాటికి పాజిటివ్ ప్లానెట్ విజన్‌తో ముందుకు సాగుతున్నట్టు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ తెలిపింది.

Whats_app_banner