MG Motor India price hike : వాహనాల ధరలను భారీగా పెంచిన ఎంజీ మోటార్
MG Motor India price hike : ఎంజీ మోటార్ వాహనాల ధరలు పెరిగాయి. ఓ మోడల్‌పై గరిష్ఠంగా రూ. 1లక్ష ప్రైజ్ హైక్ తీసుకుంది ఎంజీ మోటార్.
MG Motor India price hike : జనవరి నుంచి వాహనాల ధరలను పెంచుతామన్న ఆటో సంస్థలు.. మాట నిలబెట్టుకుంటున్నాయి! ఈ జాబితాలో ఎంజీ మోటార్ ఇండియా తాజాగా చేరింది. అన్ని మోడల్స్‌పై ధరలను భారీగా పెంచింది ఎంజీ మోటార్. ఎంజీ గ్లాస్టర్పై ఏకంగా రూ. 1లక్ష ప్రైజ్ హైక్‌ను తీసుకుంది.
ఎంజీ జెడ్ఎస్ ఈవీ
MG ZS EV price hike : ఎంజీ జెడ్ఎస్ ఈవీ ధర రూ. 40వేలు పెరిగింది. జెడ్ఎస్ మోడల్లోని అన్ని వేరియంట్లపై ఈ పెంచిన ధర వర్తిస్తుంది. ఇంటర్నెట్ ఎస్‌యూవీలో 50.3 కేడబ్ల్యూహెచ్ అడ్వాన్స్డ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది 176పీఎస్ పవర్‌ను జనరేట్ చేస్తుంది. రూ. 22.98లక్షల (ఎక్స్‌షోరూం ప్రైజ్) ప్రారంభ ధరతో ఇది లాంచ్ అయ్యింది.
ఎంజీ గ్లాస్టర్..
MG Gloster on road price in Hyderabad : ఎంజీ గ్లాస్టర్ ఎస్‌యూవీలో మూడు వేరియంట్లు ఉన్నాయి. అవి.. సూపర్, షార్ప్, శావి. టర్బో, ట్విన్ టర్బో ఇంజిన్స్ వీటిల్లో ఉంటాయి. సూపర్, షార్ప్ వేరియంట్లపై రూ. 60వేలు పెంచింది ఎంజీ మోటార్. సావీ టర్బో, సావీ ట్విన్ టర్బోపై రూ. 55వేలు, రూ. 1లక్ష వరకు ప్రైజ్ హైక్‌ను తీసుకుంది.
ఎంజీ ఆస్టర్..
MG Astor price hike : ఈ మిడ్ సైజ్ ఎస్యూవీ ధర రూ. 20వేలు పెరిగింది. రూ. 10.51లక్షల (ఎక్స్‌షోరూం) ప్రారంభ ధరతో ఇది లాంచ్ అయ్యింది. రెండు ఇంజిన్ ఆప్షన్స్‌తో వస్తున్న ఎంజీ ఆస్టర్.. మోస్ట్ సెల్లింగ్ మోడల్‌గా గుర్తింపు తెచ్చుకుంది. 6స్పీడ్ ఆటోమెటిక్ బ్రిట్ డైనమిక్ 220 టర్బో పెట్రోల్ ఇంజిన్.. 140పీఎస్ పవర్‌ను జనరేట్ చేస్తుంది. వీటీఐ టెక్ పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ (మేన్యువల్, 8 స్పీడ్ సీవీటీ).. 110 పీఎస్ పవర్‌ను జనరేట్ చేస్తుంది.
దుమ్మురేపిన ఎంజీ మోటార్..
బ్రిటీష్ ఆటోమేకర్ ఎంజీ మోటార్.. ఇండియాలోనూ దూసుకెళుతోంది. 2022 డిసెంబర్లో 3,899 యూనిట్లను విక్రయించి.. 53శాతం వృద్ధిని నమోదు చేసింది. 2021 డిసెంబర్లో కేవలం 2550 యూనిట్లనే అమ్మింది. ఈవీపైనా దృష్టి పెట్టినట్టు.. త్వరలో మరిన్ని మోడల్స్ లాంచ్ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు వెల్లడించింది.
ఇప్పటికే సిట్రోయెన్ సంస్థ వాహనాల ధరలు పెరిగాయి. ఈ నెలలో వాహనాల ధరలను పెంచనున్నట్టు మారుతీ సుజుకీ, టాటా మోటార్స్ వంటి దేశీయ సంస్థలు ఇప్పటికే చెప్పాయి. వీటి నుంచి రేపో, మాపో ప్రకటనలు వెలువడతాయని మార్కెట్ భావిస్తోంది.