Citroen C3 price hike : సిట్రోయెన్ వాహనాల ధరలు పెరిగాయి- ఎంతంటే..
Citroen C3 price hike : తమ సంస్థకు చెందిన మోడల్స్ ధరలను పెంచింది సిట్రోయెన్. గరిష్ఠంగా రూ.50వేల వరకు ప్రైజ్ హైక్ తీసుకుంది. ఆ వివరాలు..
Citroen C3 price hike : నూతన ఏడాదిలో వివిధ ఆటో సంస్థలు తమ వాహనాల ధరలను పెంచుతున్న విషయం తెలిసిందే. తాజాగా.. ఈ బాదుడు 'సిట్రోయెన్' సంస్థ నుంచి మొదలైంది. తమ సంస్థకు చెందిన మోడల్స్ ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది ఈ ఫ్రెంచ్ కార్‌మేకర్. గరిష్ఠంగా రూ. 50వేల వరకు ప్రైజ్ హైక్ తీసుకుంది.
సిట్రోయెన్‌కు చెందిన రెండు మోడల్స్ ప్రస్తుతం ఇండియా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అవి సిట్రోయెన్ సీ3, సిట్రోయెన్ సీ5 ఎయిర్‌క్రాస్. వీటి వేరియంట్స్, పెరిగిన ధరలను తెలుసుకుందాము.
సిట్రోయెన్ సీ3 ధర పెంపు..
Citroen C3 price in Hyderabad : సిట్రోయెన్ సీ3 పెట్రోల్ ఎంటీ లైవ్ పాత ధర రూ. 5.88లక్షలుగా ఉండగా, కొత్త ధర రూ. 5.98లక్షలైంది. అంటే ఈ వేరియంట్‌పై రూ. 10వేలు పెరిగినట్టు. ఇక సిట్రోయెన్ సీ3 పెట్రోల్ ఎంటీ ఫీల్.. పాత ధర రూ. 6.80లక్షలు. రూ. 10వేల పెంపుతో తాజా ధర రూ. 6.90లక్షలుగా మారింది. సిట్రోయెన్ సీ3 1.2లీటర్ పెట్రోల్ ఎంటీ ఫీల్ డ్యూయెల్ టోన్ పాత ధర రూ. 6.95లక్షలు. ఇక రూ. 10వేల పెంపుతో తాజాగా దీని ధర రూ. 7.05లక్షలైంది.
మరోవైపు సిట్రోయెన్ సీ3 1.2లీటర్ పెట్రోల్ ఎంటీ ఫీల్ వైబ్ ప్యాక్ ధర రూ. 6.95లక్షల నుంచి రూ. 7.05లక్షలకు పెరిగింది. అదే సమయంలో సిట్రోయెన్ సీ3 1.2లీటర్ పెట్రోల్ ఎంటీ ఫీల్ వైబ్ ప్యాక్ డ్యూయెల్ టోన్ ధర రూ. 10వేలు పెరిగి రూ. 7.20లక్షలకు చేరింది. 1.2లీటర్ టర్బో పెట్రోల్ ఎంటీ ఫీల్ డ్యూయెల్ టోన్ ధర మాత్రం మారలేదు. ప్రస్తుతం రూ. 8.10లక్షలుగానే ఉంది. చివరిగా.. 1.2లీటర్ టర్బో పెట్రోల్ ఎంటీ ఫీల్ వైబ్ ప్యాక్ డ్యూయెల్ టోన్ పాత ధర రూ. 8.15లక్షల నుంచి రూ. 10వేలు పెరిగి రూ. 8.25లక్షలకు చేరింది.
సిట్రోయెన్ సీ3.. గతేడాది రెండో భాగంలో ఇండియా మార్కెట్లో లాంచ్ అయ్యింది. ధరలు పెంచడం ఇది రెండోసారి.
సిట్రోయెన్ సీ5 ఎయిర్‌క్రాస్..
Citroen C5 Aircross price hike : సిట్రోయెన్ సీ5 ఎయిర్‌క్రాస్‌కు చెందిన రెండు వేరియంట్స్ ధరలు కూడా రూ. 50వేలు పెరిగాయి. 2లీటర్ డీజిల్ ఏటీ షైన్ పాత ధర రూ. 36.67లక్షల నుంచి రూ. 37.17లక్షలకు పెరిగింది. అదే సమయంలో 2లీటర్ డీజిల్ ఏటీ షైన్ డ్యూయెల్ టోన్ రూ. 36.67లక్షల నుంచి రూ. 37.17లక్షలకు చేరింది.
సీ5 ఎయిర్‌క్రాస్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ 2022లో లాంచ్ అయ్యింది. గత మోడల్‌తో పోల్చుకుంటే దీనిని రూ. 3లక్షలు ఎక్కువ ప్రైజ్ పాయింట్‌తో లాంచ్ చేసింది ఫ్రెంచ్ కార్‌మేకర్ సంస్థ. కాగా ఇప్పుడు దీని ధర రూ. 37.17లక్షలుగా ఉంది.
Citroen C5 Aircross price : 2022లో దాదాపు ఆటో సంస్థలన్నీ వాహనాల ధరలను భారీగా పెంచాయి. 2023లోనూ బాదుడుకు సిద్ధమవుతున్నాయి. ముడిసరకు ధరలు పెరుగుతుండటమే ఇందుకు కారణం అని చెబుతున్నాయి.
* పైన చెప్పిన ధరలు అన్నీ ఎక్స్‌షోరూం ప్రైజ్‌లు.
సంబంధిత కథనం