Mahindra Scorpio-N crash test : సేఫ్టీలో స్కార్పియో- ఎన్‌కు 5 స్టార్ రేటింగ్!
Mahindra Scorpio-N crash test : స్కార్పియో- ఎన్‌కు ఇటీవలే గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ జరిగింది. ఇందులో 5 స్టార్ రేటింగ్ సంపాదించుకుంది.
Mahindra Scorpio-N Global NCAP safety test : మహీంద్రా స్కార్పియో- ఎన్.. స్టైల్‌తో పాటు భద్రతలో కూడా టాప్‌లో నిలిచింది! ఇటీవలే జరిగిన గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్‌లో ఈ వెహికిల్‌కి 5 స్టార్ రేటింగ్ దక్కింది. కొత్త ప్రోటోకాల్స్‌ను అమలు చేసి టెస్ట్ చేసినా, 5 స్టార్ రేటింగ్ దక్కడం విశేషం. ఫలితంగా మహీంద్రా వాహనాలపై ప్రజల్లో నమ్మకం మరింత పెరిగింది.
అడల్ట్ ప్రొటెక్షన్.. చైల్డ్ ప్రొటెక్షన్..
గ్లోబల్ ఎన్సీఏపీ ప్రకారం.. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్ట్‌లో 34 పాయింట్లకు గాను.. స్కార్పియో- ఎన్‌కు 29.25 పాయింట్లు దక్కాయి. అంటే 5 స్టార్ రేటింగ్ వచ్చినట్టు. ఇక చైల్డ్ ప్రొటెక్షన్ సెగ్మెంట్లో ఈ భారీ ఎస్యూవీ.. 49 పాయింట్లకు గాను 28.93 పాయింట్లు వెనకేసుకుంది. ఇందులో 3 స్టార్ రేటింగ్ దక్కినట్టు.
Mahindra Scorpio-N crash test : ఇక డ్రైవర్, ఫ్రెంట్ ప్యాసింజర్ తల, మెడ సేఫ్టీని 'గుడ్' అని పేర్కొంది గ్లోబల్ ఎన్సీఏపీ. అదే సమయంలో డ్రైవర్, ఫ్రెంట్ ప్యాసింజర్ ఛాతి భాగం రక్షణను మార్జినల్‌గా అభివర్ణించింది. సైడ్ ఇంపాక్ట్ టెస్ట్‌లో కూడా ఈ మహీంద్రా స్కార్పియో- ఎన్ మెరుగైన ప్రదర్శనే చేసిందని వివరించింది. 17 పాయింట్లకు గాను.. 16 పాయింట్లు వెనకేసుకుంది.
సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్ట్‌లో 'ఓకే' అనిపించుకుంది మహీంద్రా స్కార్పియో- ఎన్. కానీ ఛాతి రక్షణలో మాత్రం సేఫ్టీ బలహీనంగా ఉంది. బాడీషెల్, ఫుట్‌వెల్ ప్రాంతం స్టేబుల్‌గా ఉంది.
Mahindra Scorpio-N safety : మహీంద్రా స్కార్పియో- ఎన్ క్రాష్ టెస్ట్‌పై గ్లోబల్ ఎన్సీఏపీ జనరల్ సెక్రటరీ ఫురస్ స్పందించారు.
"ప్రజల భద్రతకు పెద్దపీట వేస్తున్న మహీంద్రాకు శుభాకాంక్షలు. చాలా కఠినమైన అడల్ట్ ప్రొటెక్షన్ క్రాష్ టెస్ట్‌లో కూడా మహీంద్రా స్కార్పియో- ఎన్‌కు 5 స్టార్ రేటింగ్ దక్కింది," అని పురస్ పేర్కొన్నారు.
Mahindra Scorpio-N : నూతన ఎన్సీఏపీ సేఫ్టీ ప్రోటోకాల్స్ ప్రకారం.. టార్గెట్ పాయింట్లు సంపాదించడంతో పాటు ఈఎస్సీ, పెడిస్ట్రియన్ ప్రొటెక్షన్, పోల్ సైడ్ ఇంపాక్ట్, సీట్ బెల్ట్ రిమైండర్ వంటి అంశాల్లో కూడా మెరుగైన ప్రదర్శన చేస్తేనే.. సంబంధిత వాహనానికి 5 స్టార్ రేటింగ్ దక్కుతుంది.
స్కార్పియో-ఎన్ రీకాల్..!
మరోవైపు.. క్లచ్ ప్లేట్లలో సమస్యను గుర్తించడంతో స్కార్పియో ఎన్, ఎక్స్‌యూవీ 700 వాహనాలను మహింద్రా సంస్థ వెనక్కు తీసుకుంటోంది. ఆయా వాహనాలను కొనుగోలు చేసిన వారిని డీలర్లు వ్యక్తిగతంగా ఫోన్ చేసి, వివరాలు తెలియజేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం