MG Air EV India Launch : ఎంజీ మోటార్​ నుంచి మరో ఈవీ.. లాంచ్​ ఎప్పుడంటే!-mgs most affordable ev to launch next year in india see details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mg Air Ev India Launch : ఎంజీ మోటార్​ నుంచి మరో ఈవీ.. లాంచ్​ ఎప్పుడంటే!

MG Air EV India Launch : ఎంజీ మోటార్​ నుంచి మరో ఈవీ.. లాంచ్​ ఎప్పుడంటే!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Oct 30, 2022 12:58 PM IST

MG Air EV India Launch : ఎంజీ మోటార్​ నుంచి మరో ఈవీ వెహికిల్​ లాంచ్​కు సిద్ధంగా ఉంది. ఆ వివరాలు..

ఎంజీ ఎయిర్​ ఈవీ.. ఇండియాలో లాంచ్​ ఎప్పుడంటే
ఎంజీ ఎయిర్​ ఈవీ.. ఇండియాలో లాంచ్​ ఎప్పుడంటే (HT AUTO)

MG Air EV India Launch : భారత్​ ఎలక్ట్రిక్​ వెహికిల్​ మార్కెట్​పై అనేక ఆటో సంస్థలు కన్నేశాయి. ఇందుకు తగ్గట్టుగానే దేశంలో కొత్త ఎలక్ట్రిక్​ కార్లు దూసుకెళుతున్నాయి. ఇక ఇప్పుడు ప్రముఖ ఆటోమేకర్​ ఎంజీ మోటార్​.. ఇండియాలో తమ రెండో ఎలక్ట్రిక్​ వాహనాన్ని విడుదల చేసేందుకు సన్నద్ధమయ్యింది. సంస్థ నుంచి వస్తున్న అత్యంత చౌకైన ఎలక్ట్రిక్​ వాహనంగా ఇది నిలుస్తుందని సమాచారం. 2023 తొలినాళ్లల్లో ఈ ఎలక్ట్రిక్​ కారును లాంచ్​ చేయనున్నట్టు ఎంజీ మోటార్​ ప్రకటించింది.

ఎంజీ మోటార్​కు 'వులింగ్​' అనే సిస్టర్​ బ్రాండ్​ కూడా ఉంది. ఎంజీ ఎయిర్​ ఈవీ అనే వాహనాన్ని అంతర్జాతీయ మార్కెట్​లో ఈ వులింగ్​ విక్రయిస్తోంది. త్వరలో ఇండియా మార్కెట్​లోకి లాంచ్​ అయ్యే వాహనం ఇదేనని తెలుస్తోంది. ప్రస్తుతానికైతే.. దీనికి ఈ230 అనే కోడ్​నేమ్​ ఇచ్చింది ఎంజీ మోటార్​.

MG Air EV : ఈ ఎంజీ ఎయిర్​ ఈవీని ఇండోనేషియాలో ఇప్పటికే ఆవిష్కరించారు. ఎంజీ మోటార్​.. ఎయిర్​ ఈవీ పేరున మార్చి ఇండియాలో లాంచ్​ చేసే అవకాశం ఉంది. ఇక ఇండియా ప్రమాణాలకు, ప్రజల ఆసక్తులకు తగ్గట్టుగానే.. ఈ వాహనంలో మార్పులు చేయోచ్చు. కాగా.. ఇండియా రోడ్లపై ఈ ఎంజీ ఎయిర్​ ఈవీ టెస్ట్​ డ్రైవ్​లు కూడా మొదలైపోయాయి.

ఈ ఎంజీ ఎయిర్​ ఈవీని జీఎస్​ఈవీ(గ్లోబల్​ స్మాల్​ ఎలక్ట్రిక్​ వెహికిల్స్​) ప్లాట్​ఫాంపై నిర్మించనున్నారు. వేసవిలో వేడి నుంచి బ్యాటరీకి రక్షణ కల్పించే విధంగా బ్యాటరీ మేనేజ్​మెంట్​ సిస్టమ్​ కూడా ఉండొచ్చు. క్లైమేట్​ కంట్రోల్​ యూనిట్​ కూడా మెరుగ్గా ఉండొచ్చు. ఇది హ్యాచ్​బ్యాక్​ మోడల్​లో ఉంటుందని సమాచారం.

MG Air EV features : ఈ ఎంజీ ఎయిర్​ ఈవీ చాలా చిన్నగా ఉంటుంది. ఫుల్​ విడ్త్​ లైట్​ బార్​, క్రోమ్​ స్ట్రిప్​లు.. వెహికిల్​ ముందు భాగంలో కనిపిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్​లో ఈ ఈవీకి స్టీల్​ వీల్స్​ ఉంటాయి. ఇండియా మార్కెట్​లో ఎలాయ్​ వీల్స్​ ఉండొచ్చు.

ఎంజీ ఎయిర్​ ఈవీ బ్యాటరీ సామర్థ్యంపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. అయితే.. 20-25కేడబ్ల్యూహెచ్​ మధ్యలో బ్యాటరీ కెపాసిటీ ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 150కి.మీల దూరం ఇది ప్రయాణించవచ్చు!

ఎంజీ ఎయిర్​ ఈవీ పర్ఫార్మెన్స్​ను చూస్తే.. నగరాల్లో నివసించే వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుందని తెలుస్తోంది.

సంబంధిత కథనం